S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

12/09/2015 - 04:15

భద్రాచలం, డిసెంబర్ 8: చత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులకు ఎదురుదెబ్బ తగిలింది. పీఎల్‌జీఏ వారోత్సవాల ముగింపు రోజైన మంగళవారం సుక్మా జిల్లా పోలీసులకు 26 మంది మావోయిస్టులు లొంగిపోయిన కొద్ది గంటల్లోనే ఇదే జిల్లాలోని కిష్టారం అడవుల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో 10 మంది మావోయిస్టులు హతులయ్యారు. ఎదురుకాల్పుల్లో 5గురు జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు.

12/08/2015 - 13:11

ఖమ్మం: తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్లు జోరందుకున్నాయి. ఖమ్మం జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా లింగాల కమల్ రాజ్ మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు. నల్లగొండ జిల్లా కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మాజీ ఎంపీ కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి, మహబూబ్ నగర్ టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా దయాకర్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు.

12/08/2015 - 11:55

హైదరాబాద్: రంగారెడ్డి జిల్లాలో దుర్భిక్ష పరిస్థితులను తెలుసుకొనేందుకు కేంద్ర బృందం మంగళవారం పర్యటించింది. ఇబ్రహీంపట్నం పెద్ద చెరువుతోపాటు పలు ప్రాంతాల్లో వ్యవసాయ భూములను కమిటీ సభ్యులు సందర్శించి స్థానికుల నుంచి వివరాలు తెలుసుకొన్నారు.

12/08/2015 - 11:53

ఖమ్మం: ఆంధ్ర - తెలంగాణ రాష్ట్రాల సరిహద్దులో మంగళవారం ఉదయం పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. సరైన పత్రాలు లేని 20 వాహనాలను స్వాధీనం చేసుకొని 40 మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు.

12/08/2015 - 11:52

సంగారెడ్డి: మెదక్ జిల్లా సంగారెడ్డి శివారులో సోమవారం అర్ధరాత్రి కారులో వెళ్తున్న వారిని అటకాయించి ముగ్గురు దుండగులు యాభై లక్షల రూపాయల నగదును దోచుకున్నారు. హైదరాబాద్‌కు చెందిన ఇషాక్, మరి కొందరితో కలిసి సంగారెడ్డి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. పత్తి రైతులకు చెల్లించేందుకు ఈ నగదును ఇషాక్ తీసుకెళ్తున్నట్టు పోలీసులు తెలిపారు.

12/07/2015 - 18:34

వరంగల్‌: వరంగల్‌, హన్మకొండ ప్రాంతాల్లో నాలుగు వరుస దొంగతనాలు పాల్పడ్డారు. హంటర్‌రోడ్‌, సుబేదారి, మట్టెవాడ, శివనగర్‌ ప్రాంతాల్లో జరిగిన దొంగతనాల్లో మహిళల మెడల్లో 15 తులాల బంగారు నగలను దొంగలు అపహరించారు.

12/07/2015 - 11:50

హైదరాబాద్: తాను తెరాసలో చేరుతున్నట్టు వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని, ఐతే ఆ పార్టీ నేతలు తనను ఆహ్వానించిన మాట నిజమేనని కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి దానం నాగేందర్ సోమవారం స్పష్టం చేశారు. గెలుపు ఓటముల సంగతి ఎలా ఉన్నా జిహెచ్‌ఎంసి ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున తాను కష్టపడి కృషి చేస్తానని చెప్పారు. గ్రేటర్ ఎన్నికలపై మంగళవారం కార్యకర్తలతో సమావేశం జరుగుతుందని చెప్పారు.

12/07/2015 - 11:50

ఖమ్మం: అశ్వారావుపేటలోని పలు ప్రాంతాల్లో సోమవారం తెల్లవారుజామున పోలీసులు ఆకస్మిక తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా అనుమానితులను ప్రశ్నించి 12 బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు.

12/07/2015 - 11:47

కరీంనగర్: పెద్దపల్లి రైల్వేస్టేషన్ సమీపంలో సోమవారం ఉదయం వరంగల్ జిల్లా చిట్యాలకు చెందిన ప్రశాంత్ అనే ఇంజనీరింగ్ విద్యార్థి రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్యకు దారి తీసిన కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

12/06/2015 - 08:27

కృష్ణా నదిని సందర్శించిన కమిటీ సభ్యులు
ప్రజాభిప్రాయంపై ఆరా..అధికారుల నుండి వివరాల సేకరణ
అన్ని రికార్డులు పరిశీలించాకే నివేదిక

Pages