S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

04/29/2018 - 05:39

తిరుపతి, ఏప్రిల్ 28: తిరుమలలో శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారు చేసేందుకు ఆలయం వెలుపల ఏర్పాటు చేసిన బూందీ పోటులో శనివారం స్వల్ప అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. బూందీ తయారు చేసే సమయంలో బాండలి నుంచి మంటలు ఎగసిపడి పైనున్న నెయ్యి బూజుకు అంటుకుని మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన పోటు సిబ్బంది ముందు మంటలు ఆపే ప్రయత్నం చేస్తూనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు.

04/29/2018 - 04:14

యాదగిరిగుట్ట, ఏప్రిల్ 28: యాదాద్రి శ్రీ లక్ష్మీనర్సింహ స్వామి దేవస్థానంలో స్వామి వారి జయంత్యుత్సవాల్లో భాగంగా శనివారం ఉదయం నిత్యారాధనలు, మూలమంత్ర జపములు, చతుర్విద పారాయణములు జరిగాయి. అనంతరం స్వామి, అమ్మవార్లకు లక్ష పుష్పార్చన కార్యక్రమం నిర్వహించారు.

04/29/2018 - 03:50

హైదరాబాద్, ఏప్రిల్ 28: రైల్వే శాఖకు చెందిన ‘రైల్ ఇండియా టెక్నికల్ అండ్ ఎకనామిక్ సర్వీస్ (ఆర్‌ఐటీఈఎస్)’ సికింద్రాబాద్ ప్రాజెక్టు ఆఫీస్ గ్రూప్ జనరల్ మేనేజర్ (సివిల్) కె.వెంకటేశ్వరరావు రూ.15 లక్షలు లంచం తీసుకుంటూ సీబీఐకి రెడ్‌హేండెడ్‌గా చిక్కా రు. రూ.1.50 కోట్ల పెండింగ్ బిల్లు చెల్లించేందుకు రూ.15 లక్షలు లంచం తీసుకుంటూ అడ్డంగా సీబీఐకి దొరికిపోయారు.

04/29/2018 - 03:46

హైదరాబాద్, ఏప్రిల్ 28: రాష్ట్రంలో వ్యవసాయ రంగానికి పెద్ద పీట వేస్తున్నామని ఐటి పురపాలక మంత్రి కె తారకరామారావు పేర్కొన్నారు. తార్నాకలోని ఐఐసీటీలో తెలంగాణ అకాడమి ఆఫ్ సైన్స్ యువ శాస్తవ్రేత్తలకు అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన యువ శాస్తవ్రేత్తలకు అవార్డులను ప్రదానం చేశారు. దేశంలో శాస్త్ర పరిశోధనలు అధికంగా జరుగుతున్నాయని కేటీఆర్ పేర్కొన్నారు.

04/29/2018 - 04:21

హైదరాబాద్, ఏప్రిల్ 28: రాష్ట్రంలోని కార్మికులందరికీ ఈఎస్‌ఐ సౌకర్యం కల్పించాలని అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు. కార్మికుల సంక్షేమంపై ప్రగతిభవన్‌లో శనివారం నిర్వహించిన ఉన్నతస్థాయి సమావేశంలో మాట్లాడుతూ భవన నిర్మాణ కార్మికులకు బీమా అమలు చేయాలన్నారు. రాష్టవ్య్రాప్తంగా సంఘటిత, అసంఘటిత కార్మికులు ఎంతమంది ఉన్నారు? ఆరోగ్యం, సంక్షేమం, బీమా తదితర అంశాల్లో ప్రస్తుతం తీసుకుంటున్న చర్యలేమిటి?

04/29/2018 - 03:16

హైదరాబాద్, ఏప్రిల్ 28: భారతదేశ రాజకీయల్లో గుణాత్మక మార్పుకోసం ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేస్తున్నామని, ఈ అంశంపై తెలంగాణకు చెందిన ఎన్నారైలు ఆయా దేశాల్లో తెలుగువారు, భారతీయులతో చర్చించాలని సీఎం కే. చంద్రశేఖరరావు కోరారు. వివిధ దేశాలకు చెందిన ఎన్నారై ప్రతినిధులతో ప్రగతి భవన్‌లో శనివారం సమావేశమయ్యారు. అందరితో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు.

04/29/2018 - 03:12

హైదరాబాద్, ఏప్రిల్ 28: సీఎం కే. చంద్రశేఖర్ రావు కుటుంబం బరితెగించి తెలంగాణను దోచుకుంటోందని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ చిల్లర రాజకీయాలకు పాల్పడుతున్నారని, ప్రతిపక్షాలపైన, వ్యవస్థలపైనా అడ్డగోలుగా మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు.

04/29/2018 - 03:18

హైదరాబాద్, ఏప్రిల్ 28: టీజేఏసీ చైర్మన్ పదవికి ప్రొఫెసర్ ఎం. కోదండరామ్ రాజీనామా చేశారు. ఆయన స్థానంలో టీజేఏసీ కన్వీనర్‌గా కె. రఘును ఎన్నుకున్నారు. ప్రొఫెసర్ కోదండరామ్ సారథ్యంలో ఇటీవల తెలంగాణ జన సమితి (టీజేఎస్) రాజకీయ పార్టీ ఏర్పాటైన సంగతి తెలిసిందే. అయితే ఆదివారం టీజేఎస్ ఆవిర్భావ సభ సరూర్‌నగర్ స్టేడియంలో జరగనుంది. సభలో కోదండరామ్‌ను పార్టీ అధ్యక్షునిగా ఎన్నుకుంటారు.

04/29/2018 - 03:11

* ప్రజలు ఆనందంగా లేరు *ఆయనది 420 దీక్ష *వైకాపా అధినేత జగన్ ధ్వజం

04/29/2018 - 02:02

విజయవాడ, ఏప్రిల్ 28: చిత్తూరు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా దివంగత నేత గాలి ముద్దు కృష్ణమ నాయుడు భార్య సరస్వతమ్మకు టీడీపీ అధిష్టానం టిక్కెట్ ఖరారు చేసింది. ముఖ్యమంత్రి, ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు ఈ మేరకు శనివారం నిర్ణయం తీసుకున్నారు. ఉండవల్లిలోని సీఎం నివాసంలో ముఖ్యమంత్రిని గాలి కుటుంబ సభ్యులు కలుసుకున్నారు. గాలి మృతితో ఖాళీ ఏర్పడిన స్థానానికి ఆయన కుమారులు ఇద్దరూ పోటీపడ్డారు.

Pages