S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమృత వర్షిణి

06/18/2017 - 00:10

సాహిత్యమంటే సినిమాల్లోదే సాహిత్యమనీ, సంగీతమంటే సినిమా పాటనే అని భావించేవారి సంఖ్య రానురానూ పెరిగిపోతున్న రోజుల్లో ఈ వేళ శుద్ధమైన సంగీతాన్ని గురించి, మాట్లాడాలన్నా, పాడి వినిపించాలనే ప్రయత్నం చేసినా, దానికి సిద్ధంగా కూర్చుని, కుతూహలంతో వినాలనీ ఆసక్తి కలిగినవారు లేరు. ఆకర్షణకు ఉచితానుచితాలుండవు. అయినా అక్కడక్కడ ఆరిపోకుండా కొన్ని సంగీత సభలు నడుస్తూనే ఉన్నాయి.

06/10/2017 - 23:01

తలుపు తీయగానే సోదరులిద్దరినీ చూసి అన్నగారైన వెంగు భాగవతార్ నిశే్చష్టుడై ‘ఏరా! ఏమైంది?’ అని గట్టిగా అడిగాడు. త్యాగరాజ స్వామి వద్ద బుద్ధిగా సంగీతం నేర్చుకుని పైకొస్తారనుకున్న కృష్ణన్, సుందరంలు కనిపించగానే నిర్ఘాంతపోయి ‘ఏం? మాట్లాడరే!’ అని గద్దించినా వౌనమే సమాధానమయ్యింది. ముఖం చాటేసుకుని సోదరులిద్దరూ ఇంట్లోకి వెళ్లిపోయారు.
* * *

06/04/2017 - 02:32

ఈ సృష్టి మహా విచిత్రమైనది. అందులోని వింతలు అన్నీ ఇన్నీ కావు. చందమామ కథల్లోలా కొన్ని వింతలైతే వింటేనే సంభ్రమాశ్చర్యాలకు గురిచేస్తాయి. అటువంటి వింతలకే వింత మన దేశంలోని కార్గిల్-శ్రీనగర్ జాతీయ రహదారికి సమీపంలో కొలువై ఉంది.
అదే మేగ్నటిక్ హిల్... అయస్కాంత కొండ.

06/04/2017 - 01:45

వెనకటి తరంలోని మృదంగ విద్వాంసులు మాత్రం సౌఖ్యానికి మాత్రమే ప్రాధాన్యత నిస్తూ సాహిత్యంలోని భావం శ్రోతలు అర్థం చేసుకుంటూ ఆనందించే విధంగా తమ మృదంగ వాద్యంతో సంగీత కచేరీ రక్తికి
దోహదపడుతూ గాయకుల ప్రశంసలతోబాటు సంగీత రసికుల
ఆదరాభిమానాలు చూరగొన్నారు. ఆశ్చర్యం కలిగించే విషయం - మృదంగ విద్వాంసులకు వీలైనప్పుడే, గాత్ర విద్వాంసులు సంగీత

05/21/2017 - 05:02

మండు వేసవి... ఒకపక్క నిప్పులు చెరిగే భానుడు... మరోపక్క చెమటలు కక్కే శరీరం.. ఎన్ని నీళ్లు తాగినా ఎండిపోయే నాలుక... ఇదీ భానుడి ప్రతాపానికి ఇంతకన్నా ఉదాహరణ అక్కర్లేదు... చల్లదనం కోసం, చల్లగాలి కోసం అర్రులు చాచే కాలమిది. అలాంటి వేసవిలోనూ ఓ ప్రాంతం మాత్రం భిన్నంగా ఉంటుంది. దారి పొడవునా సన్నని వాన తుంపరలు శరీరాన్ని తాకుతూ.. గాలిలో వేడి హఠాత్తుగా మాయమై..

05/20/2017 - 21:10

శిరస్సు మీద తురాయిలాంటి జుత్తుతో ఠీవిగా కోడిపుంజు మాదిరిగా కనిపించే ‘గ్రేట్ క్రెస్టెడ్ గ్రెబి’ అనే ఒక రకమైన ఈ నీటిబాతు 19వ శతాబ్దంలో దాదాపు అంతరించిపోయే దశకు చేరుకుంది. నెత్తిమీద ఉండే ఆ తురాయే అప్పట్లో దానికి ఎంతో ఆకర్షణ.

05/14/2017 - 18:57

ప్రపంచంలో ఏ భాషలోనైనా ముందు పాటే పుట్టి ఉంటుంది. ఆటవిక దశ మొదలు అనేక పరిణామాలు దాటి, ఒక లయలో ఆటతో పాట పుట్టి, ఒక మాటనూ మరొక మాటనూ ఒక పద్ధతిలో కలుపుకుంటూ మనసుకు చేరి తరతరాలను ఆనందింప చేస్తూనే ఉంది. పాటకు లొంగని మనిషంటూ ఉంటాడా? గత శతాబ్దం పూర్వార్థంలో గురజాడ, రాయప్రోలు లాంటి కవుల రాకతో పద్య సాహిత్యాన్ని దాటిపోయి కాస్త పక్కకు జరిగి పాటకు బీజం పడింది.

05/07/2017 - 23:17

మనిషి ఆలోచనాశక్తి పెంపొందించుకుని తనని మించిన శక్తి లేదని విర్రవీగుతుంటాడు. ప్రకృతిని కూడా జయించగలనని ప్రగల్భాలు పలుకుతుంటాడు. కానీ అది భ్రమ మాత్రమే అని స్పష్టమవుతుంటుంది ప్రతిసారీ. ప్రకృతి ముందు ఎంతటి ధీరుడైనా పిపీలకమే అని అనాదిగా నిరూపితమవుతూనే ఉంది. మానవుడు విర్రవీగుతున్న ప్రతిసారీ ఉత్పాతాలు, ఉప్పెనలు, జలప్రళయాలు ముంచుకొచ్చి మనిషి ఎంత అల్పుడో స్పష్టమవుతూనే ఉంది.

05/07/2017 - 10:45

.......................
దాచుకో నీ పాదాలకు తగనే చేసిన పూజలివి
నిరంతరంబును నీ మాయే పరం
పరములాయ పాపవే! నీ మాయ!!
మును తల్లి గర్భమున ముంచెను నీ మాయ
వెనక జనించినట్టే వెలసె నీ మాయ
అనుగు కౌమార బాల్య యవ్వనములు నీ మాయ
జనులకు దాటరాని జలధి నీ మాయ

- తాళ్లపాక అన్నమాచార్యులు
............................

04/30/2017 - 00:03

మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అంటూనే, గురుస్సాక్షాత్ పరబ్రహ్మా’ అని గురువుకే పరమోన్నత స్థానాన్నిచ్చారు. ఇందులో వుండే అంతరార్థం భాషార్థంతో కాక భావార్థంతోనే గ్రహించాలి.

Pages