S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

03/29/2016 - 18:31

హైదరాబాద్: జాతీయ స్థాయిలో ఉత్తమ చిత్రంగా అవార్డు గెలుచుకున్న ‘బాహుబలి’ సినిమా తెలుగువాళ్ల సత్తాను ప్రపంచానికి చాటి చెప్పిందని ఎపి సిఎం చంద్రబాబు మంగళవారం అసెంబ్లీ సమావేశంలో ప్రశంసించారు. జాతీయ ఉత్తమ చిత్రంగా ‘బాహుబలి’, ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా ‘కంచె’ అవార్డులను సాధించడం పట్ల అభినందనలు తెలుపుతూ చంద్రబాబు ప్రవేశపెట్టిన తీర్మానాన్ని సభలో ఏకగ్రీవంగా ఆమోదించారు.

03/29/2016 - 18:30

అనంతపురం: పట్టాదారు పాస్ పుస్తకం ఇచ్చేందుకు ఓ రైతు నుంచి మూడువేల రూపాయలు లంచం తీసుకుంటుండగా బ్రహ్మసముద్రం తహశీల్దార్ కార్యాలయంలో రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ వెంకటేశులును ఎసిబి అధికారులు మంగళవారం పట్టుకున్నారు. నిందితుడిని ఎసిబి కోర్టులో హాజరు పరచనున్నట్లు అధికారులు తెలిపారు.

03/29/2016 - 16:43

హైదరాబాద్: నవ్యాంధ్ర రాజధానిగా అవతరించే అమరావతిలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని, 125 అడుగుల పొడవుండే ఈ విగ్రహం రాజధానికే వనె్న తెస్తుందని ఎపి సిఎం చంద్రబాబు మంగళవారం అసెంబ్లీ సమావేశంలో చెప్పారు. అంబేద్కర్ ఆశయాల సాధనకు తమ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. అంబేద్కర్ జయంతి నాడు ఆరులక్షల ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేస్తామన్నారు.

03/29/2016 - 16:42

హైదరాబాద్: నీటి స్టోరేజీకి అవకాశం లేకుండా పట్టిసీమ ప్రాజెక్టును పూర్తి చేయడం వల్ల రైతులకు ఎలాంటి ప్రయోజనం ఉండదని, ఈ ప్రాజెక్టు పేరుతో ప్రభుత్వం 1,600 కోట్ల రూపాయలను వృథా చేసిందని మంగళవారం అసెంబ్లీ సమావేశంలో విపక్షనేత జగన్ ఆరోపించారు. పట్టిసీమ ద్వారా నీళ్లు కిందకు వెళుతున్నాయంటే అందుకు వైఎస్ హయాంలో ప్రారంభించిన పోలవరం కుడికాలువే కారణమన్నారు.

03/29/2016 - 16:40

హైదరాబాద్: అనుకున్న సమయం కంటే ముందుగానే పట్టిసీమ ప్రాజెక్టును పూర్తి చేశామని, ఈ ప్రాజెక్టు వల్ల గోదావరి జిల్లాలకు నష్టం కలుగుతుందన్న అపోహలు అర్థం లేనివని సిఎం చంద్రబాబు మంగళవారం అసెంబ్లీ సమావేశంలో అన్నారు. పట్టిసీమపై వైకాపా తప్పుడు ప్రచారం చేసిందన్నారు. నదుల అనుసంధానాన్ని చేతల్లో చూపించిన ఘనత తమకే దక్కిందన్నారు.

03/29/2016 - 16:38

చిత్తూరు: సిసి కెమెరాలను ధ్వంసం చేసి ఓ ఎటిఎంలో నగదు చోరీకి దుండగులు సోమవారం అర్ధరాత్రి విఫలయత్నం చేశారు. గాజులమండ్యంలోని ఇండియావన్ ఎటిఎంలో ఈ ఘటన జరిగింది. ఎటిఎం తెరుచుకోనందున వారు పలాయనం చిత్తగించారు.

03/29/2016 - 16:38

హైదరాబాద్: వైకాపాను వీడాలా? వద్దా? అనే సంశయానికి ఆ పార్టీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ఎట్టకేలకు తెర దించారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ఆయన మంగళవారం ప్రకటించారు. ఈ మేరకు పార్టీ అధినేత వైఎస్ జగన్‌కు నెహ్రూ ఓ లేఖను పంపారు. ‘మీరు చెప్పినట్లు నడుచుకోలేక పోతున్నందుకు రాజీనామా చేస్తున్నాన’ని ఆయన పేర్కొన్నారు.

03/29/2016 - 16:35

గుంటూరు: పిడుగురాళ్లకు చెందిన 21 ఏళ్ల యువతిపై సోమవారం రాత్రి అత్యాచారానికి పాల్పడిన రషీద్, రహీం అనే వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఇద్దరు నిందితులతో పాటు వెంకటేశ్వర్లు, వెంకటేష్ అనే మరో ఇద్దరు కలిసి యువతిని బలవంతంగా ఆటోలో ఎక్కించి సమీపంలోని అటవీ ప్రాంతానికి తీసుకువెళ్లారు. తాము అత్యాచారానికి పాల్పడినట్లు రషీద్,రహీం అంగీకరించారు. యువతిని వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

03/29/2016 - 13:06

హైదరాబాద్: భూమా నాగిరెడ్డి తిరిగి టిడిపిలో చేరాక ఇపుడు మళ్లీ ఫ్యాక్షన్ రాజకీయాలు మొదలైనట్లు మాజీ మంత్రి శిల్పా మోహన్ రెడ్డి అన్నారు. తన వర్గానికి చెందిన సర్పంచ్ తులసిరెడ్డిపై మంగళవారం రాత్రి కత్తులతో దాడి జరిగిందని, ఈ ఘటనకు భూమా కారకుడని ఆయన ఆరోపించారు. తులసిరెడ్డి కుటుంబ సభ్యులను వెంటబెట్టుకుని శిల్పా మోహన్‌రెడ్డి సోదరులు ఈరోజు పార్టీ అధినేత చంద్రబాబును కలిశారు.

03/29/2016 - 13:05

కడప: శ్రీరామనవమి సందర్భంగా ఏప్రిల్ 14 నుంచి ఒంటిమిట్ల కోదండరామ ఆలయంలో బ్రహ్మోత్సవాలను నిర్వహించేందుకు ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు టిటిడి చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి తెలిపారు. ఆయన మంగళవారం ఒంటిమిట్ట ఆలయాన్ని సందర్శించారు. నవమి వేడుకలను ఇక్కడ వేడుకగా జరిపేందుకు టిటిడి తగినంతగా నిధులు మంజూరు చేస్తుందన్నారు.

Pages