S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

11/30/2017 - 01:28

విజయవాడ, నవంబర్ 29: విజయనగరంలోని ప్రభుత్వ సంగీత కళాశాలకు నిధులు కేటాయించాలని ఎమ్మెల్సీ పివి మాధవ్ విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర శాసన మండలిలో జీరో అవర్‌లో ఆయన మాట్లాడుతూ ఘంటసాల వెంకటేశ్వరరావు, పి.సుశీల వంటి వారు చదువుకున్న కళాశాల అని, ఆదిభట్ల నారాయణ దాసు ప్రిన్సిపాల్‌గా వ్యవహరించారని గుర్తు చేశారు.

11/30/2017 - 01:27

గుంటూరు, నవంబర్ 29: రాజధాని ప్రాంతమైన గుంటూరు నగరం కల్తీలకు అడ్డాగా మారిందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆహార కమిషన్ చైర్మన్ జేఆర్ పుష్పరాజ్ పేర్కొన్నారు. బుధవారం గుంటూరులో బుధవారం ఆయన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఆహార పదార్థాలను కల్తీ చేస్తూ ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్నారని, వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తామన్నారు.

11/30/2017 - 01:27

అమరావతి, నవంబర్ 29: రాజధాని ప్రాంతంలో జరుగుతున్న అన్నిరకాల అభివృద్ధి పనులకు అత్యంత అవసరమైన ఇసుక, మొరం, కంకర తదితర నిర్మాణ సామగ్రికి ఎలాంటి లోటు లేకుండా అందుబాటులో ఉంచుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. అన్ని పనులు నిర్దేశిత వ్యవధిలో జరిగి తీరాలని నిర్మాణ సంస్థలకు తేల్చి చెప్పారు.

11/30/2017 - 01:26

విజయవాడ, నవంబర్ 29: రాష్టవ్య్రాప్తంగా సుబాబుల్, యూకలిప్టస్‌లకు ఒకే ధర నిర్ణయించి అమలు చేయాలని మంత్రుల బృందం నిర్ణయం తీసుకుంది.

11/30/2017 - 01:26

గుంటూరు, నవంబర్ 29: రాష్ట్ర శాసనసభలో బుధవారం 6 బిల్లులు ఆమోదం పొందాయి. పంచాయతీరాజ్‌శాఖ పరిధిలో వీధి కుక్కల నియంత్రణకు నిర్దేశించిన చట్ట సవరణ బిల్లుపై మంత్రి నారా లోకేష్ వివరణ ఇస్తూ గ్రామాలు, పట్టణాల్లో సునకాల బెడద అధికంగా ఉందన్నారు. కాగా మునిసిపాలిటీలలో భవన నిర్మాణ అనుమతుల అధికారాల బదలాయింపుకై నిర్దేశించిన చట్టసవరణ బిల్లును మంత్రి పి. నారాయణ ప్రతిపాదించారు.

11/30/2017 - 01:25

అమరావతి, నవంబర్ 29: పెద్దలసభగా పేరున్న శాసనమండలి చైర్మన్ ఎన్.ఎం.డి.్ఫరూఖ్‌కు అవమానం ఎదురయింది. బుధవారం కౌన్సిల్‌కు వస్తున్న ఆయన కాన్వాయ్‌ను పోలీసులు నిలిపివేయడంతో, మరొక దారిలో సభకు రావలసి వచ్చింది. ఈ వ్యవహారంపై మండలి సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉదయం సభకు వస్తున్న చైర్మన్ ఫరూఖ్ కాన్వాయ్‌ను పోలీసులు నిలిపివేశారు.

11/30/2017 - 01:29

విజయవాడ, నవంబర్ 29: రాష్ట్రంలో అన్ని స్థాయిల్లో తెలుగు ఉండాలన్నదే దివంగత ఎన్టీరామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీ విధానమని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శాసనసభలో స్పష్టం చేశారు. ప్రభుత్వ వ్యవహారాలన్నింటిలో అధికార భాషగా తెలుగు అమలు చేయడానికి 1966 నుంచి అధికార భాషా చట్టం అమల్లో ఉన్నప్పటికీ కారణాలేమైనా పూర్తిస్థాయిలో అమలుకు నోచుకోలేదన్నారు.

11/29/2017 - 04:22

గుంటూరు, నవంబర్ 28: ‘సమాజంలో ప్రతిఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటాం. అనారోగ్యానికి గురైతే ఎన్ని లక్షలైనా గుమ్మరిస్తాం. పరి సరాల పరిశుభ్రత పాటిస్తేనే ఆరోగ్యం. లేకపోతే అంటువ్యాధులు తప్పవు’ అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. వైద్య, ఆరోగ్య రంగంపై మంగళవారం శాసనసభలో లఘు చర్చ జరిగింది.

11/29/2017 - 04:20

పోలవరం, నవంబర్ 28: పట్టిసీమ ఎత్తిపోతల పథకంలోని మోటార్లను మంగళవారం సాయంత్రం నుంచి నిలిపివేసినట్టు పోలవరం ఎస్‌ఈ విఎస్ రమేష్‌బాబు తెలిపారు. ఎత్తిపోతల పథకంలోని 24 మోటార్లను జూన్ 18న ఆన్ చేసి రోజుకు 8,500 క్యూసెక్కుల గోదావరి నీటిని పోలవరం ప్రాజెక్టు కుడికాల్వ ద్వారా కృష్ణాజిల్లాకు తరలించారు. ఇప్పటివరకు ఇప్పటివరకు 105.8 టిఎంసీల నీటిని తరలించారు.

11/29/2017 - 04:19

గోనెగండ్ల, నవంబర్ 28: ముఖ్యమంత్రి చంద్రబాబు బీసీలపై కపటప్రేమ కనబరుస్తున్నారని వైసీపీ అధినేత వైఎస్.జగన్మోహన్‌రెడ్డి ఆరోపించారు. ఎన్నికలకు ముందు ఎన్నో హామీలు ఇచ్చి బీసీలను మోసం చేశారన్నారు. ప్రజా సంకల్పయాత్ర 20వ రోజు మంగళవారం కర్నూలు జిల్లా గోనెగండ్ల మండలంలో కొనసాగింది. ఈ సందర్భంగా గొనెగండ్లలో జరిగిన సభలో జగన్ మాట్లాడుతూ బీసీలపై ప్రేమ అంటే ఇస్తీ పెట్టెలు ఇవ్వడం కాదన్నారు.

Pages