S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

04/23/2017 - 01:45

హైదరాబాద్, ఏప్రిల్ 22: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథకు మరోసారి జాతీయ అవార్డు లభించింది. వౌలిక వసతుల కల్పనలో మిషన్ భగీరథ వినూత్నమైన పథకమని ప్రశంసించిన హడ్కో ఈ పథకానికి రెండోసారి అవార్డు ప్రకటించింది. తెలంగాణలో కోట్లాది మంది ప్రజలకు మంచి నీటిని అందించాలన్న సంకల్పంతో సాగుతున్న మిషన్ భగీరథలో తాము భాగస్వామిగా కావడాన్ని గర్వంగా భావిస్తున్నట్టు హడ్కో పేర్కొంది.

04/23/2017 - 01:45

హైదరాబాద్, ఏప్రిల్ 22: తెలంగాణలోని అన్ని మున్సిపాలిటీల్లో రోడ్లు, వౌలిక సదుపాయాలు కల్పించడంలో భాగంగా తప్పనిసరిగా మాస్టర్ ప్లాన్ (బృహత్తర ప్రణాళిక)ను ఖరారు చేసేందుకు రాష్ట్ర మున్సిపల్ శాఖ విధి విధానాలను రూపొందించింది. వచ్చే ఏడాది జూన్ 2వ తేదీకి తెలంగాణ రాష్ట్రం అవతరించి నాలుగేళ్లు అవుతుంది.

04/23/2017 - 01:44

హైదరాబాద్, ఏప్రిల్ 22: వరంగల్‌లో భారీ బహిరంగ సభ నిర్వహించడం ద్వారా ముందస్తుగానే ప్రత్యర్థులపై పైచేయి సాధించే వ్యూహాన్ని తెరాస అమలు చేస్తోంది. ఉద్యమ సమయంలో తెరాస వరంగల్‌లో నిర్వహించిన భారీ బహిరంగ సభ తెలంగాణ ఉద్యమానికి ఉత్తేజాన్నిచ్చింది.

04/22/2017 - 05:23

హైదరాబాద్, ఏప్రిల్ 21: ‘మాది ఉద్యమం నుంచి వచ్చిన పార్టీ. కడుపు కట్టుకొని ఉద్యమ స్ఫూర్తితో అవినీతిరహిత పాలన అందిస్తున్నాం. అయినప్పటికీ ప్రతిపక్షాలు అవాకులు, చెవాకులతో నిరాధార ఆరోపణలు చేస్తున్నాయి. ఇలాంటి ఆరోపణలను ఎంత మాత్రం సహించేది లేదు. ఏ శాఖపై ఆరోపణలు చేస్తే ఆ శాఖ మంత్రి స్పందించి శాఖపరంగా కేసులు పెడతారు’ అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు హెచ్చరించారు.

04/22/2017 - 05:22

హైదరాబాద్, ఏప్రిల్ 21: టిఆర్‌ఎస్ 16వ ప్లీనరీ వేదికపై పార్టీ నేతలు ముగ్గురు భూరి విరాళాన్ని ప్రకటించారు. మల్కాజ్‌గిరి ఎంపి సిహెచ్ మల్లారెడ్డి, ఎమ్మెల్సీ, వక్ఫ్‌బోర్డు చైర్మన్ సలీం కోటి రూపాయాల చొప్పున విరాళాన్ని ప్రకటించి పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కెసిఆర్‌కు చెక్ అందజేశారు. అలాగే నల్లగొండ జిల్లాకు చెందిన పార్టీ నాయకుడు తేర చిన్నపరెడ్డి రూ. 25 లక్షల చెక్క్‌ను అందజేశారు.

04/22/2017 - 05:21

హైదరాబాద్, ఏప్రిల్ 21: తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షునిగా ముఖ్యమంత్రి కెసిఆర్ ఎనిమిదవ సారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రెండేళ్ల కోసారి జరిగే ఎన్నికల్లో పార్టీ అధ్యక్షుడిని ఎన్నుకుంటారు. ప్లీనరీ సభలోనే అధ్యక్షుని ఎన్నిక ప్రకటన చేస్తారు. కొత్త అధ్యక్షుని అధ్యక్షతన ప్లీనరీ జరుగుతుంది. తొలుత ప్లీనరీలో అధ్యక్షుని ఎన్నిక ఉంటుందని తెలిపినా తర్వాత మార్చారు.

04/22/2017 - 05:16

హైదరాబాద్, ఏప్రిల్ 21:గ్రామీణ తెలంగాణను కేంద్రంగా చేసుకుని టిఆర్‌ఎస్ ప్లీనరీ సాగింది. రైతులు, కుల వృత్తులు, గ్రామీణ ప్రజానీకం, సంక్షేమ పథకాలు వంటి అంశాలను ప్రధానంగా ప్రస్తావించారు. 2019 ఎన్నికల కోసం టిఆర్‌ఎస్ రాజకీయ ఆయుధాలు ఇవే అని తేల్చి చెప్పే విధంగా ప్లీనరీ పార్టీ శ్రేణులకు స్పష్టమైన సందేశం ఇచ్చింది.

04/22/2017 - 04:05

హైదరాబాద్, ఏప్రిల్ 21: సరస్వతి నిలయాలుగా ఉండాల్సిన విద్యాసంస్థలు లక్ష్మీనిలయాలుగా మారుతున్నాయని రాష్ట్ర గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్ పేర్కొన్నారు. శుక్రవారం జెఎన్‌టియుహెచ్ ఆరో స్నాతకోత్సవంలో రాష్ట్ర గవర్నర్ నరసింహన్ చాన్సలర్ హోదాలో మాట్లాడుతూ విద్యారంగం వ్యాపారమయం కారాదని వ్యాఖ్యానించారు. కేవలం పట్టాలను తయారుచేసే కర్మాగారాల్లా టెక్నాలజీ వర్శిటీలు ఉంటే దానివల్ల సమాజానికి ఎలాంటి లాభం ఉండదన్నారు.

04/22/2017 - 04:01

హైదరాబాద్, ఏప్రిల్ 21: దేశంలో తాజాగా తీసుకున్న ఆర్ధిక సంస్కరణలతో నల్లధనం మాత్రం ఇంకా తగ్గలేదని ఆర్‌బిఐ మాజీ గవర్నర్ డాక్టర్ వై వి రెడ్డి వ్యాఖ్యానించారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలో ఆర్ధిక శాస్త్ర విభాగం ఏర్పాటు చేసిన ప్రత్యేక ఉపన్యాస కార్యక్రమంలో డాక్టర్ వై వి రెడ్డి మాట్లాడారు.

04/22/2017 - 03:56

హైదరాబాద్, ఏప్రిల్ 21: కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎంపిక కాని వారు తమ అభ్యతరాలను చాలెంజ్ చేసుకునే పద్ధతిని తొలిసారి తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డు కల్పించింది. 2015లో కానిస్టేబుల్ ఉద్యోగాల్లో ఎంపిక రాని 153 మంది అభ్యర్థులు ఎంపిక ప్రక్రియపై పలు అనుమానాలు వ్యక్తం చేసిన దరిమిలా బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది.

Pages