S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సాహితి

09/24/2017 - 22:11

నాకప్పటికి పాతికేళ్లు నిండి ఉంటాయి. ఆంధ్రప్రభలో ప్రతి ఆదివారం భట్ట నైషధం గురించి వ్యాసాలు వస్తున్నవి. వాటి రచయిత గుంటూరు శేషేంద్ర శర్మ. వాటిలో ఆయన ప్రతిపాదించిన అంశాలు అన్నీ కొత్తగా ఉన్నాయి. నైషధానికి సాహిత్యంలో పరమోత్తమ అధ్యయన గ్రంధంగా పేరున్నది.

09/24/2017 - 22:10

‘కొడుక్కి పాతికేళ్లు వచ్చి చాలా అప్పులులోకి, తగాదాల్లోకి, జూదాలకీ దిగాడనుకోండి. అతనిమీద చాలా జాలిపడి తండ్రి ‘పిల్లవాడివిగా వున్నప్పుడు ఎంత శాంతంగా, సంతోషంగా, నిర్మలంగా వుండేవాడివి!’ అని బలవంతంగా తండ్రి బొమ్మలూ అవీ ఇచ్చి ఆడుకోమంటే అతనేవౌతాడో దేశమంతా అట్ల ఐనట్టుంది’ అని వ్యాఖ్యానం చెబుతాడు కధకుడు- రుూ కధ చివరలో.

09/24/2017 - 22:08

ఈ నెల 28న జాషువా జయంతి
*
బడిలో, గుడిలో, అడుగడుగునా
అస్పృశ్యతా పైత్యం
నాటక ప్రదర్శన నీ కులపోళ్లకు కాదుపొమ్మన్నా
కవిత బాగుంది కానీ... నీదే కులం?
అని ప్రశ్నించి గుండెల్లో కత్తులు దించినా
కళలకు కులం రంగు పులిమి, ఉన్మాదంతో
ఘోర కులపిచ్చి వికటాట్టహాసం చేసినా
అడుగడుగునా అవమానాల పరంపర కొనసాగినా
నాల్గు పడగల హైందవ నాగరాజులు

09/17/2017 - 22:38

ఎండిన పొలాన
నా కవితలోని తడితో
చినుకునై వర్షిస్తా

ఇంకిన రైతు నయనాన
నా కన్నీటితో గట్లు కట్టి
మడిగా మారుస్తా

చెట్టు కొమ్మకు వేలాడే
అన్నదాత పాదాలకు
నా భుజాలనే ఆసరా చేస్తా

తన ఆశలు నా ఆశయాలు
ఇద్దరి జీవిత మాగాణిలో
రెండు కాడెడ్లు

గిట్టుబాటు ధరకై
నా నోటితో అడుగుతా
నా కలంతో కడుగుతా

09/17/2017 - 22:36

సాధారణంగా కథారచనలో మెళకువలు నేర్పేవారుగానీ, విశే్లషణలు చేసేవారు కానీ కథ ఎత్తుగడ, ముగింపు, నడుమ ఓ సంఘర్షణ వంటివి ఉండాలని చెప్తారు. కథలో పాత్రలు, పాత్రల వ్యక్తిత్వాలు, సంభాషణల ఔచిత్యం వంటి వాటి గురించి చెప్తారు. ఉదాహరణలు చూపుతారు. వస్తువు గురించి మాట్లాడతారు. తెలుగు సాహిత్యంలో ప్రస్తుతం ‘వస్తువు’కు ఉన్నంత ప్రాధాన్యం ఇంకా దేనికీ లేదు.

09/17/2017 - 22:35

కొత్త గొంతులు
నిర్భయంగా నడిచిన నేలమీద
కోరికల చిగురు
కలల మారాకు వేసి
బతుకు మీద ఆశగా మొలకెత్తవూ...?

కాలాన్ని దోసిట్లోకి ఒంపుకొని
ప్రవాహ వేగాన్ని
గడగడా తాగినంత సేపూ
మనిషికి
కొత్త ఊహలే పుట్టుకొస్తాయ

స్తబ్దతలోంచి
చైతన్యంతో తట్టి లేపడానికి
పరిచిన అడుగులన్నీ
నవ నవోనే్మషంగా మొగ్గ తొడుగుతాయ

09/17/2017 - 22:33

‘పుట్టుక నీది / చావు నీది / బతుకంతా దేశానిది’- అని జయప్రకాశ్ నారాయణ్ మరణించినప్పుడు రాశారు కాళోజీ. ఈ కవితను కాళోజీకి కూడా అన్వయించి చెప్పవచ్చు. దాదాపు తొంభై ఏళ్ళు జీవించిన కాళోజీ ఏడు దశాబ్దాలకు పైగా ప్రజా జీవితంతో మమేకమయ్యారు. తన కళ్లముందు కదలాడిన సామాజిక, రాజకీయ, సాంస్కృతిక జీవనాన్ని తన కవిత్వంలోకి ప్రవహింపజేశాడు.

09/17/2017 - 22:32

‘ఉదయ సూర్యుడి కిరణజాలాన్ని కప్పివేస్తూ అసంఖ్యాకమైన పక్షి సముదాయం. నాయకత్వం వహిస్తూ ఒక గరుత్మంతుడు దారిచూపుతున్నాడు. అవనినంతా కప్పివేస్తున్నట్లుగా అంచులు లేని నీడ, సూర్యగ్రహణం నాడు ఒక అద్భుత లీలగా కన్పించే నీడ- ఆకాశంనుండి జాలువారింది. ఒక వలయం తిరిగి గరుత్మంతుడు తూర్పు దిశగా మళ్లాడు. గ్రామీణులు చప్పట్లు కొడుతున్నారు. సాధు సమూహం ఊర్థస్వరంతో స్తుతిగానం చేస్తూ తూర్పు దిశగా అడుగులు వేశారు.

09/10/2017 - 23:43

ఆకాశవాణిలో తెలుగు ప్రసారాలు మొదలై

ఎనిమిది దశాబ్దాలు దాటిన సమయంలో

ఇలా చర్చించుకోవడం చాలా అవసరం.

ఎంతో ముదావహం. ఒక్క కథానికే కాదు

సర్వకళలకూ సమాదరణ లభించింది.

దానికి కారణం ఆనాటి సమాజపు

చిత్తశుద్ధి, లక్ష్యశుద్ధి, పైపెచ్చు

ఆకాశవాణిలో పనిచేసిన

మహానుభావులు.. ఎందరని చెప్పాలి?

ఒకరా, ఇద్దరా? ఒకచోటనా, రెండు చోట్లనా?

09/10/2017 - 23:42

మట్టి బండి నుండి ప్లాస్టిక్ శకటందాకా
సుదీర్ఘ యాన పరిణామంలో వేరు వేరు

రూపాలు
మనుషుల ముఖాలొకటే జీవనమూర్తులు

వేరు
దారులు వేరు గమ్యాలు వేరు తిరిగే చక్రంపై

తిరుగుతూ
మానవ హక్కుల పోరాటం, ఆధునికం
ఎప్పటికీ వేగంలో వుంటుంది సమస్యలతో
ప్రభావ ఫలితంగా సాధించినవి ఎన్ని ఉన్నా
తృప్తినిచ్చే జవాబు సార్థకతను

Pages