S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆరోగ్య భాగ్యం

07/07/2018 - 21:47

సాధారణంగా బాలికలకి 10-14 సం. వయసులో రజస్వల అంటే మొట్టమొదటి నెలసరి కన్పిస్తుంది. వంశపారంపర్యంగా చాలా లేత వయసులో అంటే 10 సం.గాని లేక 14 సం.గాని అవుతుంది. రక్తస్రావంతోపాటు జననేంద్రియాల పెరుగుదల, సెక్సు కారక్టరు అంటే రొమ్ముల పెరుగుదల, బాహ్యేంద్రియాల మార్పు కలుగుతుంది. ఇదేకాక వారి మానసిక పరిణతి కూడా జరుగుతుంది.

06/30/2018 - 21:32

బాలికలకు 11-14 సం. వయసులో జననేంద్రియాల పరిణతి వచ్చినప్పటికీ వారి శరీరం ఇంకా ఎదుగుదలలోనే ఉంటుంది. అంటే మిగతా శరీరంలోని గ్రంథులు (ఎండోక్రయిన్స్) ఎముకలు పెరుగుతూ ఉంటాయి. వారి పొడుగు ఇంత అని అప్పుడే నిర్ణయించలేము. ఇంతేకాక వారి మెదడు - అంటే మానసిక పరిపక్వత, ఆలోచనా విధానం ఇంకా ఎదిగే స్థితిలోనే ఉంటాయి. పిట్యూటరీ గ్రంథి, ఎడ్రినల్ గ్రంథి, థైరాయిడ్ గ్రంథి లాంటివి ఇంకా పరిపూర్ణ వికాసాన్ని పొందకపోవచ్చు.

06/23/2018 - 21:15

గర్భిణులు తీసుకోవలసిన జాగ్రత్తలు, ఆహార విహార నియమాలు, నిబంధనలు చాలామందికి తెలుసు. తెలియని వారు వారి కుటుంబంలోని పెద్దవారి వల్లను, వైద్యుల వల్లనూ గ్రహించి ఆ విధంగా నడచుకుంటారు. కాని చేయకూడనివి చాలామందికి తెలియవు. అలాగే మందులు బలానికి గాని, జ్వరం, ఇన్‌ఫెక్షన్స్ వంటి జబ్బులకి గాని స్ర్తిలు వేసుకోవలసి వస్తుంది. వాటిలో కొన్ని కడుపులోని శిశువుకు అపాయం కల్గించవచ్చు.

06/16/2018 - 21:42

గర్భిణీలకు మంచి ఆహారం తినిపిస్తే కాన్పు సానుకూలంగా అవడమేగాక గర్భస్థ శిశువు కూడా ఆరోగ్యంగా వుండే నమ్మకం ఉంటుంది. ఇది అందరికీ తెలుసు. పైగా అందరూ పాటిస్తారు. కానీ ఒకసారి ప్రసవం కాగానే పరిస్థితి మారిపోతుంది. ఎంత పథ్యం పాటిస్తే అంత మంచిది అనుకుని బాలింత కడుపు మాడుస్తూంటారు చాలామంది. డాక్టర్లు చెప్పినా గానీ ఇంట్లోని ఆడువారు వారి మిడిమిడి జ్ఞానంతో సరిగా అన్ని పప్పులతో, కూరలతో అన్నం పెట్టరు.

06/12/2018 - 22:14

నెలనెలా వచ్చే ఋతుస్రావం 45-50 సం. వయసులో ఆగిపోవడం స్ర్తి జీవితంలో ఒక ముఖ్యమైన మార్పు. దీనినే ‘మెనోపాజ్’ అంటాం. సంతానోత్పత్తి చివరి దశగా మనం దీన్ని గుర్తించాలి. 40 సంవత్సరాల కంటే ముందే బహిష్టులు ఆగిపోతే దానిని ప్రిమెచ్యూర్ మెనోపాజు లేక అకాల వృ ద్ధాప్యం అంటారు. కొంతమందికి 55 ఏళ్ల వయసు వరకు కూడా బహిష్టులు రావచ్చు. ఐతే ఇది చాలా తక్కువ శాతంగా (3-4% వరకు) ఉండవచ్చు.

06/12/2018 - 22:13

ఫ్రశ్న: రొమ్ము కేన్సర్ రాకుండా ఆహారంలో ఏమైనా మార్పులు చేయాలా?
-రోహిణీ భాస్కర్ (సికిందరాబాద్)

06/12/2018 - 22:10

గర్భం దాల్చిన స్ర్తికి మొదటి 2-3 నెలలు కొం చెం ఇబ్బంది అనే చెప్పాలి. ఎందుకంటే వేవిళ్లు, నీరసంతో చాలా బాధ పడుతుంది. ఆ సమయంలో ఫామిలీ సపోర్టు, వైద్య సలహాలు మందుల కంటే ఎక్కువ ఫలితాన్నిస్తాయి. కొద్ది కొద్దిగా ఆహారం 2-3 గంటలకొకసారి తీసుకోవాలి. వికారం, వాంతులు విపరీతంగా వుంటే వైద్యులు విటమిన్ బి6 వుండే మందుబిళ్లలు, ఫోలిక్ ఆసిడ్ బిళ్లలు ఇస్తారు.

06/12/2018 - 21:56

ప్రతీ యువతికి రజస్వల మొదలు నెల నెలా వచ్చే బయటలు ఆగిపోయేవరకు కొద్దిరోజులు అటు ఇటుగా ఠంచనుగా రక్తస్రావం అవ్వడం సహజం. కానీ, కొంతమందికి నెలలో రెండుసార్లు లేదా 1 1/2 - 2 నెలలకి ఒకసారి వచ్చి, మరీ ఎక్కువగానో లేదా చాలా కొంచెంగానో రక్తస్రావం అవుతుంది. అటువంటప్పుడు వైద్య పరీక్ష తప్పనిసరిగా చేయించాలి.

06/12/2018 - 21:53

తొమ్మిది నెలలు శిశువును తన గర్భంలో మోసి ప్రసవం తర్వాత పాపని చూసుకుని మురిసిపోవడం, ప్రసవంలో తాననుభవించిన బాధను మర్చిపోవడం తల్లికి సాధారణం. శిశువు సరిగా పెరిగి, తల్లి శరీరం ఆరోగ్యంగానూ, ప్రసవమార్గంలో ఎముకలు, కండరాలు పటిష్టంగాను, విశాలంగానూ ఉంటే ప్రసవం మామూలుగా అవుతుంది. ఇందులో ఏ ఒక్కటి సరిగా లేకపోయినా ప్రసవం కష్టమై, శిశువుగానీ, తల్లిగానీ లేక ఇద్దరూగానీ ప్రాణాపాయస్థితి పొందుతారు.

06/12/2018 - 04:36

డాక్టర్‌గారూ! నా వయస్సు 22 సంవత్సరాలు. నేను చాలా లావుగా ఉంటాను. నా బరువు 86 కిలోలు. నా పొడుగు 5 అడుగులా 3 అంగుళాలు. పైగా నాకు పెళ్లి అయి నాలుగేళ్ళయినా పిల్లలు కలుగలేదు. నా బరువుకీ, సంతానానికీ ఏదైనా సంబంధం ఉందా? నాకు పీరియడ్స్ రెండు, మూడు నెలలకోసారి వస్తాయి. నాకు మొదటినుంచీ ఇలాగే పీరియడ్స్ వచ్చేవి. ఇంతవరకూ నేను దీని గురించి ఏ డాక్టరుగారి సలహా తీసుకోలేదు. మీరు సలహా చెప్పగలరు?

Pages