S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

09/15/2019 - 04:50

యాదగిరిగుట్ట, సెప్టెంబర్ 14: యాదాద్రిలో ప్రభుత్వం పేదవాళ్ల వద్ద ప్రజాధనంతో కొనుగోలు చేసిన భూములను త్రిదండి చినజీయర్ ట్రస్టుకు కేటాయించడాన్ని కాంగ్రెస్ తీవ్రంగా ఖండిస్తుందని, ప్రభుత్వం వెంటనే తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనరసింహ డిమాండ్ చేశారు.

09/15/2019 - 04:48

మహబూబ్‌నగర్, సెప్టెంబర్ 14: మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో ఏ ఒక్క డెంగ్యూ కేసు కూడా రాకుండా జాగ్రత్త పడాలని మున్సిపల్ అధికారులను మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ఆదేశించారు. శనివారం జిల్లా కలెక్టర్ రోనాల్డ్‌రోస్‌తో కలిసి మహబూబ్‌నగర్ మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ సిబ్బందికి డెంగ్యూ నివారణకు చేపట్టాల్సిన చర్యలపై మార్గదర్శకాలు చేస్తూ ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు.

09/15/2019 - 04:46

నాగర్‌కర్నూల్, సెప్టెంబర్ 14: పని ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్యయాత్నానికి పాల్పడిన గుమ్మకొండ జూనియర్ పంచాయితీ కార్యదర్శి స్రవంతి చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి మృతి చెందింది. స్రవంతి భర్త 8నెలల క్రింద ప్రమాదంలో మృతి చెందగా, ఆమెకు ఇద్దరు పిల్లలు ఉన్నారు.

09/15/2019 - 04:44

పాలకుర్తి, సెప్టెంబర్ 14: రాష్ట్రంలో నిజాం నిరంకుశ పాలన అంతమైన, నయా దోపిడీదార్ల పాలన సాగుతుందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి విమర్శించారు. ఇండియన్ యూనియన్‌లో తెలంగాణ విలీనమై 73ఏండ్లు అవుతున్నందున సాయుధ పోరాటంలో అమరులను స్మరిస్తూ, విలీనదినం ప్రభుత్వం సెప్టెంబర్ 17న అధికారికంగ నిర్వహించలనే డిమాండ్‌తో సీపీఐ పార్టీ అధ్వర్యంలో నిర్వహిస్తున్న బస్సుయాత్ర శనివారం పాలకుర్తికి చెరుకుంది.

09/15/2019 - 04:42

వరంగల్, సెప్టెంబర్ 14: రాష్ట్రంలో తక్షణమే హెల్త్ ఎమర్జెన్సీ డిక్లేర్ చేయాలని ఏఐసీసీ అధికార ప్రతినిధి డాక్టర్ దాసోజు శ్రవణ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో వెంటిలేటర్ సౌకర్యం పెంచాలంటూ డిమాండ్ చేస్తూ ఆల్ ఇండియా ప్రొఫెషనల్ కాంగ్రెస్ శనివారం వరంగల్ ఎకశిల పార్కు ఎదురుగా చేపట్టిన ఒక్క రోజు నిరహార దీక్ష కార్యక్రమంలో ఆయన పాల్గొని సంఘీభావం తెలిపారు.

09/15/2019 - 04:40

నాగార్జునసాగర్, సెప్టెంబర్ 14: నాగార్జునసాగర్ జలాశయానికి శ్రీశైలం నుండి వస్తున్న వరదనీరు శనివారం నాడు కొద్ది మేరకు తగ్గుముఖం పట్టింది. శుక్రవారం రాత్రి వరకు 26 గేట్ల ద్వారా నీటి విడుదల చేసిన అధికారులు శుక్రవారం అర్ధరాత్రి నుండి 22 గేట్ల ద్వారా నీటి విడుదల చేశారు.

09/15/2019 - 04:00

హైదరాబాద్, సెప్టెంబర్ 14:రాష్ట్రంలో జూనియర్, డిగ్రీ కాలేజీల్లో పని చేస్తున్న కాంట్రాక్టు లెక్చరర్లను బదిలీ చేయడానికి ఉన్న నిబంధనలను ఎత్తివేయాలని అధికార ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వరరెడ్డి ప్రభుత్వానికి సూచించారు.

09/15/2019 - 03:59

హైదరాబాద్, సెప్టెంబర్ 14: తెలంగాణ రాష్ట్రప్రభుత్వం ప్రతి ఏటా సెప్టెంబర్ 17వ తేదీన తెలంగాణ విమోచన దినోత్సవాన్ని నిర్వహించేటట్లుగా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ ఆధ్వర్యంలో ప్రతినిధులు గవర్నర్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. శనివారం వారు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌ను రాజ్‌భవన్‌లో కలిశారు.

09/15/2019 - 03:58

హైదరాబాద్, సెప్టెంబర్ 14: రాష్ట్రంలో త్వరలో నియమించబోయే తొమ్మిది వైస్ చాన్స్‌లర్ పోస్టులలో బీసీలకు జనాభా ప్రకారం 50 శాతం పోస్టులను ఇవ్వాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన శనివాం బీసీ ప్రతినిధల బృందంతో కలిసి తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌కు వినతి పత్రం అందజేశారు.

09/15/2019 - 03:58

హైదరాబాద్, సెప్టెంబర్ 14: ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ నిరాశజనకంగా ఉందని, బడ్జెట్‌లో విద్య, వైధ్య రంగాలకు తగిన కేటాయింపులు లేవని బీజేపీ ఎమ్మెల్సీ ఎన్.రాంచందర్ రావు ఆరోపించారు. శాసన మండలిలో మధ్యాహ్నం బడ్జెట్‌పై జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు.

Pages