S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

10/01/2016 - 03:42

హైదరాబాద్, సెప్టెంబర్ 30: ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థలకు సంక్రాంతి తర్వాత ఎన్నికలు జరగనున్నాయి. ఈ విషయమై అధికార టిడిపి అధినేత, సీఎం చంద్రబాబు నాయుడు నేతలకు స్పష్టత ఇచ్చినట్లు సమాచారం. దీనిని బట్టి చూస్తుంటే బహుశా ఫిబ్రవరిలో ఎన్నికలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

10/01/2016 - 02:48

శ్రీకాకుళం, సెప్టెంబర్ 30: ఇక అణువు కదలదు. అత్యంత ప్రతిష్టాత్మకంగా భారత - అమెరికా దేశాల సంయుక్త ఆధ్వర్యంలో కొవ్వాడలో పది వేల మెగావాట్ల సామర్థ్యంలో నిర్మించనున్న అణుపార్కు నిర్మాణానికి అన్ని రకాల సన్నాహాలూ తుది దశకు చేరుకున్న సమయంలో నిధుల కొరత ఎదురైంది. అత్యంత కీలకమైన భద్రత వలయానికి 60 కిలోమీటర్లలోపు ఏయే గ్రామాలు ఖాళీ చేయాలి? అణుకేంద్ర రక్షణ పరిధిలోకి ఏయే గ్రామాలు వస్తాయి?

10/01/2016 - 02:47

విజయవాడ, సెప్టెంబర్ 30: దక్షిణ భారతదేశంలో సుప్రసిద్ధ పుణ్యక్షేత్రాల్లో అత్యంత ప్రాధాన్యత కల్గిన శక్తి పీఠం.. శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో దసరా మహోత్సవాలు శననివారం తెల్లవారుఝాము నుంచి ప్రారంభం కాబోతున్నాయి. 11వ తేదీ వరకు జరిగే ఈ ఉత్సవాల నిర్వహణకు దాదాపు ఏడుకోట్ల రూపాయలు పైగా వెచ్చిస్తున్నారు.

10/01/2016 - 02:42

రాజమహేంద్రవరం, సెప్టెంబర్ 30: అఖండ గోదావరి వరద ఉద్ధృతి తగ్గుముఖం పట్టింది. ఎగువ ప్రాంతంలోని భద్రాచలం వద్ద గత 24 గంటలుగా అతి నెమ్మదిగా తగ్గుదల కన్పించడంతో తూర్పు గోదావరి జిల్లా ధవళేశ్వరం బ్యారేజి వద్ద నిలకడగా ఉన్న వరద శుక్రవారం రాత్రి నుంచి తగ్గుముఖం పట్టింది.

10/01/2016 - 02:41

హైదరాబాద్, సెప్టెంబర్ 30: ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల నిర్వహించిన 2011 గ్రూప్-1 మెయిన్ పరీక్షలో ఐదో పేపర్‌లో ఇచ్చిన గణిత ప్రశ్నలు సిలబస్‌లో లేనివేనని ఫలితంగా 30 మార్కులను విద్యార్ధులు నష్టపోవల్సి వచ్చిందని డివైఎఫ్‌ఐ కార్యదర్శి ఎం సూర్యారావు తెలిపారు. సిలబస్‌కు సంబంధం లేని మూడు ప్రశ్నలు తొలగించడం ద్వారా అభ్యర్ధులు మధ్య సమతుల్యతను పాటించాలని డివైఎఫ్‌ఐ రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది.

10/01/2016 - 02:40

హైదరాబాద్, సెప్టెంబర్ 30: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని అన్ని రంగాల్లో అభివృద్ధికి ప్రణాళికలు రచించిన ప్రభుత్వం విద్యారంగంలో కూడా అగ్రపీఠాన నిలిపేందుకు చర్యలు చేపట్టింది. రాజధానిలో నివసించే ప్రజలను దృష్టిలో ఉంచుకుని 160కి పైగా ప్రాధమిక పాఠశాలలు, వందకు పైగా ఉన్నత పాఠశాలలు, 27 జూనియర్ కాలేజీలు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.

10/01/2016 - 02:40

కర్నూలు, సెప్టెంబర్ 30: ఉగ్రవాద దాడులు జరుగవచ్చన్న హెచ్చరికల నేపధ్యంలో శ్రీశైలం ప్రాజెక్టు వద్ద భద్రతను మరింత పటిష్టం చేశారు. ఈ మేరకు జిల్లా పోలీసు యంత్రాంగానికి రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. భారత్, పాకిస్తాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపధ్యంలో ఉగ్రదాడులకు ఎలాంటి ఆస్కారం ఇవ్వకుండా ఉండేందుకు ముందస్తు చర్యల్లో భాగంగా భద్రత మరింత పెంచాలని ఆదేశాలందాయి.

10/01/2016 - 02:39

గుంటూరు (లీగల్), సెప్టెంబర్ 30: ఉమ్మడి రాష్ట్రాల్లోని వివిధ జిల్లా స్థాయి కోర్టుల్లో పరిపాలన విభాగంలో సహకారం అందించేందుకు మూడేళ్ల క్రితం ఎంతో ఆర్భాటంగా నియమించిన 28 మంది మేనేజర్లకు ఒకేరోజు హైకోర్టు ఉద్వాసన పలికింది.

09/30/2016 - 04:20

విశాఖపట్నం, సెప్టెంబర్ 29: అండమాన్‌లోని పోర్టుబ్లెయిర్‌కు బయలుదేరిన నౌక ప్రయాణికులకు నరకం చూపించింది. సాంకేతిక లోపంలో నిలిచిపోయిన నౌకలో దాదాపు రెండున్నర రోజుల అష్టకష్టాలు పడ్డారు. భోజనం, నీటి సౌకర్యం లేక ఇబ్బందులు పడ్డారు. విశాఖలోని జెట్టీకి బుధవారం అర్ధరాత్రి దాటాక సుమారు 2 గంటల సమయానికి నౌక చేరుకున్నప్పటికీ అధికారులు నిర్ణయం తీసుకోవడంలో జాప్యం కారణంగా 14 గంటల పాటు నిరీక్షించాల్సి ఉంది.

09/30/2016 - 04:19

ఏలూరు, సెప్టెంబర్ 29: పశ్చిమగోదావరి జిల్లాలో ఆధార్ అనుసంధానంతో ఆన్‌లైన్ ద్వారా పెన్షన్లు, ఇ-పాస్ ద్వారా రేషన్, ఎరువుల సరఫరా ప్రక్రియను అమెరికాకు చెందిన బిల్‌గేట్స్ మిలిండా ఫౌండేషన్ సభ్యులు గురువారం పరిశీలించారు. తొమ్మిది మంది సభ్యుల బృందం దెందులూరు మండలం కొవ్వలి గ్రామం సందర్శించింది. అక్కడ రైతులు, సామాజిక పెన్షన్లు పొందే లబ్ధిదారులు, తెల్ల రేషన్ కార్డుదారులతో బృందం సభ్యులు స్వయంగా మాట్లాడారు.

Pages