S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

03/30/2016 - 13:45

విజయవాడ: ఓ యువతిని సెల్‌ఫోన్‌లో నగ్నంగా చిత్రీకరించి బెదిరింపులకు పాల్పడిన నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ వ్యవహారంలో ఇప్పటికే మండలి రవికాంత్ అనే యువకుడిని బుధవారం పోలీసులు అరెస్టు చేసి, మిగతా నిందితుల కోసం ఆరా తీస్తున్నారు.

03/30/2016 - 12:08

హైదరాబాద్: రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితులపై ఎపి సర్కారు బుధవారం నాడు అసెంబ్లీలో కాగ్ (కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్) నివేదికను సమర్పించింది. ప్రభుత్వ, ప్రైవేటు రంగ సంస్థల తాజా పరిస్థితులను నివదేకలో పొందుపరిచారు. 2014-15లో రెవెన్యూ లోటు రూ.24,194 కోట్లు, ద్రవ్యలోటు రూ.31,717 కోట్లు, మొత్తం 6.10శాతం లోటు నమోదైందని కాగ్‌ నివేదిక వెల్లడించింది.

03/30/2016 - 12:05

గుంటూరు: ఓ స్కూల్ బస్సు పొలాల్లోకి బోల్తాపడి విద్యార్థుల స్వల్ప గాయాలకు గురైన సంఘటన చెరుకుపల్లి మండలం కామినేనివారి పాలెం వద్ద బుధవారం ఉదయం జరిగింది. క్షతగాత్రులకు సమీప ఆస్పత్రిలో చికిత్స అందజేశారు.

03/30/2016 - 12:04

హైదరాబాద్: అత్యధిక సంఖ్యలో పాటలు పాడి గిన్నిస్ ప్రపంచ రికార్డును సాధించిన సినీ నేపథ్యగాయని సుశీలను ఎపి సిఎం చంద్రబాబు నాయుడు బుధవారం అభినందించారు. ఆమె ఇంతటి ఘనతను సాధించడం తెలుగువారందరికీ గర్వకారణమన్నారు. 17వేల పైచిలుకు పాటలు పాడడం అసాధారణ ప్రతిభకు తార్కాణమన్నారు.

03/30/2016 - 12:10

హైదరాబాద్: నియోజకవర్గ అభివృద్ధి నిధులను మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ ఇన్‌చార్జిలకు ప్రభుత్వం కేటాయిస్తోందని ఎపి అసెంబ్లీ సమావేశాల్లో విపక్ష నేత వైఎస్ జగన్ ఆరోపించారు. నిధుల కేటాయింపులో రాజకీయం జరుగుతోందని, వీటిపై తగిన విచారణ జరపాలన్నారు. ఈ దశలో ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు మాట్లాడుతూ, ఎవరు అడిగినా ఈ నిధులు కేటాయిస్తున్నామని, ఇందులో వివక్ష లేదన్నారు.

03/30/2016 - 12:03

విజయవాడ: తెలుగురాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ బుధవారం ఉదయం ఇక్కడి ఇంద్రకీలాద్రిపై కనకదుర్గ అమ్మవారిని సందర్శించుకుని పూజలు చేశారు. అర్చకులు, దేవస్థానం అధికారులు ఆయనకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. ఈరోజు విజయవాడలో జరిగే డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం స్నాతకోత్సవం సందర్నంగా గవర్నర్ వచ్చారు.

03/30/2016 - 05:03

హైదరాబాద్, మార్చి 29: రాజధాని అమరావతి నిర్మాణం కోసం పంచాయతీరాజ్ చాంబర్ ప్రతినిధులు ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబునాయుడుకు ఏడు కోట్ల 77 లక్షల 10వేల రూపాయలను విరాళంగా అందజేశారు. మంగళవారం నాడు శాసనసభ సిఎం కార్యాలయంలో చంద్రబాబును పంచాయతీరాజ్ మంత్రి అయ్యన్నపాత్రుడు నేతృత్వంలో పంచాయతీరాజ్ చాంబర్ ప్రతినిధులు కలిసి ఈ విరాళాన్ని అందించారు.

03/30/2016 - 04:55

హైదరాబాద్, మార్చి 29: ఆంధ్రప్రదేశ్‌లో ముస్లిం మైనార్టీల సంక్షేమానికి తెలుగుదేశం పార్టీ అధిక ప్రాధాన్యత ఇచ్చిందని ఐటి, మైనార్టీ శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి అన్నారు. 2015-16 బడ్జెట్‌లో ముస్లిం మైనార్టీల కోసం రూ.376 కోట్లు కేటాయిస్తే రూ.362 కోట్లు ఖర్చు చేశామని చెప్పారు. మంగళవారం శాసనసభలో మైనార్టీల సంక్షేమ పద్దుపై జరిగిన చర్చలో ప్రతిపక్ష సభ్యులు అడిగిన అంశాలకు మంత్రి పల్లె వివరణ ఇచ్చారు.

03/30/2016 - 04:54

హైదరాబాద్, మార్చి 29: వివిధ ప్రభుత్వ శాఖల కింద 2016-17 సంవత్సరానికి గాను గ్రాంట్ల కోసం అభ్యర్థిస్తూ మంత్రులు చేసిన ప్రతిపాదనలకు శాసనసభ ఆమోదముద్ర వేసింది. మంగళవారం శాసనసభలో ముఖ్యమంత్రి, మంత్రులు ప్రతిపాదించిన మేరకు 2016-17 సంవత్సరానికి ఆయా శాఖలకు అవసరమైన మొత్తాన్ని మంజూరు చేస్తున్నట్లు శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాదరావు సభలో వెల్లడించారు. అనంతరం సభ ఆమోదానికి తెలియజేయడంతో అంతా ఆమోదించారు.

03/30/2016 - 04:50

హైదరాబాద్, మార్చి 29: తమ పార్టీ ఎమ్మెల్యేలను రకరకాల ప్రలోభాలకు గురి చేసి టిడిపిలో చేర్చుకుంటున్నారని ప్రతిపక్షనేత, వైకాపా అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి విమర్శించారు. అసెంబ్లీ ముగిసిన తర్వాత ఆయన విలేఖర్లతో ముచ్చటిస్తూ ఎన్నికలను ఎదుర్కొనే ధైర్యం చంద్రబాబుకు లేదన్నారు. నాయకుడంటే విశ్వసనీయత, నిబద్ధత ఉండాలన్నారు. ఈ రెండూ ముఖ్యమంత్రి చంద్రబాబుకు లేవన్నారు.

Pages