S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లోకాభిరామం

01/21/2017 - 22:26

నాన్న ఒక ట్రాన్సిస్టర్ రేడియో కొని తెచ్చాడు. ఇక నేను అదే పనిగా సిలోన్‌లోనూ, ఇతర స్టేషన్‌లలోనూ సినిమా పాటలు వినసాగాను. సంగీతం వింటే మాగుంటుందని నాన్న చూచాయగా మాత్రమే చెప్పాడు. నిజానికి ఆయన శాస్ర్తియ సంగీతం అంతగా విన్నట్టు గుర్తు లేదు.

01/07/2017 - 22:16

................
పోలికల ప్రకారం చూస్తే చింపాంజీలు మనుషులకు
అన్నింటికన్నా దగ్గర రకం. తర్వాత గొరిల్లాలు. ఆ తరువాత ఒరాంగుటాన్‌లు. ఈ మూడు రకాలు, ఒకే జాతి నుంచి వచ్చినవా తెలియదు. ఇక ఏప్స్ తరువాతే, కోతులు మనకు
చుట్టాలవుతాయి. అంతేగాని అవి మనకు తాతలు కావు.
తాత చుట్టాలు మాత్రమే!
...............

01/01/2017 - 03:44

ఒక పుస్తకం అచ్చవుతున్నది. నిజానికి అచ్చు అయింది. కవర్‌పేజ్ కూడా అచ్చయింది. ఆ రెంటినీ కలిపి బైండ్ చేసే పని మిగిలి ఉంది. ఏనుగెళ్లింది, తోక మిగిలింది అన్న పద్ధతి అన్న మాట! (నా మాటే!) ఏమిటి ఆలస్యం? అంటే కొత్త సంవత్సరం వస్తున్నది గద! కాలెండర్‌లు, డైరీల పనిలో అందరూ బిజీగ ఉన్నారు అన్నారు. (మాటల గురించి ఆలోచించడం నా బలహీనతలలో ఒకటి. డెయిరీ అంటే పాడి పరిశ్రమ. డయరీ అంటే దినచర్య పుస్తకము.

12/24/2016 - 23:46

అతను నేల మీదకు దిగుతాడు. అంటే ఆకాశంలో నుంచి అన్నమాట. అయిదవ అంతస్తులో ఉండేవాళ్లు నేలకన్నా ఆకాశానికి దగ్గరగా ఉంటారన్నది, అనుభవిస్తే గాని అర్థంగాదు. అయిదవ అంతస్తులో ఉంటే ప్రపంచంతో పనిలేదు. కింద అరటిపండ్ల బండి వచ్చిందని, అరుపు కారణంగా తెలుస్తుంది. పైనుంచి అంత అరుపు అదిని బండిని ఆపాలంటే కిందకు వినిపించదు. పై నుంచి చూస్తే పండ్లు బాగానే ఉంటాయి. దిగి చూస్తే నచ్చవేమో?

12/18/2016 - 01:21

లాయిరి నడి సంద్రములోన లంగరుతో పనిలేదోయ్, అని చెప్పిన కవి, కుడి, ఎడమయితే ఫరవాలేదన్నాడు. ఎవరయినా ఆ సంగతి గురించి ఆలోచించారా? అందుకు టైమెక్కడండీ, అంటారేమో! తొందరలో పడితే పగలు, రాత్రి తెలియవు. తిండి రుచి తెలియదు. బతుకులో రుచి అంతకన్నా తెలియదు. కానీ, పద్ధతి అది కాదు! ఆలోచిస్తే ఎంతో బాగుంటుంది?

12/10/2016 - 22:48

ఎవరు ఎందుక వస్తున్నారు, ఎందుకు, ఎక్కడికి పోతున్నారు తెలియకుండా జనం కదులుతూ ఉంటే ‘జాతర’లాగ ఉంది, అనడం అలవాటు. యాత్ర అనే మాట నుంచి జాతర పుట్టింది.

12/04/2016 - 00:10

ఉన్నట్టుండి రవీందర్ ఫోన్ చేసినడు. ‘ఏమిటి సంగతి?’ అంటే అతను ‘పాప ఏడ్చింది’ అనేవాడా లేదా నాకు తెలియదు. గ్రైప్ వాటర్ ప్రకటనల గురించి తెలియని, తెలీని, తెలువని వారికి క్షమాపణలు. ‘ఏం సంగతులు?’ అన్నట్టున్న. ‘ఏం లేదు. ఊరికెనే గుర్తుకు వచ్చినవు’ అన్నడు. ఈ లోకంలో ఊరికెనే మనలను గుర్తుచేసుకుని, పలకరించే వాండ్లు గూడ ఉన్నరు గదా, అని సంతోషమయింది. ఆ సంగతే చెప్పిన. అతను నిజంగనే ఊరికే ఫోన్ చేసినడు.

12/03/2016 - 21:33

ఎందుకో తెలియదుగానీ,
గత కొంతకాలంగా నేను ప్రపంచ సాహిత్యంలోని కథా సంకలనాలను చాలా సేకరించి చదువుతున్నాను. నాకు అక్కడక్కడ నిజంగా ఆశ్చర్యకరమయిన రచనలు ఎదురవుతున్నాయి. నా మనసులోని భావాలను అవి బలపరుస్తున్నాయి. ఒకప్పుడు హైదరాబాద్‌లో, సారస్వత
పరిషత్‌లో అనుకుంటాను, జరిగిన ఒక సమావేశానికి వెళ్లడం
గుర్తుకు వస్తున్నది.

11/19/2016 - 21:57

ఇద్దరు మిత్రులు చాలాకాలం తరువాత కలిశారు. వాళ్లలో ఒకతను సంచీ చంకన పెట్టుకుని తలవంచుకుని ఫుట్‌పాత్ మీద నడుస్తున్నాడు. మరొకతను పడవలాంటి కారులో ఎదురుగా వచ్చి ఆగాడు. కారు దిగాడు. నడుస్తున్న మనిషిని గమనించాడు. మిత్రుడే అని తేల్చుకున్నాడు. మాట్లాడుకున్నారు. కలిసి కారెక్కి పోతున్నారు కూడా. ‘క్లాస్‌లో మామూలుగా ఉండేవాడివి, ఈ కారు, ఈ వ్యవహారం ఎలా కుదిరింది?’ అమాయకంగా అడిగాడు ఫుట్‌పాత్ మిత్రుడు.

11/12/2016 - 20:04

ఉస్మానియా యూనివర్సిటీలో పరిశోధనలో ఉండగా, పనితీరు చిత్రంగా ఉండేది. నిజంగా పని ఉంటే ఏడు గంటలకు ఉదయాన మెస్‌లో నచ్చీనచ్చని నాష్తా అనే టిఫిన్ అనే ఉపాహారం ముగించుకుని, అక్కడి నుంచే నేరుగా ల్యాబ్‌కు వెళ్లిపోయే వాడిని. మధ్యాహ్నం క్యారియర్ అక్కడికే వచ్చేది. అంటే భోజనం ల్యాబ్‌లోనే అని అర్థం. సాయంత్రం ఆరున్నరకు మళ్లీ రాత్రి భోజనాలు మొదలవుతాయి.

Pages