S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

11/18/2016 - 01:26

అనంతపురంటౌన్, నవంబర్ 17: పెద్దనోట్ల రద్దుపై పునఃసమీక్ష జరపాలని పిసిసి అధ్యక్షుడు రఘువీరారెడ్డి డిమాండ్ చేశారు. గురువారం అనంతపురం నగరంలోని వివేకానంద జూనియర్ కాలేజీలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో ప్రజాబ్యాలెట్ నిర్వహించారు.

11/18/2016 - 01:24

తిరుపతి, నవంబర్ 17: రిజర్వేషన్లు ఓటు బ్యాంకు రాజకీయాలకోసమేనా? మీరు సిఎం అయితే రిజర్వేషన్ రద్దుచేస్తారా?, చదలవాడ కళాశాలలో పామ్- డి చదువుతున్న ఓ విద్యార్థి కృష్ణసాయిరెడ్డి నారా లోకేష్‌ను ప్రశ్నించారు. ఇది సున్నితమైన అంశమని, ఆర్థికంగా వెనుబకడిన అన్ని కులాలలోని నిరుపేదలకు ప్రభుత్వం చేయూతనిస్తోందని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారాలోకేష్ సమాధానమిచ్చారు.

11/18/2016 - 01:19

అమరావతి, నవంబర్ 17: తెలుగుదేశం పార్టీని ముఖ్యమంత్రి చంద్రబాబు మళ్లీ అధికారంలోకి తీసుకువచ్చేందుకు వయసును కూడా లెక్కచేయకుండా కష్టపడుతున్నారు. దానికి తమ మేధస్సు జోడించి సత్ఫలితాలిచ్చేలా చూడాల్సిన ముఖ్యమంత్రి కార్యాలయ ఐఏఎస్‌లు (సీఎంఓ) పార్టీ ఆశలకు అనుగుణంగా పనిచేయడం లేదని, తమకంటే సూటుబూటు వేసుకున్న వారికే రెడ్‌కార్పెట్ వేయడాన్ని తెలుగుదేశం నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు.

11/18/2016 - 01:16

విజయవాడ, నవంబర్ 17: పట్టణ ప్రాంతాల్లోని ఎటిఎంల్లో 50 రూపాయల నోట్లు అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే గ్రామీణ ప్రాంత ఎటిఎంల్లో రూ.50 నోట్లను జారీ చేస్తున్నప్పటికీ పట్టణాల్లో, నగరాల్లో జారీ చేయలేదు. పెద్దనోట్ల రద్దు నేపథ్యంలో చిల్లర సమస్యను అధిగమించేందుకు వీలుగా ఈ నోట్లను ఎటిఎంల్లో అందుబాటులో ఉంచనున్నారు.

11/18/2016 - 01:14

అమరావతి, నవంబర్ 17: ‘మేం ప్రతిపక్షంలో ఉన్నామా? అధికారంలో ఉన్నామా? న్యాయం కోసం బాధితుల పక్షాన నిలబడితే మాపైనే కేసులు పెడితే ఇక క్యాడర్‌లో ఏమి ఆత్మస్థైర్యం ఉంటుంది? నేతలకే దిక్కులేకపోతే ఇక కార్యకర్తల సంగతేమిటి? ప్రభుత్వం మీద దృష్టి పెట్టి పార్టీని విస్మరిస్తున్నందుకు నాయకత్వం ఎన్నికల సమయంలో మూల్యం చెల్లించుకోక తప్పదు’. తెలుగుదేశం పార్టీ సగటు కార్యకర్త ఆవేదన ఇది.

11/18/2016 - 01:13

గుంటూరు, నవంబర్ 17: ప్రధాని నరేంద్రమోదీ తీసుకున్న అనాలోచిత నిర్ణయంతో పేద, సామాన్య, మధ్య తరగతి వర్గాల ప్రజలే ఎక్కువగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వైసిపి రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. నల్లధనాన్ని అరికట్టేందుకు పెద్దనోట్ల రద్దు నిర్ణయాన్ని తాము స్వాగతిస్తున్నప్పటికీ ప్రత్యామ్నాయ మార్గాలు చూపకుండా ప్రజలను ఇబ్బందులకు గురిచేయడాన్ని ఆక్షేపించాల్సి వస్తోందన్నారు.

11/18/2016 - 01:13

సింహాచలం, నవంబర్ 17: సింహాచలం శ్రీ వరాహలక్ష్మీనృసింహస్వామి వారి దేవాలయం హుండీల్లో ఎన్నడూ లేనివిధంగా పెద్దనోట్ల కట్టలు దర్శనమిచ్చాయి. హుండీల్లో ఆరుదుగా కనిపించే పెద్ద నోట్ల కట్టలు ఈసారి ఆరు దర్శనమిచ్చాయి. సాధరణంగా 20 నుండి 30 రోజుల మధ్య దేవస్థానం హుండీలను తెరవడం సంప్రదాయం. ఎప్పుడో తప్పితే పెద్దనోట్ల కట్టలు కానుకల రూపంలో రావడం అరుదుగా జరుగుతూ ఉంటుంది. వెయ్యి, అయిదు వందలు కట్టలు ఒకటి రావడం గగనం.

11/18/2016 - 01:12

పుట్టపర్తి,నవంబర్ 17: పుట్టపర్తి సత్యసాయిబాబా జయంతి వేడుకలు శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నాయి. పుట్టపర్తిలో ప్రతిఏటా ఆరు రోజుల పాటు సత్యసాయి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. 18న వేణుగోపాలస్వామి రథోత్సవం నిర్వహిస్తారు. పురాతన వేణుగోపాలస్వామి దేవాలయంలో ప్రత్యేకపూజలు నిర్వహించి స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించిన వీధుల్లో ఊరేగిస్తారు.

11/18/2016 - 01:12

విజయనగరం, నవంబర్ 17: జాతీయ ఉపాధి హామీ పథకం(ఎన్‌ఆర్‌ఇజిఎస్) జాతీయ స్థాయి పురస్కారానికి రాష్ట్రంలో విజయనగరం, అనంతపూర్, చిత్తూరు జిల్లాలు ఎంపికయ్యాయి. ఈ నెల 19న ఢిల్లీలో జరిగే ఓ కార్యక్రమంలో ఐదుగురు సభ్యులు గల బృందం అవార్డు ఎంపిక చేయనున్నారు. కాగా, ఉపాధి హామీ పథకం ద్వారా ఆయా జిల్లాల్లో ఎన్ని పని దినాలు కల్పించారు? ఎన్ని కుటుంబాలు ఉన్నాయి? కూలీల భాగస్వామ్యం, వౌలిక సౌకర్యాలు ఎలా కల్పించారు?

11/18/2016 - 01:11

కర్నూలు, నవంబర్ 17: కర్నూలు జిల్లాలో రేషన్ దుకాణాలు నిర్వహిస్తున్న 149 మంది డీలర్లపై సస్పెన్షన్ వేటు పడింది. వీరిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి అరెస్టు చేయాలని జాయింట్ కలెక్టర్ హరికిరణ్ గురువారం ఆదేశించారు. వీరంతా రేషన్‌కార్డుదారుల ఆధార్, వేలిముద్రలతో సంబంధం లేకుండా అవకతవకలకు పాల్పడి నిత్యావసర వస్తువులను బ్లాక్‌మార్కెట్‌కు తరలించినట్లు విచారణలో తేలిందని జెసి స్పష్టం చేశారు.

Pages