S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

04/30/2016 - 12:40

విజయవాడ: అభివృద్ధిని అడ్డుకునే వారు ఎన్ని ఆరోపణలు చేసినా పోలవరం సాగునీటి ప్రాజెక్టు పనులను నిలిపివేసే ప్రసక్తే లేదని, అనుకున్న గడువుకు పనులను పూర్తి చేస్తామని ఇరిగేషన్ మంత్రి దేవినేని ఉమ తెలిపారు. ఆయన శనివారం ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ, ప్రకాశం బ్యారేజీ వద్ద కృష్ణా జలాల మట్టం బాగా అడుగంటినందున గుంటూరు, కృష్ణా జిల్లాల్లో తాగునీటి సమస్య తలెత్తిందన్నారు.

04/30/2016 - 12:39

విజయవాడ: వైకాపా అధ్యక్షుడు జగన్‌తో కొందరు బిజెపి నాయకులు కుమ్మక్కై రాష్ట్భ్రావృద్ధికి అడ్డుతగులుతున్నారని టిడిపి ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న శనివారం ఇక్కడ ఆరోపించారు. అవినీతిపరుడైన జగన్‌కు దిల్లీలో కేంద్రమంత్రులు అపాయిమెంటు ఇవ్వడం సిగ్గుచేటన్నారు. చంద్రబాబును ఇబ్బంది పెట్టేందుకు అసత్యాలు ప్రచారం చేస్తున్న జగన్‌తో కొందరు బిజెపి నేతలు చేతులు కలపడం దారుణమన్నారు.

04/30/2016 - 12:39

హైదరాబాద్: ఎపికి ప్రత్యేక హోదా ఇవ్వాలన్న డిమాండ్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు పథకం ప్రకారం నీరుగార్చారని వైకాపా అధ్యక్షుడు జగన్ ఆరోపించారు. ప్రత్యేకహోదా సంజీవని కాదని బాబు వ్యాఖ్యానించడం వల్లే కేంద్రం ఆ విషయాన్ని పట్టించుకోవడం లేదన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను విస్మరించి, ఎపి ప్రజలతో ప్రధాని మోదీ, చంద్రబాబు చెలగాటమాడుతున్నారని విమర్శించారు.

04/30/2016 - 12:38

హైదరాబాద్: సాగునీటి ప్రాజెక్టులపై ఎపి సర్కారు నిర్లక్ష్య వైఖరికి నిరసనగా మే 16 నుంచి కర్నూలులో తాను నిరవధిక దీక్ష చేస్తానని వైకాపా అధినేత జగన్ ప్రకటించారు. ఆయన శనివారం ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ, తెలంగాణలో చేపడుతున్న పాలమూరు, డిండి ప్రాజెక్టులను చంద్రబాబు ఎందుకు అడ్డుకోవడం లేదని ప్రశ్నించారు. ప్రతిష్టాత్మకమైన పోలవరం ప్రాజెక్టును బాబు స్యామ్‌ల మయం చేశారని ఆరోపించారు.

04/30/2016 - 12:38

అనంతపురం: పుట్టపర్తి అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ వైస్ చైర్మన్ రామాంజనేయులు ఇంటిపై శనివారం ఉదయం ఎసిబి అధికారులు దాడి చేసి సుమారు 2 కోట్ల రూపాయల అక్రమాస్తులున్నట్లు గుర్తించారు. భారీగా అవినీతి ఆరోపణలు రావడంతో ఇతని ఇంటిపై నెల రోజుల వ్యవధిలో ఎసిబి అధికారులు రెండోసారి దాడులు చేశారు.

04/30/2016 - 12:37

చిత్తూరు: శ్రీకాళహస్తి బైపాస్ రోడ్డులో పోలీసులు శనివారం ఉదయం ఆకస్మిక దాడులు జరిపి నలుగురు కూలీలను అరెస్టు చేశారు. వారు ప్రయాణిస్తున్న కారును, భారీగా ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నరు.

04/30/2016 - 12:36

కాకినాడ: కాకినాడలో డిటిసి (డిప్యూటీ ట్రాన్స్‌పోర్టు కమిషనర్)గా పనిచేస్తూ భారీగా అక్రమార్జనకు పాల్పడిన ఆదిమూలం మోహన్‌ను ఎసిబి అధికారులు శనివారం కృష్ణాజిల్లా చల్లపల్లి జైలుకు తరలించారు. ఈరోజు ఉదయం ఆయనను విజయవాడ ఎసిబి కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి 15రోజుల రిమాండ్ విధించారు.

04/30/2016 - 12:36

విజయవాడ: ఎపికి ప్రత్యేకహోదా అవసరం లేదంటూ కేంద్ర హోంశాఖ సహాయమంత్రి ప్రకటించడంతో తమ నిరసన గళం వినిపించేందుకు టిడిపి నేతలు సమాయత్తమవుతున్నారు. మే 3న ఇక్కడ జరిగే పార్టీ పాలిట్‌బ్యూరో సమవేశంలో ప్రత్యేక హోదాపై చర్చించాలని కొందరు నేతలు యోచిస్తున్నట్లు సమాచారం. కేంద్రం వైఖరిపై నిరసన తెలిపేలా తీర్మానం చేయాలని వారు భావిస్తున్నారు.

04/30/2016 - 12:35

తిరుపతి: ఇక్కడికి సమీపంలోని బాకరాపేట ఘాట్‌రోడ్‌లో శనివారం ఉదయం కూంబింగ్ చేస్తున్న పోలీసులపై ఎర్రచందనం కూలీలు రాళ్లదాడి చేశారు. పోలీసులు వస్తున్నట్లు పసిగట్టిన కూలీలు రాళ్లు రువ్వడం ప్రారంభించగా ఓ కానిస్టేబుల్ గాయపడ్డాడు. వెంటనే తేరుకున్న పోలీసులు గాలిలోకి కాల్పులు జరపడంతో కూలీలు పరుగుతీశారు. ఓ కూలీని అరెస్టు చేసి, 37 ఎర్రచందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

04/30/2016 - 07:51

పెళ్లకూరు, ఏప్రిల్ 29: బిఆర్ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా నడుస్తూ ఆయన స్ఫూర్తితో విద్యనభ్యసించిన తాను చేస్తున్న ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేసి రాజకీయాల్లోకి వచ్చి ప్రజా సేవ చేస్తున్న తన పట్ల ప్రభుత్వ ఉద్యోగులు, రాజకీయ పార్టీల నాయకులు వివక్ష చూపడం సహేతుకం కాదని సూళ్లూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య ఆవేదన వ్యక్తం చేశారు.

Pages