S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

03/15/2019 - 17:44

అనంతపురం: టీడీపీ స్క్రీనింగ్ కమిటీపై ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి అసంతృప్తి వ్యక్తంచేశారు. ఆయన శుక్రవారంనాడు మీడియాతో మాట్లాడుతూ సింగనమల, కాల్యణ్‌దుర్గం, గుంతకల్లులో సిట్టింగ్‌లను మార్చాలని కోరారు. కొంత మంది నాయకులపై అనుమానాలు ఉన్నట్లు వెల్లడించారు. పార్టీ మారబోనని తెలిపారు.

03/15/2019 - 17:06

కడప: మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి మృతిపై ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఎస్పీ రాహుల్ శర్మ ఏర్పాటుచేశారు. ఎస్పీ ఆదేశాల మేరకు అదనపు ఎస్పీ లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో ఈ సిట్ ఏర్పాటైంది. ఫోరెన్సిక్ నిపుణుల బృందాన్ని రప్పిస్తున్నామని ఎస్పీ తెలిపారు. పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. క్లూస్ టీం, డాగ్‌స్క్వాడ్ క్షుణ్ణంగా పరిశీలించాయి.

03/15/2019 - 17:02

కడప: మాజీ మంత్రి, ఎంపీ, వైఎస్ రాజశేఖర్‌రెడ్డి సోదరుడు వైఎస్ వివేకానందారెడ్డి మృతి హత్యేనని పోలీసుల ప్రాధమిక దర్యాప్తులో వెల్లడైంది. తొలుత గుండెపోటుగా భావించినా ఆయన మృతదేహం రక్తం మడుగులో పడివుండటంతో అనుమానాస్పద మృతిగా పోలీసులు నమోదు చేశారు. నిమ్స్ వైద్యులు జరిపిన పోస్టుమార్టమ్ రిపోర్టులో ఆయన శరీరంపై ఏడుచోట్ల కత్తిపోట్లు వున్నట్లు వెల్లడైంది. తలలో రెండుచోట్ల పొడిచిన గాయాలు ఉన్నాయి.

03/15/2019 - 12:36

కడప: వైఎస్ వివేకానంద రెడ్డి మృతిపై ఆయన పీఏ కృష్ణారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయన బాత్‌రూమ్‌లో రక్తపుమడుగులో పడివుండటం, తలకు, చెయ్యికి బలమైన గాయాలు కావటంతో పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. పోలీసులు డాగ్‌స్క్వాడ్‌ను రంగంలోకి దించారు.

03/15/2019 - 12:30

అమరావతి: మాజీ మంత్రి, వైఎస్ రాజశేఖర్‌రెడ్డి సోదరుడు వైఎస్ వివేకానందరెడ్డి మృతికి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ సంతాపం తెలిపారు. మంత్రిగా, మాజీ ఎంపీగా ప్రజల అభిమానాన్ని పొందారని అన్నారు.

03/15/2019 - 12:22

పులివెందుల: దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి సోదరుడు వైఎస్ వివేకానందరెడ్డి శుక్రవారం తెల్లవారుజామున గుండెపోటుతో హాఠాన్మరణం చెందారు. గురువారం రాత్రి వరకు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన ఇంటికి తిరిగివచ్చారు. బాత్‌రూమ్‌కు వెళ్లిన ఆయన గుండెపోటు రావటంతో అక్కడే కుప్పకూలిపోయారు. బాత్‌రూమ్‌లో విగతజీవిగా పడివున్న ఆయనను పీఏ గుర్తించారు.

03/15/2019 - 04:12

విశాఖపట్నం, మార్చి 14: నిన్న, మొన్నటి వరకు ఆంధ్ర రాష్ట్రానికే పరిమితమైన గిరిజన సహకార సంస్థ (జీసీసీ) వ్యాపారాన్ని ఇక నుంచి దేశవ్యాప్తంగా విస్తరించాలని నిర్ణయించింది. ఏపీ, తెలంగాణా రాష్ట్రాలతోపాటు హైదరాబాద్, ఢిల్లీ, చెన్నై, బెంగళూరు, కోల్‌కత్తా తదితర పట్టణాల్లో కాఫీ హౌస్‌లు, పెట్రోల్ బంక్‌ల నిర్వహణకు యాజమాన్యం కార్యాచరణ రూపొందించింది.

03/15/2019 - 04:12

హైదరాబాద్, మార్చి 14: దివంగత నిర్మాత, దర్శకరత్న దాసరి నారాయణ రావు తనయుడు దాసరి అరుణ్ గురువారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిసి పార్టీలో చేరారు. ఈ సందర్భంగా జగన్ ఆయనకు పార్టీ కండువా కప్పి పార్టీలోకి స్వాగతించారు. అనంతరం అరుణ్ మీడియాతో మాట్లాడుతూ జగన్ ఆశయాలు, సిద్ధాంతాలు నచ్చి పార్టీలో చేరానని అన్నారు. జగన్ ఆదేశిస్తే ప్రచారం నిర్వహిస్తాననని ఆయన తెలిపారు.

03/15/2019 - 04:11

కావలి, మార్చి 14 : మార్పు కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారని, వైకాపా అధినేత వైఎస్ జగన్‌కు అద్భుత విజయం అందించాలని ప్రముఖ సినీనటుడు అలీ అన్నారు. నెల్లూరు జిల్లా కావలి పట్టణంలోని ఆర్‌ఎస్‌ఆర్ కల్యాణ మండపంలో గురువారం వైసీపీ ఆధ్వర్యంలో ముస్లింల ఆత్మీయ సదస్సు జరిగింది.

03/15/2019 - 03:41

మంగళగిరి, మార్చి 14: టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశం మేరకే గుంటూరు జిల్లా మంగళగిరి నుంచి తాను అసెంబ్లీకి పోటీ చేస్తున్నానని, చేనేత వర్గాలు అధికంగా ఉన్న ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేయడం తన పూర్వజన్మ సుకృతంగా, అదృష్టంగా భావిస్తున్నానని రాష్ట్ర ఐటీ, పంచాయతీ రాజ్ శాఖామంత్రి నారా లోకేష్ అన్నారు.

Pages