S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అక్షరాలోచన

09/08/2017 - 21:59

అది నా అదృష్టం
ఆ కవితా చంద్రుడిని కలిశాను
వెనె్నల్లో తడిసిన కలువపూవులా మురిశాను

సినారె దర్శనం ఆకాశమంత తన్మయత్వం,
గంపెడు పూలవర్షం
ఆనందం అనంతం.

ఆ ఆనందంలో
ఆ మైమరపులో
నమస్కరించాను,
కరచాలనం ఇమ్మంటూ నా అరచేయిని
వారి ముందుకు సాగనంపాను

క్షణకాలం నా కుప్పిగంతులు చూసి
పిల్లాడిని లాలించినట్టు
సన్నగా నవ్విన ‘విశ్వంభర’,

09/08/2017 - 21:58

ఇప్పుడు
నమ్మించడమే జీవితం
నమ్మకం కాదు
కానితనపు రక్తాన్ని
నరాలూ తిరస్కరిస్తున్నప్పుడు
మనసు నవనతం చేసుకుంటే తప్పేంటి
తలెత్తుకునే కదా బతకడం
విశ్వాసాన్ని శ్వాసిస్తానంటే ఎలా
ఊపిరి అందని ద్రాక్షౌతుంది
అసలు అలల్ని అరెస్టు చెయ్యాలి
పయనానికి పడిలేవడాలు నేర్పినందుకు
గమ్యాలు చేరేది అలలు కాదు కలలు
మూతపడటం లేదంటూ

09/08/2017 - 21:56

దేహంలోకి రహస్యంగా ఇంకిపోయిన
ఈ షడ్రుచుల ప్రవాహం అంచున
కన్నీళ్లకు అందని కవిత్వం వైపు
కొంతమంది పరుగులు తీస్తున్నారు
ప్రేమ కొన్నిసార్లు ధూపమై అంతటా వ్యాపించాక
రహస్యాలు తెలియని ఆత్మశోధనా సముద్రంలో
నాల్గు కన్నుల నీటి ప్రపంచాలు
సంసారంలో బందీలవుతున్నాయి
అన్ని రుచుల్నీ పుక్కిలించిన
చిన్ని ప్రపంచం ముందు
రెక్కలు విప్పుకుని ఎగరలేక

09/08/2017 - 21:55

తేనెకన్న తియ్యని అమృతభాష నాది
ఆంధ్రులకు ఉత్తేజాన్నిచ్చే
ప్రకృతిపర ప్రాచీన తెలుగు భాష నాది
తెలుగు పదం పలికితే అధరం మధురం
తెలుగు పాట పాడితే వదన వికసితం!
తెలుగు అక్షరాలెప్పుడూ వెలుగుల్ని వెదజల్లు
తెలుగు భాష నిత్యం అవనిలో విరజిల్లు
చేయెత్తి జైకొట్టు తెలుగు
గతమెంత ఘనకీర్తిగల తెలుగు నాది
నా శ్వాస - నా అణువణువూ తెలుగే!!

08/26/2017 - 22:47

సిరులు పండిన నేలతల్లి
పాడిపంటల కల్పవల్లి
స్వేచ్ఛ లేక కుములుతుంటే
ప్రాణాలే తృణప్రాయంగా
ఏకతాటిపై నిలిచి పోరాడిన
అమరవీరుల గుండె ఘోషే
వందేమాతరం.

బానిసత్వపు బందీ నుండి
భరత జాతిని మేల్కొపుతూ
వరదలా పొంగిన స్వాతంత్య్ర కాంక్షే
వందేమాతరం.

08/26/2017 - 22:47

గ్రామాల్లోని
మంచినీళ్ల చెరువుల్ని
ఇళ్ల స్థలాలు
తాగేసాయి!

గ్రామీణుల
పడికట్టు సంభాషణ
తెగని వరికంకి
గొలుసుకట్టు!

రాజమండ్రి
గోదావరి జలాలు
కాటన్ సంస్మరణతో
సవ్వడి చేస్తుంటాయి!

పిసినారి
సత్రంలో తిన్నాక
ఎంగిలి చేతిని
నాలికతో కడిగేసాడు!

కుమ్మరికి
కుండ కరువు
తాపీమేస్ర్తీకి
గూడు అరువు!

08/26/2017 - 22:44

చిన్నారుల్లారా మన్నించండి
ఆక్సిజన్ అందక
మరణించిన ఓ నా భారతమాత
ముద్దుబిడ్డల్లారా మన్నించండి
మీకు ఊపిరిని అందివ్వలేని
స్వాతంత్య్రం మాది.
మిమ్మల్ని కాపాడుకోవాలేని
రాజకీయం మాది.
కన్ను కూడా తెరవకుండా
తనువు చాలించారా?
మన్నించండి...
ఇక్కడ అన్నం దొరకదు...
నీరూ దొరకదు...
వైద్యం అందదు...
విద్య దరి చేరదు...

08/26/2017 - 22:43

నేల మీద మట్టి
ఆకాశంలో మబ్బులు
మబ్బుల్లోని నీరు
ధార అయి ధరణికి చేరింది
అది జీవామృతమై
మట్టిలోని విత్తు మొలకెత్తింది

మొలక మానై, మాను కొమ్మలై
కొమ్మలు రెమ్మరెమ్మలై
రెమ్మలన్నింట అనేకానేక ఆకులై
ఆకు ఆకుకు ఒక పూవై
పుష్పాలు ఫలదీకరించి
కాయలైనవి, పళ్లయినవి
ఆ ఫలాలె అన్నమై ఆహారమై
మనిషికి ప్రాణాధారమైనవి

08/26/2017 - 22:41

జనాభా లెక్కల్లోనికి చేరినా కూడా
సమాజంలో... ఇట్లే ఉంటుందన్నట్లు - రివాజుగా
రోజూ చూసీ చూడకుండా
అతి నిర్లక్ష్యంగా ఉపేక్షించబడుతూన్న-
హృదయమున్న ప్రతివారూ పట్టించుకోదగిన
మరి కొందరు శ్రమ జీవులూ, అనాథలూ ఉన్నారు సుమా!

08/26/2017 - 22:38

ఓ సృష్టికర్తా
నీవిచ్చే వరం...
లోక కల్యాణానికి ఆలంబన కావాలి
లోక వినాశనానికి కాదు
నిత్య శ్రమ జీవనానికి ఆరంభం కావాలి
సోమరితనానికి కాదు
సహకారానికి పునాది కావాలి
అపకారానికి కాదు
తన సర్వస్వాన్ని దోచిపెట్టే గుణం పెంపొందాలి
దోచుకునే తత్వం కాదు
ఒక్కమాటలో చెప్పాలంటే మానవత్వం
మరచిపోకుండా ఉండాలి
దానవత్వాన్ని కాదు

Pages