S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

01/04/2017 - 05:11

వరంగల్, జనవరి 3: సంక్రాంతి పండుగ సందర్భంలో తెలంగాణ ప్రజలు అట్టహాసంగా, ఆనందోత్సాహాల మధ్య జరుపుకునే పతంగుల పండుగను వరంగల్‌లో అధికారికంగా అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది.

01/04/2017 - 05:10

హైదరాబాద్, జనవరి 3: రాష్ట్ర రాజధానితో పాటు ఇతర ప్రాంతాల్లో ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలు, విధానాలను ప్రజలకు తెలియచేసేందుకు భారీ హోర్డింగులను ఏర్పాటు చేస్తున్నారని, అయితే వీటిని ఎవరు ప్రదర్శిస్తున్నారో హోర్డింగ్‌లపై రాయడం లేదని శాసనమండలిలో విపక్షం నాయకుడు మహ్మద్ అలీ షబ్బీర్ ఆరోపించారు.

01/04/2017 - 05:09

హైదరాబాద్, జనవరి 3: సికిందరాబాద్‌లోని గోకుల్ కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్‌లో లావాదేవీలు నిలిచిపోయాయి. బ్యాంక్ నిధుల అవకతవకలపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇప్పటికే బ్యాంక్ సిఇవో, చైర్మన్ జగదీశ్‌యాదవ్‌ను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.

01/04/2017 - 05:05

హైదరాబాద్, జనవరి 3: రాష్ట్రంలో విద్యార్థులు అందరికీ జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్ కింద ఆరోగ్య పరీక్షలు చేయించి హెల్త్ కార్డులు అందిస్తామని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి తెలిపారు. వచ్చే విద్యాసంవత్సరానికి పాఠశాలల వారీ సూక్ష్మస్థాయి ప్రణాళికలు రూపొందించుకోవాలని ఆయన చెప్పారు. మంగళవారం నాడు ఆయన విద్యాశాఖ వివిధ విభాగాల అధికారులతో సమీక్ష నిర్వహించారు.

01/04/2017 - 05:03

న్యూఢిల్లీ, జనవరి 3: తెలంగాణలో ప్రతిపాదించిన అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థకు నిధులు కేటాయించాలని, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (ఐఐఎం) సంస్థను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్, టిఆర్‌ఎస్ పార్లమెంటరీ పార్టీ నాయకుడు కె.కేశవరావు, లోక్‌సభలో పార్టీ పక్ష నాయకుడు జితేందర్ రెడ్డి, లోక్‌సభ సీనియర్ సభ్యుడు బి.వినోద్‌కుమార్ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్‌జైట్లీని కోరారు.

01/04/2017 - 05:02

హైదరాబాద్, జనవరి 3: తెలంగాణలో తొలిసారిగా అఖిలభారత అటవీ క్రీడోత్సవాలు నిర్వహించనున్నారు. ఈనెల ఏడు నుంచి 11వ తేదీ వరకు ఈ క్రీడలు తెలంగాణ అటవీ శాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో నిర్వహిస్తారు.

01/04/2017 - 05:02

హైదరాబాద్, జనవరి 3: హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ పి అప్పారావు సహస్రాబ్ది ఫలకాల గౌరవ పురస్కారాన్ని ప్రధాని నరేంద్రమోదీ చేతులు మీదుగా తిరుపతిలో అందుకున్నారు. 104 ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ ప్రారంభ కార్యక్రమంలో ఆయన ఈ పురస్కారాన్ని అందించారు.

01/04/2017 - 05:01

న్యూఢిల్లీ, జనవరి 3: కేంద్ర గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ మంత్రిత్వశాఖ నుండి తెలంగాణకు రావాల్సిన పెండింగ్ నిధులు విడుదల చేయాలని మంత్రి నరేంద్రసింగ్ తోమర్‌ని కేంద్ర కార్మిక శాఖమంత్రి బండారు దత్తాత్రేయ కోరారు. తెలంగాణలో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపై నరేంద్ర తోమర్‌తో మంగళవారం నాడు దత్తాత్రేయ చర్చించారు.

01/04/2017 - 05:01

న్యూఢిల్లీ, జనవరి 3: భారతదేశంలో మహిళల హక్కుల కోసం పోరాడిన తొలి సంఘసంస్కర్త సావిత్రీబాయి ఫూలే 186వ జయంతి కార్యక్రమాన్ని ఢిల్లీలోని ఏపీ భవన్‌లో జాతీయ బిసి ప్రజా సంక్షేమ సంఘం ఘనంగా నిర్వహించింది. మహిళల విద్య, సంక్షేమం కోసం సావిత్రీబాయి ఫూలే చేసిన సేవలను ఈ కార్యక్రమానికి వచ్చిన నాయకులు కొనియాడారు.

01/04/2017 - 05:00

హైదరాబాద్, జనవరి 3: అడ్మినిస్ట్రేటివ్ స్ట్ఫా కాలేజీ ఆఫ్ ఇండియా (ఆస్కి) డైరెక్టర్ జనరల్‌గా 1976 బ్యాచ్ సీనియర్ ఐఎఎస్ అధికారి రాజెన్ హబీబ్ ఖ్వాజా బాధ్యతలు స్వీకరించారు. 38ఏళ్ల పాటు సేవలు అందించిన ఖ్వాజా 2014లో రిటైరయ్యారు. పర్యాటక శాఖ, గనుల శాఖ కార్యదర్శిగానూ, సింగరేణి బొగ్గు గనుల సంస్థ ఎండిగానూ పనిచేశారు.

Pages