S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సాహితి

09/10/2017 - 23:37

‘పైకి ఎన్ని చెప్పినా ధనికులంటే నాకిష్టం- ధనిక వర్గాలతో పోలిస్తే నేనూ సామాన్యుణ్ణే.. కాని ఆ స్నేహం, సాంగత్యం ఎల్లప్పుడూ ఆనందాన్నివ్వదు. అది లోయలో నడవడం లాంటిది. నడవగా నడవగా ఒక పర్వతం దగ్గరికి చేరుకుంటాం. పైకి చూస్తే ఎత్తుగా శిఖరం కనిపిస్తుంది. మన అల్పత్వం మనకు అప్పుడు తెలిసొస్తుంది. స్వార్థం దిగజారుతుంది’- ఈ వాక్యాలు బుచ్చిబాబుగారి కథానిక ‘దిగజారిన మాలిన్యం’లో మొట్టమొదటిగానే కనిపిస్తాయి.

09/03/2017 - 23:23

‘కవి భిషక్కు’ - ఈ మాట ఒకప్పుడు చాలా ప్రాచుర్యంలో వుండేది. ఆయుర్వేద వైద్యానికి, కవిత్వ రచనకు అవినాభావ సంబంధం వున్నట్లుగా బాగా దాఖలాలున్న ఆ రోజుల్లో- అలాంటి మహనీయులను ‘కవి భిషక్కు’లనేవారు. సాహిత్య సృష్టిలోనూ, వైద్య చికిత్సలోనూ ఆరితేరినవారు ‘కవి భిషక్కు’లు. ఆధునికంగా అలాంటి ‘కవి భిషక్కు’ అనడానికి నిలువెత్తు నిదర్శనంగా వుండేవారు డాక్టర్ ధేనువకొండ శ్రీరామమూర్తి.

09/03/2017 - 23:22

గాలిలో రంగులు ఎగురుతున్నాయి
ఇది హర్షం!
విద్వేషం విభిన్న వర్ణాల్లో
ఆలోచనల అలలపై తేలుతున్నాయి
ఇది ప్రవాహమే, కానీ సంఘర్షణ!
చల్లని చూపు
మనల్ని మనమేంటో చెబుతుంది!
చెట్ల నీడల జాడల వెంట పరుగు..
ఆకుల సందుల్లో మెరిసే కిరణాలు
అక్షింతలై దీవిస్తాయి..
దుఃఖం ముసురుపట్టిన దేహం
కుండపోతగా వర్షిస్తూనే వుంది.
నిజంగా ఓ స్నేహం కోసం

09/03/2017 - 23:22

‘కొండ మీంచి చిన్న బండరాయి పట్టు తప్పి జారిపడింది. ఇసక్కొడి రాయి. గురిపెట్టి రామిగాడి నెత్తిమీద పడ్డది. బండ ముక్కచెక్కలయిపోయింది. రామిగాడి బుర్రా ముక్క ముక్కలయిపోయింది. ఠారుని చచ్చి కూలిపోయాడు. వాడి పుణికెలోంచి కొబ్బరి పువ్వులాగా మెదడు బైటికి వచ్చేసింది. మోచెయ్యి తెగిపోయి రెండు గజాల అవతల ఎగిరిపడ్డది.

08/27/2017 - 22:33

కాలం చలనశీలి. చైతన్యశీలి. కాలంలోని మార్పును, భావజాలంలోని మార్పును పరిగణనలోకి తీసుకుంటే, సమాజంలో వచ్చే మార్పును గమనించవచ్చును. ఈ మార్పునే ఆధునికత అంటాము. ఆధునిక భావజాలంతో కూడిన సాహిత్యం ఆధునిక సాహిత్యంగా పేర్కొనబడుతుంది. భాష, భావం, రూపం మూడింటిలోనూ సమూలమైన మార్పును ఆధునికతగా ప్రస్తావిస్తారు.

08/27/2017 - 22:32

కదిలిరండి కలసిరండి
తరతరాల చరితవున్న
తెలుగు భాష కాపాడ!
తెగువజూపి ఉరకండి!!

ప్రాచీనత హోదావున్న
ప్రపంచాన ప్రసిద్ధైన
అధికమంది పలుకాడె
తెలుగు భాష కాపాడ!
కదలిరండి కలసి రండి
తెలుగు భాష కాపాడ!!

08/27/2017 - 22:35

శ్రీనివాసరావుకు ఉద్యోగం లేదు. అయితే అతను మంచి టెన్నిస్ ఆటగాడు. పెద్ద ఆటగాడు అయ్యే సూచనలున్నాయని అతని అంచనా. నడుస్తున్న నాగరికతలాగ తయారయి రోడ్డు వెంట వెడుతున్నవాడు ఒక బట్టల దుకాణం ముందు షోకేస్‌లోనున్న బొమ్మ, ఆ బొమ్మకు కట్టిన చీర లావణ్యాలకు ఆకర్షితుడై అనాలోచితంగా ఆ దుకాణంలోనికి అడుగుపెట్టాడు.

08/27/2017 - 22:30

కవిత్వానికి ఒక తాత్విక భూమికను ఏర్పాటు చేసుకుని క్లుప్తత, గుప్తత పాటిస్తుంటే అనుభూతి గొప్ప సార్వజనీనకమై పోతుంది. ప్రాంతీయ స్పృహను, వర్గ స్పృహతో ఉద్యమింప చేసే వాళ్ల జాతీయ బూర్జువా స్థానిక బూర్జువా, పెటీ బూర్జువా ఉద్యమాలు కవి జీవనం మీద విశేష ప్రభావం చూపుతాయి.

08/20/2017 - 22:23

అక్షరాలకక్షరాలే అదృశ్యమైపోతున్న నేటి కాలానికి ప్రామాణికమైన నిఘంటువులూ క్రమక్రమంగా కనుమరుగౌతూ సరికొత్త సంక్షిప్త రూపంలో సాక్షాత్కరిస్తున్నాయి. తదనుగుణంగానే పదాలు తగ్గిపోతూ వున్నాయి. వ్యవహారంలో సైతం అర్థరహిత పదాలు, పదబంధాలు వచ్చి వాలుతున్నాయి. వ్యాకరణమొప్పని మాటల దాడికి దేహభాగాలు అస్తవ్యస్తవౌతున్నాయి. ఎప్పటికప్పుడు ఉన్న మాటలతోనే పని కానిచ్చుకుందామనే కొంచెతనానికి అలవాటుపడిపోతున్నాం.

08/20/2017 - 23:06

వెతుకుతున్నా
ఏదో పోయిందని కాదు
ఏదైనా దొరుకుతుందేమోనని!
అదేదైనా కావచ్చు
జారిపోయిన జ్ఞాపకమో
పైలా పచ్చీసు నాడు
ఒడిసి పట్టలేని వాల్చూపో!
పోతు పోతు ఎవరో ఒకరు
విసిరేసిన జ్ఞాన శకలమో
జీవన భాష నెరిగిన వారు
ధారబోసిన పిడికెడు ఆనుభవాలో
అంతా ఒకే దగ్గర దొరకడానికి
అనుభవాలకు బిగ్ బజార్లుండవ్
మనమేమైనా కదలని కొండలమా

Pages