S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అవీ .. ఇవీ..

02/22/2016 - 22:32

థాయ్‌లాండ్‌లోని బ్యాంకాక్‌లో ఓ షాపు యజమాని ఈ అందమైన బొమ్మను షోకేస్‌లో పెట్టాడు. ఈ బొమ్మవల్ల అదృష్టం కలసివస్తుందని అతడి విశ్వాసం. ఆ దేశంలో ఇప్పుడు ఈ తరహా బొమ్మలకు గిరాకీ ఏర్పడింది. రాజకీయ, ఆర్థిక అస్థిరతతో కొట్టుమిట్టాడుతున్న ఆ దేశంలో చాలామంది ఇప్పుడు ఇలా అదృష్టం తమ తలుపు తట్టాలని చేయని ప్రయత్నం లేదు.

02/14/2016 - 18:23

ఈ చిత్రంలో కన్పిస్తున్నది అచ్చమైన ఆడపిల్లలు అనుకుంటున్నారు కదూ...ఆ కళ్లల్లో జీవం చూస్తే ముచ్చటేస్తుంది కదూ..కానీ అవి కేవలం బొమ్మలు. రష్యా కళాకారుడు మైఖేల్ జజ్‌కోవ్ వీటిని తయారు చేశాడు. అందంగా ముస్తాబు చేసిన ఇలాంటి బొమ్మల్లో అందర్నీ ఆకట్టుకున్నవి మూడు. ఆ బొమ్మల అమ్మాయిలకు ఉల్యాన, నటాలియ, సోఫియా అని పేరుపెట్టాడు. సోషల్‌మీడియాలో ఈ ఫోటోలు పోస్ట్ చేయడమే తరువాయి అభినందనల వెల్లువ మొదలైంది.

02/09/2016 - 23:13

విమానాల్లో ఎయిర్‌హోస్టెస్‌ల మాదిరిగా నౌకల్లోనూ ప్రయాణీకులకు ఉద్యోగులు ఆదరంగా సేవలు అందించాల్సి ఉంటుంది. అందుకోసం తగిన శిక్షణ అవసరం. రోజుల తరబడి కొనసాగే ప్రయాణంలో చికాకు, విసుగు కన్పించనీయకుండా ఆప్యాయంగా, చిరునవ్వుతో పలకరిస్తూ సేవలు అందించాల్సి ఉంటుంది. అందుకే చైనాలో ఓ ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. కేవలం మహిళా ఉద్యోగులను మాత్రమే ఈ శిక్షణకు పిలుస్తున్నారు.

01/31/2016 - 20:18

-భారతి
----------------
మంచులో యోగా
తొలివేకువలో బాలభానుడి లేలేత కిరణాలు మేనిపై పడుతున్నప్పుడు యోగా చేయడం చాలామందికి అలవాటే. మనసుకు హాయినిచ్చే పసందైన వాతావరణంలో యోగా మంచి ఆరోగ్యాన్ని అందిస్తుంది. చైనాలో అయితే కొందరు ఔత్సాహికులు దట్టంగా మంచు అలుముకున్నా వెరవక యోగా నేర్చుకుంటున్నారు. చైనాలోని హెనన్ ప్రావిన్స్ పరిధిలోని లుయాంగ్‌లో ఈ శిక్షణ కొనసాగుతోంది.

01/14/2016 - 17:53

వైన్ తాగడంలో కొత్తేముంది. వైన్‌లా కన్పించే వేడినీళ్లలో కూర్చుని అసలైన వైన్ తాగితేనే మజా అంటున్నారు ఈ అతివలు. టోక్యోలోని కోవాకిచన్ ఎన్స్‌న్ స్పాలో ఈ తరహా ఏర్పాట్లు చేశారు. రెడ్‌హాట్‌వాటర్ టబ్స్‌లో కూర్చుని వైన్ తాగితే అదో గమ్మత్తయిన అనుభవం అంటూ వినియోగదారులను ఆ స్పా ఆకర్షిస్తోంది. వైన్ ప్రారంభోత్సవం అనే వేడుక సందర్భంగా ఈ ఆఫర్‌ను ఆ స్పా ప్రకటించింది.

01/09/2016 - 17:47

సాధారణంగా పులులు గాండ్రిస్తాయి. చిరుతలదీ అదేతీరు. కానీ మంచుప్రాంతాల్లో సంచరించే స్నో లియోపార్డ్స్ గర్జించలేవు. వాటి స్వరపేటికలో ఎలాస్టిక్ మజిల్స్ సరిగ్గా అభివృద్ధి చెందకపోవడమే అందుకు కారణం. అందువల్ల ఇవి అరవడానికి బదులు స్టీమ్‌ఇంజన్‌నుంచి ఆవిరివదిలినప్పుడు వచ్చే శబ్దం మాదిరిగా గుర్రుమంటాయి. భారీగా ఉండే వాటి శరీరం పొడవుకన్నా ఆరురెట్ల దూరాన్ని ఒక్కగెంతులో దూకగలవు.

12/12/2015 - 18:15

నేపాల్‌లో కార్తీకమాసం సందర్భంగా వేడుకలు ఘనంగా జరిగాయి. అక్కడి ప్రఖ్యాత పటన్ దర్బార్ స్వేర్‌లో ఓ మహిళ ఇలా నరసింహావతారంలో చేసిన నృత్యం ఆహూతులను అలరించింది.

12/05/2015 - 17:57

పిల్లలకు నడక, నడత నేర్పేది తల్లే అంటారు. ఆ నిజం పక్షులకూ వర్తిస్తుందని ఈ దృశ్యం చూసి చెప్పొచ్చు. లాంక్‌షైర్‌లోని క్వీన్స్‌పార్క్ సరస్సులో ఓ బాతు ఈదుతూ వెళుతూంటే దానివెంట క్రమశిక్షణతో వరుసగా 16 పిల్లబాతులు ఎంచక్కా అనుసరిస్తున్నాయో చూడండి. ఈ దృశ్యాన్ని కేటర్‌న్యూస్ ఫొటోగ్రాఫర్ మార్క్ క్రైమ్స్ తన కెమెరాలో బంధించాడు.
ఇదోరకం అందం

11/28/2015 - 16:44

యూరప్‌లో అందమైన, చారిత్రక ప్రాంతాలను ఓ చిన్న కాగితం ముక్క కలిపి అందమైన ఆకృతులను సృష్టించడం మెక్‌కర్‌కు అలవాటు. ఈ కళకు పేపర్‌బొయె అని పేరుకూడా పెట్టాడు. ప్రఖ్యాత మిలీనియం డోమ్, ట్రఫాల్గర్ స్వేర్‌ల పైనాకిందా కాగితం ముక్కలను పెట్టి ఎలాంటి థ్రిల్ కల్గించాడో ఈ ఫొటోలను చూస్తే తెలుస్తుంది.
బిగ్‌ఫైట్

11/27/2015 - 17:23

యూరప్‌లో అందమైన, చారిత్రక ప్రాంతాలను ఓ చిన్న కాగితం ముక్క కలిపి అందమైన ఆకృతులను సృష్టించడం మెక్‌కర్‌కు అలవాటు. ఈ కళకు పేపర్‌బొయె అని పేరుకూడా పెట్టాడు. ప్రఖ్యాత మిలీనియం డోమ్, ట్రఫాల్గర్ స్వేర్‌ల పైనాకిందా కాగితం ముక్కలను పెట్టి ఎలాంటి థ్రిల్ కల్గించాడో ఈ ఫొటోలను చూస్తే తెలుస్తుంది.
బిగ్‌ఫైట్

Pages