S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమృత వర్షిణి

07/30/2017 - 01:00

వాల్మీకి రామాయణం ఎవరో ఓ మహారాజు చరిత్రలా వుండి వుంటే ఈపాటికి జనం ఆ కథను మరిచిపోయి ఉండేవారు. కానీ రామాయణం ఒక ఆధ్యాత్మిక జ్ఞాననిధి. కాబట్టే పరమ శాశ్వతమైన మహా కావ్యమయింది.
ముఖ్యంగా త్యాగయ్య తరించడానికి కారణం రామకథే. సంగీత మూర్తిత్రయంలో త్యాగరాజు అనుసరించిన మార్గమే చాలా భిన్నం.

07/30/2017 - 01:00

సంకల్పాలు అనేక విధాలు. మన పూర్వీకులంద జేసిన సాంస్కృతిక సంపదను జాగ్రత్తగా కాపాడుకుంటూ ఆ వారసత్వాన్ని భావితరాలకు అందించాలనే తపన ఏ కొద్దిమందికో గాని ఉండదు.
అసలు సమాజ హితం కోరే వారెందరు? తాను మాత్రమే సుఖంగా ఉండాలి, తన కుటుంబం హాయిగా ఉండాలనలుకునేవారే ఎక్కువ. వారి స్వార్థం ముందు అన్నీ దిగదుడుపే.

07/16/2017 - 04:32

ఘన ఘనా ఘనము చీకటి మేడ వెలిగించు
మెఱుపు దివ్వెల నూనె తరుగలేదు
పవలు రాతిరి తీరుబడి లేక ఘోషించు
తోయధీశుని గొంతు రాయలేదు.
ఇన బాలకుని దినమ్మును గర్భమున బూను
పొడుపు దిక్సతి కాన్పులుడుగలేదు
ఋతురాజు ధారుణీ సతికి సొమ్ములు పెట్టి
కులికించు పని మానుకొనగలేదు
విశ్వ నిర్మాత చల్లని వీక్షణమున
నేటికిని కెంపు ఛాయ కాన్పించలేదు

07/10/2017 - 00:34

A Thing of Beauty is Joy forever - అన్నాడో ఆంగ్ల కవి.
చూసే దృష్టిని బట్టే సృష్టి. భౌతికంగా కంటికి కనిపించే అందం వేరు.

07/08/2017 - 00:03

క్రిక్కిరిసిన సభా ప్రాంగణం. ఎదురుగా మహా విద్వాంసులందరూ కొలువై యున్నారు. సంప్రదాయ వేషధారణతో యిద్దరు విదుషీమణులు అభివాదం చేస్తూ వేదిక నలంకరించారు.

06/25/2017 - 00:06

కర్ణాటక సంగీతం మాత్రమే వినే శ్రోతలు లలిత సంగీతం చాలా తేలికనుకుంటారు. లలిత సంగీతం వినే వారికీ సినిమా సంగీతం లోకువ. ఈ ముగ్గురూ ఎంత మేధావులైనా వినేవారికెప్పుడూ లోకువే.
ఎవరు ఎలా పాడినా ఇష్టం వుంటేనే వింటాడు లేదా లేచి వెళ్లిపోతాడు. అందుకే సంగీతం ఒక గమ్మతైన భాష. ఏవేవో సంకేతాలతో మనసుకు చేరే భాష. గాయకులు, నాదకులూ ఏదో వినిపిస్తారు. శ్రోతలు వింటారు.

06/18/2017 - 00:10

సాహిత్యమంటే సినిమాల్లోదే సాహిత్యమనీ, సంగీతమంటే సినిమా పాటనే అని భావించేవారి సంఖ్య రానురానూ పెరిగిపోతున్న రోజుల్లో ఈ వేళ శుద్ధమైన సంగీతాన్ని గురించి, మాట్లాడాలన్నా, పాడి వినిపించాలనే ప్రయత్నం చేసినా, దానికి సిద్ధంగా కూర్చుని, కుతూహలంతో వినాలనీ ఆసక్తి కలిగినవారు లేరు. ఆకర్షణకు ఉచితానుచితాలుండవు. అయినా అక్కడక్కడ ఆరిపోకుండా కొన్ని సంగీత సభలు నడుస్తూనే ఉన్నాయి.

06/10/2017 - 23:01

తలుపు తీయగానే సోదరులిద్దరినీ చూసి అన్నగారైన వెంగు భాగవతార్ నిశే్చష్టుడై ‘ఏరా! ఏమైంది?’ అని గట్టిగా అడిగాడు. త్యాగరాజ స్వామి వద్ద బుద్ధిగా సంగీతం నేర్చుకుని పైకొస్తారనుకున్న కృష్ణన్, సుందరంలు కనిపించగానే నిర్ఘాంతపోయి ‘ఏం? మాట్లాడరే!’ అని గద్దించినా వౌనమే సమాధానమయ్యింది. ముఖం చాటేసుకుని సోదరులిద్దరూ ఇంట్లోకి వెళ్లిపోయారు.
* * *

06/04/2017 - 02:32

ఈ సృష్టి మహా విచిత్రమైనది. అందులోని వింతలు అన్నీ ఇన్నీ కావు. చందమామ కథల్లోలా కొన్ని వింతలైతే వింటేనే సంభ్రమాశ్చర్యాలకు గురిచేస్తాయి. అటువంటి వింతలకే వింత మన దేశంలోని కార్గిల్-శ్రీనగర్ జాతీయ రహదారికి సమీపంలో కొలువై ఉంది.
అదే మేగ్నటిక్ హిల్... అయస్కాంత కొండ.

06/04/2017 - 01:45

వెనకటి తరంలోని మృదంగ విద్వాంసులు మాత్రం సౌఖ్యానికి మాత్రమే ప్రాధాన్యత నిస్తూ సాహిత్యంలోని భావం శ్రోతలు అర్థం చేసుకుంటూ ఆనందించే విధంగా తమ మృదంగ వాద్యంతో సంగీత కచేరీ రక్తికి
దోహదపడుతూ గాయకుల ప్రశంసలతోబాటు సంగీత రసికుల
ఆదరాభిమానాలు చూరగొన్నారు. ఆశ్చర్యం కలిగించే విషయం - మృదంగ విద్వాంసులకు వీలైనప్పుడే, గాత్ర విద్వాంసులు సంగీత

Pages