S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అక్షరాలోచన

08/25/2017 - 00:06

అసలు గోలంతా వ్యక్తీకరణతోనే
చివరి వాక్యంగానే మొదలనుకుంటూ
ముక్కలైన మనసునంతా పరుచుకుంటూ
కలకీ కలకీ మధ్య మెలకువతో
మాటకీ మాటకీ మధ్య వౌనంతో
నన్ను నీకు
నిన్ను నాకు అన్వయించుకుందాం

నిజాలంటూనే మన నైజాన్ని
దూది పరుచుకున్నంత నిశ్శబ్దంగా
నేల చీలినంత ధ్యానంగా
అహాలన్నిటికి అంత్యక్రియలు జరిపించేద్దాం

08/25/2017 - 00:04

చిరునవ్వు కోసం
యెంత చిత్రహింసలు పడ్డానో
పలకరింపు కోసం
యెంత ప్రార్థించానో
దూరమై
నీ జ్ఞాపకాలతో
సహవాసమై
కంటి నిండా నీ ప్రతిమలే
గుండె నిండా నీ రక్త్ధారలే
కాలమెప్పుడూ
విడదీస్తూనే ఉంటుంది
నీ కోసం
నా కలం
కవితలు రాస్తూనే ఉంటుంది
కన్నుమూసే వరకు
చితిని చేరి
చితిమంటల్లో కాలే
కడ వరకు.
*

08/25/2017 - 00:02

చేద బావులు
బొక్కెనలు
చేంతాడు
నీళ్లు తోడే
పందేలు
తోడి తోడి
అలసినా మోములో
కానరాని అలసట
చేంతాడు బావిలోకి వదులుతుంటే
దరి తగలకుండా బొక్కెన లాగుతుంటే
ఆనంద పరవశమే
గోళాలు కొప్పెర్లు గంగాళాలు
కుడితి తొట్లు ఎన్నైనా
ఇట్టే నిండిపోయేవి
వానకాలమైతే
చేతికందే నీళ్లు
చెర్లు నిండితే బావుల్లో జలకళ
బావుల చెంత

08/25/2017 - 00:00

ఒక్క కన్నీటి చుక్క వెనక..
ఎంత సముద్ర ఘోష ఉందో
ఎంత లోతైన అగాధముందో
ఎన్ని సుడిగుండాలున్నాయో
ఎన్ని అలజడులున్నాయో!

ఒక్క ఆనందబాష్పం వెనక..
ఎంత సంతోష సాగరముందో
ఎంత ఎతె్తైన ఆనందముందో
ఎన్ని రాగాల సంగీతముందో
ఎన్ని కలల అలలున్నాయో!

బాధలు దాచితే
బంధాలు గట్టిపడునేమో!
ఆనందాలు పంచితే
అనుబంధాలు ఉట్టిపడునేమో!

08/24/2017 - 23:59

గ్రంథాలయంకి వెళ్లడమంటే
దేవుళ్లందరూ ఒక్కచోటే కొలువై ఉన్న
కోవెలకు వెళ్లడమే!
ప్రతీ గ్రంథంలోనూ దైవాన్ని దర్శించి
పరమాత్మతో సంభాషించడమే

ఆ దేవాలయంలో జీవిత చరిత్రలను పఠిస్తుంటే
వ్యక్తిత్వ విలువలు ఉరకలు వేస్తూ
మాలిన్యపు మనస్తత్వాలను శుభ్రంచేసి
మనిషిని ‘మనీషి’గా మారుస్తాయ్

08/24/2017 - 23:57

వేడి గుండెల వేదన
వేగు చుక్కలా యెగసి
ఏ దేవతాసనాన్ని కదిలించిందో
వజ్రాయుధం విజృంభణతో
తరుగుల్మాలు తలలూపి
బృంద విన్యాసం చేసాయి
సంద్రం విప్పిన
చక్కని గొడుగులన్నీ
చల్లగాలిలో విహరించి
కొండ కోనల్ని ముద్దాడి
తకథిమి దరువులతో
తప్పెట్లు మ్రోగించాయి
పచ్చని తివాసీల్లో
ముచ్చటైన చిలుకల రాగాలకు
పురివిప్పిన

08/18/2017 - 20:48

మా దేశం ఒంటినిండా
వింతలు విశేషాల రాసులు
గుసగుసలు - రుసరుసలు
చెట్టాపట్టా లేసుకుంటాయి
వచ్చీపోయే ప్రతి పండుగ జాతర
మా సంస్కృతికి పునర్నవీకరణ
ప్రజాస్వామ్యం వైవిధ్యాలు
ఉద్యమాలకు ఊపిరిలూదుతుంటాయి
ప్రగతి రథాన్ని పటిష్ఠ పథములో
నడిపిస్తూ మెరిపిస్తుంటాయి
స్వేచ్ఛా యామిని దరహాసములోని
మురిపాల తళుకుల ప్రతిబింబాలు

08/18/2017 - 20:47

మొంగరంలా భ్రమణం..
సమూహాల చుట్టూ!
మెరుపుతీగ బంధమేదో వుంది
రహస్యమిదే!!

ఉన్మాదులై వీధుల్లో తిరుగుతున్న
ఈ అభాగ్యులెవరు?
ప్రేమ పరిమళం కళ్లాపు చల్లిన
హృదయాల్తో, ఆనందడోలికల్లో
నిండుగా గడపాల్సిన కాలమంతా
అయ్యో... వీధి పాలవుతుందే?!

నగరమంతా జనసంద్రమ్
మరి ఒక్కొక్కరు
అనాధలై
అభాగ్యులై
అశాంతులై
ఏమిటీ జీవితం!

08/18/2017 - 20:46

దిగ్భ్రాంతిలోంచి
ఇప్పుడే తేరుకున్నాను
ఆ నదిలోంచి
దోసెడు నీళ్లు తీసుకుని
తలపై చల్లుకున్నాను
తెలివొచ్చిన నాకు
అక్కడొక పెద్ద చేయి
కనిపించింది.
ఎన్నో లేత వీపుల్ని తట్టి
కవిత్వంలోకి నెట్టిన
ఆకాశమంత చేయి అది.
అదొక జీవిత నదిలా
కనిపించింది.
జీవిత చరమాంకం వరకూ
తెలుగు కవితా నేలను
సస్యశ్యామలం చేస్తూ

08/18/2017 - 20:45

ప్రేమగ నాతో - చేరిన చాలును
నిలువగ నీ దరి - కోరిన చాలును

కమ్మెను వలపుల - మేఘం తానై
ఒకపరి తలపుల - దూరిన చాలును

వరమే నీవనె - ఆశలు ఇంకెను
ప్రాణము నీవుగ - మారిన చాలును

జన్మలు నీకై - ఎత్తగ లేనిక
జీవిక ఈ గతి - పోరిన చాలును

రాధా మాధవ - వినవా కృష్ణా!
మదిలో మధువై - వొలికిన చాలును

Pages