S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

05/18/2016 - 03:00

మచిలీపట్నం, మే 17: ప్రజా సమస్యల పరిష్కార వేదికగా నిలవాల్సిన జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశాలు క్రమేణా ప్రాధాన్యతను కోల్పోతున్నాయి. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై కూలంకషంగా చర్చించి పరిష్కారం చూపాల్సిన ప్రజాప్రతినిధులు అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. కనీసం సమావేశాలకు రావాలనే ఆలోచన కూడా కొందరు చేయటం లేదు. మంత్రులు వస్తే ఎమ్మెల్యేలు రారు, ఎమ్మెల్యేలు వస్తే మంత్రుల హాజరు కానరాదు.

05/18/2016 - 03:00

మచిలీపట్నం, మే 17: కృష్ణా పుష్కర పనుల్లో అలసత్వం తగదని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అధికారులను హెచ్చరించారు. కృష్ణా పుష్కరాల తేదీ దగ్గర పడుతున్న దృష్ట్యా నిర్మాణ పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. పంచాయతీరాజ్, ఆర్ అండ్ బి, ఇరిగేషన్, దేవాదాయ ధర్మాదాయ, రెవెన్యూ, పోలీసు అధికారులు సమన్వయంతో వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు.

05/18/2016 - 02:59

నందివాడ, మే 17: ఆప్కాబ్ చైర్మన్ పిన్నమనేని వెంకటేశ్వరరావు సతీమణి సాహిత్యవాణి భౌతికకాయాన్ని మంగళవారం వారి స్వగ్రామం రుద్రపాకకు తరలించారు. పలువురు ప్రముఖులు, రాజకీయ నాయకులు మంగళవారం సాయంత్రం భౌతికకాయాన్ని దర్శించి నివాళులర్పించారు.

05/18/2016 - 02:59

నందివాడ, మే 17: హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డులో శనివారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆప్కాబ్ చైర్మన్ పిన్నమనేని వెంకటేశ్వరరావు సతీమణి సాహిత్యవాణి మృతి చెందటంతో జిల్లాలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ ప్రమాదంలో వీరి కారుడ్రైవర్ దాసు కూడా మృతిచెందగా, వెంకటేశ్వరరావు తీవ్రంగా గాయపడ్డారు. ఆదివారం విజయవాడలో తమ సమీప బంధువు కుమార్తె ఓణీల ఫంక్షన్‌కు పిన్నమనేని దంపతులు హాజరయ్యారు.

05/18/2016 - 02:57

విజయవాడ (క్రైం), మే 17: లాడ్జి వద్ద వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. పోలీసుల కథనం ప్రకారం.. బీసెంటురోడ్డుని శ్రీలక్ష్మీ మడత మంచాల లాడ్జి సమీపంలో మంజు (35) అనే వ్యక్తి మంగళవారం అపస్మారక స్థితిలో పడిపోయాడు. స్థానికుల సమాచారం మేరకు గవర్నర్‌పేట పోలీసులు సంఘటనాస్థలాన్ని చేరుకుని మద్యం మత్తులో ఉన్న సదరు వ్యక్తిని ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు.

05/18/2016 - 02:56

విజయవాడ (కార్పొరేషన్), మే 17: విఎంసిలో పనిచేసే ఉద్యోగులందరికీ ప్రభుత్వమే నేరుగా 010 జీవో ద్వారా జీతాలను విడుదల చేసేలా అవసరమైన చర్యలు తీసుకుంటానని నగర మేయర్ కోనేరు శ్రీ్ధర్ పేర్కొన్నారు.

05/18/2016 - 02:55

విజయవాడ (కార్పొరేషన్), మే 17: గాంధీనగర్‌లోని సెలెక్ట్ లాడ్జి నిర్వాహుకులపై విఎంసి చట్టాల ప్రకారం చర్యలు తీసుకోవాలని నగర మేయర్ కోనేరు శ్రీ్ధర్ ఆదేశించారు. ఈ సందర్భంగా మేయర్ శ్రీ్ధర్ సెలెక్ట్ లాడ్జి పక్కనున్న విఎంసి షాపింగ్ కాంప్లెక్సును పరిశీలించిన నేపథ్యంలో విఎంసి స్థలాన్ని ఆక్రమించుకుని వినియోగించుకొంటున్న ఆక్రమిత స్థలాన్ని తక్షణమే స్వాధీనం చేసుకోవాలన్నారు.

05/18/2016 - 02:54

విజయవాడ, మే 17: భవిష్యత్‌లో కరవును అధిగమించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలను ఇతర రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకుంటాయని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. నగరంలోని రాష్ట్ర ప్రభుత్వ అతిథి గృహంలో మంగళవారం మంత్రి మీడియా ప్రతినిధుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు.

05/18/2016 - 02:54

విజయవాడ (కార్పొరేషన్), మే 17: విజయవాడ నగరపాలక సంస్థ టౌన్ ప్లానింగ్ సెక్షన్‌ను కుదిపేసిన నకిలీ టిడిఆర్ బాండ్ల విక్రయాల ఉదంతంలో బాధ్యులుగా గుర్తించిన అధికారులు, సిబ్బందిపై కనె్నర్ర చేసిన విఎంసి కమిషనర్ వీరపాండియన్ వారిని మూకుమ్మడిగా సస్పెండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకుని సమగ్ర విచారణ చేపట్టారు.

05/18/2016 - 02:55

విజయవాడ (కార్పొరేషన్), మే 17: నగరంలోని సర్కిల్ -3 పరిధిలో పటమట హై టెన్షన్ లైన్ రోడ్డు, గురునానక్ రోడ్డు విస్తరణకు స్థలమిచ్చిన యజమానులకు టిడిఆర్ బాండ్ల మంజూరుకు చర్యలు తీసుకోవాలని విఎంసి కమిషనర్ వీరపాండియన్ పేర్కొన్నారు. మంగళవారం ఉదయం ఆ రోడ్డు పనులను పరిశీలించిన ఆయన మాస్టర్ ప్లాన్ ప్రకారం 100 అడుగుల రోడ్డుగా విస్తరించనున్నట్టు తెలిపారు.

Pages