S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

11/15/2017 - 02:06

హైదరాబాద్, నవంబర్ 14: ప్రజా ప్రయోజనాల కోసమే రాష్ట్ర ప్రభుత్వం అప్పులు చేస్తుందని ఆర్ధిక మంత్రి ఈటెల రాజేందర్ స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం, ఇతర ఆర్ధిక సంస్థల నుండి రాష్ట్ర ప్రభుత్వం ఇంత వరకూ 22,485.06 కోట్లు రుణం తీసుకుందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మొత్తం అప్పుల పరిమాణం 1.35 లక్షల కోట్లు ఉందని అన్నారు.

11/15/2017 - 02:05

హైదరాబాద్, నవంబర్ 14: రాష్ట్రంలో గోదాముల నిర్మాణానికి 1024 కోట్ల రూపాయిలు ఖర్చు చేసినట్టు మార్కెటింగ్ మంత్రి హరీష్‌రావు చెప్పారు. శాసనసభ ప్రశ్నోత్తర కార్యక్రమంలో కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, ఆరూరి రమేష్ , పువ్వాడ అజయ్‌కుమార్‌లో అడిగిన ప్రశ్నలకు మంత్రి బదులిస్తూ గిడ్డంగుల నిల్వ సామర్ధ్యం పెంచామని అన్నారు. గోదాముల సామర్ధ్యం 22.2 లక్షల మెట్రిక్ టన్నులకు పెరిగిందని అన్నారు.

11/15/2017 - 02:05

హైదరాబాద్, నవంబర్ 14: టిఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చిన ఈ మూడేళ్ళలో ఒక్క టీచర్ పోస్టు భర్తీ చేయలేదని బిజెపి ఎమ్మెల్యే డాక్టర్ కె. లక్ష్మణ్ విమర్శించారు. భర్తీ చేసిన ఉద్యోగాలపై శే్వతపత్రం విడుదల చేయాలని, నిరుద్యోగులకు భరోసా కల్పించేందుకు ఉద్యోగ నియామకాల క్యాలెండర్ ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు.

11/15/2017 - 02:03

హైదరాబాద్, నవంబర్ 14: మన ఆరోగ్యాన్ని కాపాడే విధంగా పంటల ఉత్పత్తి జరిగేలా వ్యవసాయ శాస్తవ్రేత్తలు చర్యలు తీసుకోవాలని గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్ కోరారు. బాలల దినోత్సవం సందర్భంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం రాజ్‌భవన్‌లో మంగళవారం ఏర్పాటు చేసిన ‘వ్యవసాయ ఉత్పత్తుల’ ప్రదర్శనను తిలకించారు. గవర్నర్ నరసింహన్‌తో పాటు లేడీ గవర్నర్ విమల కూడా ఈ ప్రదర్శనను తిలకించారు.

11/15/2017 - 02:02

హైదరాబాద్, నవంబర్ 14: ప్రభుత్వ ఉద్యోగులు, పింఛను దారులు, జర్నలిస్టులకు ఉచిత వైద్య సదుపాయం అందించేందుకు రాష్ట్రంలో 14 వెల్‌నెస్ సెంటర్లు ఏర్పాటు చేశామని వైద్య ఆరోగ్య మంత్రి లక్ష్మారెడ్డి చెప్పారు. శాసనసభ ప్రశ్నోత్తర కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఉద్యోగులు, పింఛను దారులు, జర్నలిస్టులు నుండి ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా ఉచిత వైద్యం అందిస్తున్నామని స్పష్టం చేశారు.

11/15/2017 - 02:02

హైదరాబాద్, నవంబర్ 14: రాష్టస్థ్రాయిలో బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకోసం కమిటీలు ఏర్పాటు చేశామని రాష్ట్ర కార్మిక మంత్రి నాయని నిర్సింహారెడ్డి పేర్కొన్నారు. శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా బాల కార్మిక నిర్మూలనపై సభ్యులు వేముల వీరేశం, దాస్యం వినయ్ భాస్కర్‌లు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానం చెప్పారు. రెడ్‌క్రాస్, ఎన్‌జిఓలతో కలిసి అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని మంత్రి తెలిపారు.

11/13/2017 - 05:52

హైదరాబాద్, నవంబర్ 12: తెలంగాణ సర్కార్ ప్రతిష్టాకరంగా చేపట్టిన భూమి సర్వే పనులు 4వేల గ్రామాల్లో పూర్తయింది. మొత్తం 10806 గ్రామాల్లో భూమి రికార్డుల్లో తప్పులు సరిదిద్దేందుకు, భూ సర్వే పనులు చేపట్టాలని రాష్ట్రప్రభుత్వం సెప్టెంబర్ 15న బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టిన సంగతి విదితమే. వచ్చే వారం రోజుల్లో 3వేల గ్రామాల్లో భూమిరికార్డులను పూర్తి స్ధాయిలో అప్‌డేట్ చేయనున్నారు.

11/13/2017 - 05:36

హైదరాబాద్, నవంబర్ 12: మూడేళ్లలో ఎంత మార్పు. 2014లో తెలంగాణలో కరెంటు అస్తమానం పోయేది. కోతలతో పరిశ్రమలు తరలివెళ్లనున్నాయనే దుష్ప్రచారం జరిగింది. ఈ రోజు రెప్పపాటు కూడా కరెంటుపోకుండా ఒకవైపు వ్యవసాయానికి, మరోవైపు పారిశ్రామిక, గృహ వినియోగదారులకు తెలంగాణలో కరెంటు సరఫరా అవుతోంది. వ్యవసాయానికి 24 గంటల విద్యుత్ ఇవ్వడమంటే ఆషామాషీ కాదు.

11/13/2017 - 05:35

హైదరాబాద్, నవంబర్ 12: తెలంగాణలో కానిస్టేబుళ్ల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 3,897 కానిస్టేబుళ్ల భర్తీకి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వీటిలో 907 మంది సివిల్ కానిస్టేబుళ్లు, 2,990 ఆర్మ్డ్ రిజర్వ్ కానిస్టేబుల్ పోస్టులు భర్తీ కానున్నాయి. త్వరలో నోటిఫికేషన్ జారీ చేసి పోస్టులను భర్తీ చేస్తారని హోంశాఖ తెలిపింది.
భారీగా బదిలీలు

11/13/2017 - 05:35

హైదరాబాద్, నవంబర్ 12: తెలంగాణ పోలీస్ అకాడమీలో ఆదివారం పదవీ విరమణ చేసిన అనురాగ్ శర్మకు ఘనంగా వీడ్కోలు పలికారు. అనురాగ్ శర్మ 11 పోలీస్ బృందాల గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈ వీడ్కోలు పరేడ్‌లో కొత్త డీజీపీ మహేందర్‌రెడ్డి, ఐపిఎస్, డిఐజీ, ఐజీ, సీఐడీ అధికారులతోపాటు పలువురు పాల్గొన్నారు. పోలీస్ గౌరవ వందనాన్ని స్వీకరించిన అనురాగ్ శర్మ సభలో ప్రసంగించారు.

Pages