S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

10/13/2018 - 06:34

ఖమ్మం: ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల పరిధిలో తెరాస అభ్యర్థులకు వ్యతిరేకంగా పనిచేస్తున్న అసమ్మతి నేతలందరినీ రాజధానికి వచ్చి కలవాల్సిందిగా అధిష్ఠానం ఆదేశించింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఖమ్మం, పాలేరు మినహా మిగిలిన ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాల్లో అసమ్మతి నేతలు పార్టీ అభ్యర్థులకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారు.

10/13/2018 - 01:42

హైదరాబాద్, అక్టోబర్ 12: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోలీస్ బందోబస్తు, తదితర అంశాలపై రాష్ట్ర ఎన్నికల ముఖ్య అధికారి రజత్‌కుమార్ శుక్రవారం ఇక్కడ ఉన్నతస్థాయి సమీక్ష జరిపారు. ఎన్నికల కోడ్‌ను తూ.చ తప్పకుండా పాటించడానికి చర్యలు తీసుకోవాలని పోలీసు ఉన్నతాధికారులను ఆయన ఆదేశించారు. సమస్యాత్మక ప్రాంతాల్లో ఏరియల్ సర్వే కోసం హెలీకాప్టర్‌ను వినియోగించడానికి ఈసీ అనుమతి ఇస్తుందని ఆయన చెప్పారు.

10/13/2018 - 01:34

హైదరాబాద్, అక్టోబర్ 12: ఎల్‌ఎల్‌బీ, ఎల్‌ఎల్‌ఎం కోర్సుల్లో ప్రవేశానికి ఈ నెల 22 నుండి లాసెట్ కౌనె్సలింగ్ నిర్వహించనున్నట్టు ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ టి పాపిరెడ్డి, లాసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ ఎస్ బీ ద్వారకానాధ్ తెలిపారు. సర్ట్ఫికేట్ల పరిశీలన ఈ నెల 25వ తేదీ వరకూ జరుగుతుందని చెప్పారు. వెబ్ ఆప్షన్లను ఈ నెల 23 నుండి 27 వరకూ నమోదు చేసుకోవచ్చని అన్నారు.

10/13/2018 - 01:33

హైదరాబాద్, అక్టోబర్ 12: టీఆర్‌ఎస్‌కు రోజులు దగ్గర పడ్డాయని టీ.పీసీసీ అధ్యక్షుడు ఎన్. ఉత్తమ్‌కుమార్ రెడ్డి విమర్శించారు. బీజేపీ అధ్యక్షుడు అమీత్ షా, అపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ కలిసి డ్రామా చేస్తున్నారని ఆయన శుక్రవారం తనను కలిసిన విలేఖరులతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ అన్నారు. రాష్ట్రంలో అమీత్ షా పర్యటన ఒక డ్రామా అని ఆయన దుయ్యబట్టారు.

10/13/2018 - 01:33

హైదరాబాద్, అక్టోబర్ 12: తెలంగాణ రాష్ట్ర సమితి ప్రకటించిన అభ్యర్థులపై రేగిన అసమ్మతి సెగలు దాదాపు సద్దుమణిగినట్టే కనిపిస్తోంది. అయితే అధిష్ఠానం బుజ్జగింపుతో చల్లబడిన నేతలు సహకరిస్తారా? లేదా? అనే అనుమానాలు అభ్యర్థుల్లో ఇంకా వ్యక్తమవుతూనే ఉన్నాయి.

10/13/2018 - 01:32

హైదరాబాద్, అక్టోబర్ 12: డిటెన్షన్ విధానంతో బాధపడుతున్న ఇంజనీరింగ్ విద్యార్థులు కోఠీ ఏరియాలో టవర్ ఎక్కి ఆత్మహత్య చేసుకుంటామంటూ బెదిరించారు. గత రెండు నెలలుగా డిటెన్షన్ వివాదం రాజుకుంటోంది. డిటెన్షన్ నిబంధనలకు ఎక్కువ శాతం విద్యార్థులు ఫెయిల్ కావడం, పదే పదే పరీక్షలు రాయాల్సి రావడంతో ఇంజనీరింగ్ విద్యార్థుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.

10/13/2018 - 01:31

హైదరాబాద్, అక్టోబర్ 12: రానున్న ఎన్నికల్లో కేసీఆర్, నరేంద్రమోదీలకు ప్రజాకోర్టులో శిక్ష తప్పదని టీటీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్ రమణ హెచ్చరించారు. కేసీఆర్ ఇచ్చిన హామీలను ఇంత వరకూ నెరవేర్చలేదని కేసీఆర్ ప్రకటించిన అభ్యర్ధులను హామీలపై నిలదీస్తే పారిపోయే పరిస్థితి కనిపిస్తోందని అన్నారు.

10/13/2018 - 01:30

హైదరాబాద్, అక్టోబర్ 12: దామోదర్ రాజనర్సింహ సతీమణి పద్మిని రెడ్డి ఇప్పటికీ బీజేపీ సానుభూతిపరురాలేనని బీజేపీ నేత జీ కిషన్‌రెడ్డి పేర్కొన్నారు.

10/13/2018 - 01:30

హైదరాబాద్, అక్టోబర్ 12: ముందస్తు ఎన్నికలపై చర్చించేందుకు ఈ నెల 14న (ఆదివారం) తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర స్థాయి విస్తృత స్థాయి సమావేశం జరగనున్నది.

10/13/2018 - 01:29

హైదరాబాద్, అక్టోబర్ 12: రాష్ట్ర అపద్ధర్మ హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి చేసిన వ్యాఖ్యలను ఎన్నికల సంఘం సుమోటోగా తీసుకుని కేసు నమోదు చేయాలని టీ.పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎ. రేవంత్ రెడ్డి కోరారు.

Pages