S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

05/27/2016 - 15:54

హైదరాబాద్: ఉద్యోగాల పేరిట నిరుద్యోగ యువతను మోసం చేసి భారీగా డబ్బులు దండుకుంటున్న నలుగురు మోసగాళ్లను పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. నిందితుల నుంచి సుమారు 16 లక్షల నగదు, ఆరు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.

05/27/2016 - 15:53

హైదరాబాద్: పలు ప్రాంతాల్లో ఆర్టీసీ బస్సుల్లో చోరీలకు పాల్పడుతున్న ముఠాను పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. ఏడుగురు నిందితులను అరెస్టు చేసి వారి నుంచి పది సెల్‌ఫోన్లు, ఒక బైక్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

05/27/2016 - 15:53

హైదరాబాద్: తెలంగాణ సర్కారు ఆశించినదానికంటే కేంద్రం ఎక్కువగానే నిధులు విడుదల చేసిందని, ఈ విషయంలో తెరాస నేతలు చేస్తున్న విమర్శల్లో అర్థం లేదని టి.బిజెపి అధ్యక్షుడు లక్ష్మణ్ అన్నారు. కేంద్రం ఇస్తున్న నిధులను వాడుకుంటూ ఇలా ఆరోపణలు చేయడం సరికాదన్నారు. తెలంగాణకు కేంద్రం 90 వేల ఇళ్లను మంజూరు చేసిందన్నారు.

05/27/2016 - 13:42

మెదక్: ప్రేమ ముసుగులో ప్రియుడు వంచన చేయడంతో మనస్తాపం చెందిన ఓ యువతి పినాయిల్ తాగి ఆత్మహత్యకు యత్నించిన ఘటన మెదక్ జిల్లా పుల్కల్‌లో శుక్రవారం జరిగింది. బాధితురాలు స్వప్న, విష్ణు చాలాకాలంగా ప్రేమించుకుంటున్నారు. తాను ఓ పాపకు జన్మనిచ్చినప్పటికీ పెళ్లి చేసుకునేందుకు విష్ణు నిరాకరిస్తున్నాడని స్వప్న మనస్తాపం చెందింది. పినాయిల్ తాగిన ఆమెను స్థానికులు ఆస్పత్రికి తరలించారు.

05/27/2016 - 06:39

హైదరాబాద్, మే 26: తెలంగాణ రాష్ట్ర ఆవతరణ వేడుకలను కనీవిని ఎరగని రీతిలో రాష్టవ్య్రాప్తంగా గ్రామస్థాయి నుంచి రాజధాని వరకు అంగరంగ వైభవంగా నిర్వహించాలని మంత్రివర్గ ఉప సంఘం నిర్ణయించింది. అలాగే దేశవ్యాప్తంగా తెలియజేసేందుకు వివిధ రాష్ట్రాలలో కూడా జాతీయ పండుగలాగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాల్సిందిగా ఉప సంఘం చైర్మన్ నాయిని నరసింహ్మారెడ్డి అధికారులను ఆదేశించారు.

05/27/2016 - 06:37

హైదరాబాద్, మే 26: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన సమగ్ర సర్వేకు అరుదైన గౌరవం దక్కింది. లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థ సమగ్ర కుటుంబ సర్వేను జాతీయ రికార్డుగా గుర్తించింది. ఈ మేరకు లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ ఎడిటర్ విజయ ఘోష్ తెలంగాణ ప్రభుత్వానికి పత్రాన్ని పంపారు. సమగ్ర కుటుంబ సర్వే జరిగిన విధానం తదితర వివరాలను కూడా పత్రంలో పేర్కొన్నారు.

05/27/2016 - 06:36

బిచ్కుంద/బాన్సువాడ, మే 26: నిజామాబాద్ జిల్లా బిచ్కుంద మండలం పత్లాపూర్ గేట్ వద్ద గురువారం మధ్యాహ్నం సమయంలో ఈదురుగాలులు కొద్దిసేపు బీభత్సం సృష్టించాయి. బలంగా వీచిన ఈదురుగాలుల తాకిడికి ఓ చెట్టు కొమ్మ విరిగి, అదే సమయంలో ఈ మార్గం గుండా వెళ్తున్న ఓ లారీ డ్రైవర్ గొంతులో దిగబడింది. వెంటనే డ్రైవర్‌ను బిచ్కుంద ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స చేసిన అనంతరం బాన్సువాడలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు.

05/27/2016 - 06:31

ఆదిలాబాద్/రామగుండం, మే 26: ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల్లో రోహిణికార్తెలో భానుడి ప్రతాపానికి ప్రజలు అల్లాడిపోతున్నారు. ఓవైపు మండుటెండల దాటికి జిల్లాలో వడదెబ్బ సోకి మృత్యువాత పడుతుంటే మరోవైపు భరించలేని వేడిసెగలు ప్రజల ప్రాణాలను తోడేస్తున్నాయి. గురువారం ఆదిలాబాద్‌లో 44 డిగ్రీల పగటి ఉష్ణోగ్రత నమోదు కాగా తూర్పు మంచిర్యాలలో రికార్డు స్థాయిలో 45.2 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

05/27/2016 - 06:30

హైదరాబాద్, మే 26: తెలంగాణ ప్రభుత్వం ఎంతో అట్టహాసంగా ప్రకటించిన డబుల్‌బెడ్ రూం ఇండ్లపై శే్వతపత్రం ప్రకటించాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి డిమాండ్ చేశారు. గురువారం ఇక్కడ ఆయన విలేఖర్ల సమావేశంలో మాట్లాడుతూ, ఈ ఇండ్లపై ప్రభుత్వం రెండేళ్లు గడచినా విధాన నిర్ణయం సరైన రీతిలో తీసుకోలేదన్నారు.

05/27/2016 - 06:29

హైదరాబాద్, మే 26: కాళేశ్వరం ప్రాజెక్టు పనులను సకాలంలో పూర్తి చేసేందుకు నీటిపారుదల శాఖ అవసరమైన ప్రయత్నాలు చేస్తోంది. ఈ ప్రాజెక్టులో భాగంగా తొమ్మిది పంపుహౌజ్‌లకు, తొమ్మిది సబ్ స్టేషన్లను నిర్మించే ప్రక్రియకు గురువారం శ్రీకారం చుట్టారు. ప్రాజెక్టుకు సంబంధించి విద్యుత్ పనుల్లో వేగం పెంచాలని నీటిపారుదల శాఖ మంత్రి విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు.

Pages