S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

10/02/2016 - 02:34

విశాఖపట్నం, అక్టోబర్ 1: విదర్భ నుంచి తెలంగాణ, దక్షిణ తమిళనాడు వరకూ దక్షిణ కోస్తాంధ్ర మీదుగా అల్పపీడన ద్రోణి కొనసాగుతోంది. దీని ప్రభావంతో రానున్న 24 గంటల్లో కోస్తాలో చెదురుముదురుగా వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు శనివారం రాత్రి తెలిపారు. తరువాత వర్షాలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని తెలిపారు.

10/02/2016 - 02:33

కాకినాడ, అక్టోబర్ 1: సముద్ర తీరంలో పర్యావరణ పరిరక్షణకు కోస్ట్‌గార్డ్ తన వంతు కృషి చేసేందుకు ముందుకువచ్చింది. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన స్వచ్ఛ్భారత్ ఉద్యమంలో భాగంగా స్వచ్ఛ్భారత్ సాగర్ అభియాన్ పేరుతో తీర ప్రాంతంలో పర్యావరణాన్ని కాపాడేందుకు కాకినాడ కోస్ట్‌గార్డ్ కార్యాచరణ ప్రణాళిక రూపొందించింది.

10/01/2016 - 06:44

కావలి, సెప్టెంబర్ 30: ఉన్నత చదువులు చదివి మరింత అత్యున్నత చదువుల కోసం అమెరికా వెళ్లి అవి పూర్తి చేసుకొని ఉద్యోగంలో చేరిన కొద్ది నెలలకే కావలికి చెందిన గోగినేని ప్రియాంక(24) అనే యువతి వాషింగ్టన్ రాష్ట్రంలోని లేసి ఏరియాలో గురువారం ఉదయం దగ్గరలోని ఓ కొలనులో పడి మృతిచెందింది. వ్యాయామంకోసం నడుచుకుంటూ వెళ్లి ప్రమాదవశాత్తు అందులో పడి ప్రాణాలు కోల్పోయింది.

10/01/2016 - 06:15

విజయవాడ, సెప్టెంబర్ 30: ఆంధ్రప్రదేశ్‌లో మరో కొత్త యూనివర్సిటీ ఏర్పాటు కాబోతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు సాంకేతిక విద్యకు ప్రముఖ స్థానం ఇస్తున్నారు. అందులో భాగంగా తిరుపతి కేంద్రంగా ఎస్వీ యూనివర్సిటీలో డిసెంబర్‌లో డిజిటల్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్నారు. అందుకోసం గుజరాత్‌కి చెందిన ఫోరెన్సిక్ యూనివర్సిటీ, కోల్‌కతాకు చెందిన ప్రాక్సిస్ బిజినెస్ స్కూల్స్‌కు ఏపితో ఒప్పందం కుదిరింది.

10/01/2016 - 06:13

విశాఖపట్నం, సెప్టెంబర్ 30: భారత్-పాక్‌ల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో విశాఖలో హై అలర్ట్ ప్రకటించారు. విశాఖలోని తూర్పు నౌకాదళం అప్రమత్తమైంది. నౌకాదళ స్థావరం వద్ద నిఘాను, పహారాను ముమ్మరం చేశారు. అలాగే సముద్ర మార్గాల గుండా ఉగ్రవాదులు చొరబడే అవకాశం ఉండవచ్చన్న అనుమానంతో అత్యాధునిక సాంకేతిక పరికరాలతో పహారా కాస్తున్నారు.

10/01/2016 - 06:11

నెల్లూరు, సెప్టెంబర్ 30: ప్రయాణికుల సౌకర్యార్థం గూడూరు - సికింద్రాబాద్ నడుమ నడిచే సింహపురి సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలు అక్టోబర్ 1నుంచి మార్చిన వేళలు అమలులోకి రానున్నాయి. ఈరైలు గూడూరులో కొత్త సమయం ప్రకారం సాయంత్రం 6:50గంటలకు బయలుదేరి 7:11కు నెల్లూరు ప్రధాన రైల్వే స్టేషన్‌కు చేరుకుంటుంది. అక్కడి నుంచి , బిట్రగుంట, కావలి, సింగరాయకొండ మీదుగా ఒంగోలుకు 8:40కు చేరుకుంటుంది.

10/01/2016 - 06:10

హైదరాబాద్, సెప్టెంబర్ 30: అమరావతికి అంతర్జాతీయ స్థాయి ప్రచారం ఇస్తున్నప్పటికీ అక్కడి అధికారుల పనితీరు నత్తలనే ఈర్ష్య పడేలా చేస్తోంది. అమరావతి జిల్లాకు ఇద్దరు మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్నా ముఖ్యమంత్రి ఇచ్చిన రేటింగుల్లో జిల్లా స్థానాలు అథమంగా ఉన్నాయి. రుణ సౌకర్యాల కల్పనలో తప్ప మిగిలిన అన్ని అంశాల్లోనూ ముచ్చటగా మూడో స్థానం కూడా దక్కించుకోలేకపోయింది.

10/01/2016 - 04:47

పోలవరం, సెప్టెంబర్ 30: పట్టిసీమ ఎత్తిపోతల పథకంలోని మోటార్లను ఆన్‌చేసి కృష్ణా డెల్టాకు గోదావరి జలాలు తరలించే ప్రక్రియను శుక్రవారం నుండి తిరిగి ప్రారంభించారు. సెప్టెంబర్ 20వ తేదీ వరకు 17 మోటార్లు ఆన్‌చేసి రోజుకు ఆరువేల క్యూసెక్కుల నీటిని తరలించేవారు. భారీ వర్షాల కారణంగా ప్రకాశం బ్యారేజీకి పూర్తిస్థాయిలో నీరు చేరడంతో 21వ తేదీ ఉదయం నుండి మోటార్లను నిలిపివేశారు.

10/01/2016 - 04:43

నెల్లూరు, సెప్టెంబర్ 30: భారత సైన్యం పిఓకెలోని పాకిస్తాన్ మిలిటెంట్ల స్థావరాలపై మెరుపుదాడులు చేసి 38మంది ఉగ్రవాదులను హతమార్చిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అన్ని మెట్రో నగరాలతోపాటు ముఖ్య ప్రాంతాల్లో హై అలర్ట్ ప్రకటించింది. ఈ నేపధ్యంలో నెల్లూరు జిల్లా కృష్ణపట్నం ఓడరేవులో ఉన్నతాధికారులు మూడంచెల పటిష్ట భద్రతా చర్యలకు శ్రీకారం చుట్టారు.

10/01/2016 - 04:41

హైదరాబాద్, సెప్టెంబర్ 30: ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఆర్ అండ్ బి రోడ్లు అధికంగా దెబ్బతిన్నాయి. గుంటూరు, పశ్చిమగోదావరి, విశాఖపట్టణం, తూర్పుగోదావరి జిల్లాల్లో రోడ్లు పెద్ద ఎత్తున ధ్వంసం అయ్యాయి. చాలా చోట్ల వరదలకు రోడ్లు కొట్టుకుపోయాయి. రోడ్లు భవనాల శాఖ తాజా పరిశీలన మేరకు 10 జిల్లాల్లో 2,200 కిలోమీటర్లు మేర రోడ్లు దెబ్బతిన్నాయని అంచనా వేశారు.

Pages