S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

03/16/2019 - 00:02

హైదరాబాద్, మార్చి 15: హిందూజా కంపెనీకి లోగడ అప్పగించిన 11 ఎకరాల భూమిని వెనక్కి తీసుకోవాలని ఏఐసీసీ నాయకుడు, మాజీ ఎంపీ వి. హనుమంత రావు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ భూములపై ఎన్‌ఫోర్సుమెంట్ డైరెక్టరేట్ ఇనె్వస్టిగేషన్ చేసి సీబీఐకి నివేదిక పంపించినా, సీబీఐ ఇంత వరకు చర్యలు తీసుకోలేదని ఆయన శుక్రవారం విలేఖరుల సమావేశంలో అన్నారు.

03/15/2019 - 23:56

హైదరాబాద్, మార్చి 15: శాసనసభలో కాంగ్రెస్ పార్టీ మనుగడనే ప్రశ్నార్ధకంగా మారే పరిస్థితి ఏర్పడింది. టీఆర్‌ఎస్‌లోకి ఆ పార్టీ ఎమ్మెల్యేల వలసలు కొనసాగుతోనే ఉన్నాయి.

03/15/2019 - 23:53

హైదరాబాద్, మార్చి 15: రోజుకో ఎమ్మెల్యే ‘చే’జారుతుండడంతో కాంగ్రెస్ నేతలు, కార్యకర్తల్లో ఆందోళన ప్రారంభమైంది. లోక్‌సభ ఎన్నికల ముందు పార్టీ ఎమ్మెల్యేలు అధికార పార్టీలోకి చేరుతుండడంతో పార్టీ నాయకులు, కార్యకర్తలు కలవరపడుతున్నారు.

03/15/2019 - 23:51

హైదరాబాద్, మార్చి 15: తెలంగాణ రాష్ట్ర సమితి పార్లమెంట్ ఎన్నికల ప్రచారానికి పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఆదివారం శంఖారావం పూరించబోతున్నారు. ఎన్నికలు ఏవైనా కరీంనగర్ నుంచే శంఖారావాన్ని పూరించడం టీఆర్‌ఎస్‌కు సెంటిమెంట్. శాసనసభ ఎన్నికల ప్రచారానికి కూడా కరీంనగర్ నుంచే కేసీఆర్ శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే.

03/15/2019 - 23:12

ఖమ్మం, మార్చి 15: తెలంగాణ రాష్ట్రంలో మహిళల ఆర్థిక స్వావలంబన చాలా బాగున్నదని, మహిళలు ఎంతో చైతన్యవంతులుగా ఉన్నారని ఉత్తరప్రదేశ్ రాష్ట్ర మహిళా ప్రతినిధులు పేర్కొన్నారు. ఖమ్మం జిల్లా కారేపల్లి మండలంలో స్వయం సహాయక సంఘాల పనితీరును శుక్రవారం ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం లలిత్‌పూర్ జిల్లా మహిళా సమాఖ్య ప్రతినిధులు పరీశీలించి మహిళల ఆర్థిక స్వావలంబన పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు.

03/15/2019 - 21:21

మహబూబాబాద్, మార్చి 15: రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఎలాంటి అసాంఘీక సంఘటనలు చోటుచేసుకోకుండా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయాలని తెలంగాణ రాష్ట్ర నార్త్‌జోన్ ఐజీ వై.నాగిరెడ్డి అన్నారు. శుక్రవారం మహబూబాబాద్‌లో అక్కడి ఎస్పీ కోటిరెడ్డి, కొత్తగూడెం ఎస్పీ సునీల్‌దత్, ములుగు ఎస్పీ సంగ్రామ్‌సింగ్ పాటిల్ లతో సమన్వయ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..

03/15/2019 - 21:19

నిజామాబాద్, మార్చి 15: దశాబ్దాల తరబడి అధికారంలో కొనసాగినప్పటికీ ఆశించిన స్థాయిలో అభివృద్ధి చేయలేకపోయిన జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలకు ప్రత్యామ్నాయంగా ప్రస్తుతం యావత్ భారతదేశ ప్రజలంతా ప్రాంతీయ పార్టీల వైపే దృష్టిని కేంద్రీకరిస్తున్నారని నిజామాబాద్ పార్లమెంటు సభ్యురాలు కల్వకుంట్ల కవిత అన్నారు.

03/15/2019 - 21:16

గజ్వేల్, మార్చి 15: ప్రశ్నించే గొంతు లేకపోతే ప్రజాస్వామ్య మనుగడ ప్రశ్నార్థకమవుతుందని పట్ట్భద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి జీవన్‌రెడ్డి స్పష్టం చేశారు. శుక్రవారం గజ్వేల్‌లో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో ఆయన ప్రసంగించారు. నాలుగున్నర దశాబ్దాలుగా ప్రజా జీవితంలో ఉంటూ పేదల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్న తాను ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందినట్లు పేర్కొన్నారు.

03/15/2019 - 21:15

సూర్యాపేట, మార్చి 15: నూతనంగా ఆవిర్భవించిన తెలంగాణ రాష్ట్రంలో అధికారం చేపట్టిన టీఆర్‌ఎస్ పార్టీ అనతికాలంలోనే దేశంలో అనేక సంచలనాలు సృష్టించిందని, త్వరలో జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో సైతం రికార్డు స్ధాయిలో మెజార్టీలు సాధించి చరిత్ర సృష్టించనున్నామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు.

03/15/2019 - 21:14

కరీంనగర్, మార్చి 15: కేంద్రంలో భారత ప్రధాని అభ్యర్థిని నిర్ణయించే శక్తి, యుక్తిగా తెరాస అవతరించనుందని, రానున్నది సంకీర్ణ యుగమే దేశ రాజకీయాలను శాసించే యుగంగా మారనుందని కరీంనగర్ ఎంపీ బోయినిపల్లి వినోద్ కుమార్ అన్నారు. కరీంనగర్‌లో ఈ నెల 17న జరిగే కేసీఆర్ బహిరంగ సభకు జనసమీకరణ కోసం ఏర్పాటు చేసిన సమావేశాల్లో శుక్రవారం ఎంపీ వినోద్ కుమార్ పాల్గొన్నారు.

Pages