S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

06/15/2018 - 04:16

హైదరాబాద్, జూన్ 14: తెలంగాణలోని న్యాయవిద్యా కళాశాల్లో చేరేందుకు నిర్వహించిన లాసెట్ ఫలితాలను ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ టి పాపిరెడ్డి, లా సెట్ చైర్మన్ ప్రొఫెసర్ ఎస్ రామచంద్రం, కన్వీనర్ ప్రొఫెసర్ ఎస్ బి ద్వారకానాధ్ విడుదల చేశారు.

06/15/2018 - 04:15

హైదరాబాద్, జూన్ 14: కమిషన్ పెంచాలి, ఉద్యోగులుగా పరిగణించాలి, బకాయిలు చెల్లించాలన్న తదితర ప్రధాన డిమాండ్లతో నిరవధిక సమ్మెకు నోటిసు ఇచ్చిన రేషన్ షాపుల డీలర్లు ఏమాత్రం వెనక్కి తగ్గే పరిస్థితి కనిపించడం లేదు. దీంతో వచ్చే నెల నుంచి రాష్టవ్య్రాప్తంగా రేషన్ షాపులు మూత పడటం ఖాయంగా కనిపిస్తోంది. డీలర్ల సమ్మెకు హమాలీల సంఘీభావం కూడా తోడుకావడంతో రేషన్ షాపుల ఆందోళన చేయి దాటే పరిస్థితి ఏర్పడింది.

06/15/2018 - 04:15

హైదరాబాద్, జూన్ 14: ఆంగ్లం- విదేశీ భాషల విశ్వవిద్యాలయంలో 2018-19 విద్యాసంవత్సరానికి అడ్మిషన్ల ప్రక్రియ గురువారం నాడు ప్రారంభం అయ్యింది. బిఎ, బిఇడి, పీజీ డిప్లొమోలు, ఎంఎ ఫారెన్ లాం గ్వేజి కోర్సులకు గురువారం అడ్మిషన్లు జరిగాయి. శుక్రవారం కూడా మిగిలిన సీట్లకు అడ్మిషన్లు జరుగుతాయని యూనివర్శిటీ వీసీ ప్రొఫెసర్ ఇ సురేష్‌కుమార్ చెప్పారు.

06/15/2018 - 04:13

హైదరాబాద్, జూన్ 14: రాష్ట్రంలోని స్వయం సహా య గ్రూపులకు ట్యాబ్లెట్ పీసీలను (పర్సనల్ కంప్యూటర్) అందిస్తున్నామని పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. సచివాలయంలో గురువారం ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో స్ర్తి నిధి బ్యాంకు సహకారంతో 25 సంఘాలకు లాంఛనంగా ట్యాబ్లెట్ పీసీలను అందించారు. రాష్ట్ర వ్యాప్తంగా వెంటనే ట్యాబ్లెట్ పీసీలు అందించే ఏర్పాట్లు చేశామన్నారు.

06/15/2018 - 04:12

హైదరాబాద్, జూన్ 14: డిగ్రీ కాలేజీల్లో ప్రవేశానికి నిర్వహించిన ఆన్‌లైన్ ప్రక్రియ ‘దోస్త్’ తప్పుల తడకగా మారిందని గుర్తింపు పొందిన డిగ్రీ, పీజీ కాలేజీల యాజమాన్య సంఘం అధ్యక్షుడు జి రమణారెడ్డి, ప్రధానకార్యదర్శి టి విజయభాస్కరరెడ్డి, సలహాదారు బైరెడ్డి లక్ష్మారెడ్డిలు ఆరోపించారు.

06/15/2018 - 04:11

హైదరాబాద్, జూన్ 14: రాష్ట్రంలోని 26 ప్రధాన దేవాలయాలకు నాన్-హెరిడిటీ పాలక మండళ్లను నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పాలక మండళ్లలో సభ్యులుగా ఎంపిక చేసేందుకు వీలుగా భక్తులెవరైనా దరఖాస్తు చేసుకోవచ్చని రెవెన్యూ (దేవాదాయ) శాఖ ముఖ్యకార్యదర్శి ఎన్. శివశంకర్ తెలిపారు. ఈ మేరకు గురువారం ఒక జీఓ జారీ అయింది.

06/15/2018 - 04:10

హైదరాబాద్, జూన్ 14: రాష్ట్ర విభజన సమయంలో కేంద్రం ఇచ్చిన హామీలు సాధించడంలో సీఎం కేసీఆర్ ఘోరంగా విఫ లం అయ్యారని శాసనమండలి ప్రతిపక్ష నేత షబ్బీర్ అలీ విమర్శించారు. గురువారం ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డితో కలిసి మాట్లాడారు. సీఎం కేసీఆర్ వ్యక్తిగత ప్రయోజనాలకే అధి క ప్రాధాన్యం ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

06/15/2018 - 04:09

హైదరాబాద్, జూన్ 14: రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర సచివాలయ ఉద్యోగుల సంఘం సంయుక్తంగా గురువారం ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ముస్లింమహిళలకు ప్రభుత్వం తరఫున గిఫ్ట్ ప్యాక్‌లను ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీ, ప్రభుత్వ సలహాదారు (ముస్లిం మైనారిటీ) ఏకే ఖాన్, సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు నరేందర్‌రావు తదితరులు పంపిణీ చేశారు.

06/15/2018 - 04:09

హైదరాబాద్, జూన్ 14: కార్పోరేట్ విద్యా సంస్థల దోపిడిని అరికట్టేందుకు ఫీజు నియంత్రణ చట్టాన్ని తీసుకురావాలని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరిని తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం కోరింది.

06/15/2018 - 04:08

హైదరాబాద్, జూన్ 14: కేంద్రప్రభుత్వ సంస్థ సెంట్రల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ప్లాస్టిక్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీలో డిప్లొమో, పోస్టు డిప్లొమో, పోస్టు గ్రాడ్యూయేట్ డిప్లొమో కోర్సులకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులను స్వీకరిస్తోంది.

Pages