S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

01/04/2017 - 00:42

అమరావతి, జనవరి 3: ఈ నెల 27-28 తేదీల్లో కనె్ఫడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సిఐఐ) ఆధ్వర్యంలో వరుసగా రెండో ఏట పారిశ్రామిక భాగస్వామ్య సదస్సు విశాఖపట్నంలో జరగనుంది. ప్రపంచ ఆర్థిక సుస్థిరతలో భాగస్వామ్యమయ్యేలా దీన్ని నిర్వహిద్దామని సిఎంఓ, ఇంధన, సిఆర్‌డిఎ, వౌలిక, పెట్టుబడులు, పర్యాటక, చేనేత-జౌళి, ఆహార తయారీ శాఖల అధికారులను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు.

01/03/2017 - 00:28

విశాఖపట్నం, జనవరి 2: ఈ సంవత్సరంలో నాలుగు వేల మెట్రిక్ టన్నుల కాఫీ గింజలను (పంట) దేశీయ మార్కెట్‌లో విక్రయించాలని గిరిజన సహకార సంస్థ (జిసిసి) లక్ష్యంగా పెట్టుకుంది. ఐటిడిఎ, జిసిసి ఆధ్వర్యంలో పదేళ్ళ సంయుక్త ప్రాజెక్టు కింద అరకు కాఫీ వ్యాపార లక్ష్యాలను మరింతగా పెంచాలని సంస్థ నిర్ణయించింది. నిరుడు (2016) తొలిసారిగా రెండు వేల మెట్రిక్ టన్నుల కాఫీ పంటని అందుబాటులోకి తీసుకురాగలిగింది.

01/03/2017 - 00:25

బీజింగ్, జనవరి 2: చైనా కరెన్సీ యువాన్ విలువ 2016 సంవత్సరంలో 7 శాతం పడిపోయింది. 1994 నుంచి గమనిస్తే ఈ స్థాయిలో డ్రాగన్ కరెన్సీ విలువ పడిపోవడం ఇదే తొలిసారి. కాగా, యువాన్ విలువ కొలమానానికి మరో 11 కరెన్సీలను చైనా చేర్చుకోగా, ఇప్పటికే ఉన్న 13 కరెన్సీలతోపాటు ఈ 11 కరెన్సీలతో యువాన్ విలువను లెక్కించనున్నారు. మరోవైపు దేశంలోని విదేశీ మారకద్రవ్య నిల్వల్లో అమెరికా డాలర్ల వాటాను చైనా తగ్గించుకుంది.

01/03/2017 - 00:25

న్యూఢిల్లీ, జనవరి 2: నల్లధనం, నకిలీ కరెన్సీల నిర్మూలన కోసం తీసుకున్న పాత పెద్ద నోట్ల రద్దు నిర్ణయం కీలక రంగాల వృద్ధిరేటును దెబ్బతీసింది. పారిశ్రామిక రంగ ఉత్పాదక రేటు నవంబర్‌లో క్షీణించింది. 4.9 శాతం వృద్ధిరేటుకే పరిమితమైంది. అంతకుముందు నెల అక్టోబర్‌లో ఇది 6.6 శాతంగా ఉంది.

01/03/2017 - 00:24

ముంబయి, జనవరి 2: దేశీయ స్టాక్ మార్కెట్లు కొత్త సంవత్సరానికి నష్టాలతో స్వాగతం పలికాయి. సోమవారం బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ 31.01 పాయింట్లు కోల్పోయి 26,595.45 వద్ద ముగియగా, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ 6.30 పాయింట్లు దిగజారి 8,179.50 వద్ద నిలిచింది. ఉదయం ఆరంభం నుంచి నష్టాల్లోనే కదలాడిన సూచీలు.. చివరిదాకా అదే దారిలో పయనించాయి.

01/03/2017 - 00:32

విజయవాడ, జనవరి 2: రాష్ట్ర విభజన తర్వాత అంతర్జాతీయ విమానాశ్రయంగా రూపుదిద్దుకోబోతున్న గన్నవరం విమానాశ్రయానికి ముందెన్నడూ ఊహించని రీతిలో మహర్దశ పట్టబోతోంది. ఇటీవలి కాలంలో తరచూ గన్నవరం విమానాశ్రయానికి వచ్చి వెళుతున్న కేంద్ర మంత్రి ఎం వెంకయ్య నాయుడుకు ఈ విమానాశ్రయంపై మొదటి నుంచి తీవ్ర అసంతృప్తి ఉంది. ఇది నెల్లూరులోని కూనాలమ్మ బస్టేషన్‌లా ఉందంటూ ఆయన ఎన్నోమార్లు బాహాటంగానే విమర్శిస్తూ వచ్చారు.

01/03/2017 - 00:20

న్యూఢిల్లీ, జనవరి 2: ప్రభుత్వ, ప్రైవేట్‌రంగ బ్యాంకులు రుణాలపై వడ్డీరేట్లను తగ్గిస్తున్నాయి.

01/02/2017 - 00:27

న్యూఢిల్లీ, జనవరి 1: దేశ, విదేశీ పరిణామాలు, ఆర్థిక గణాంకాలు ఈ వారం భారతీయ స్టాక్ మార్కెట్లను ప్రభావితం చేయవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. జాతీయంగా నిక్కీ తయారీ పిఎమ్‌ఐ, సేవల పిఎమ్‌ఐ గణాంకాలు, అంతర్జా తీయంగా అమెరికా ఉద్యోగ గణాంకాలు, ఎఫ్‌ఒఎ మ్‌సి సమావేశం కీలకమని పేర్కొన్నారు. డిసెంబర్ నెల ఆటోరంగ అమ్మకాలూ ముఖ్యమేనన్నారు.

01/02/2017 - 00:25

న్యూఢిల్లీ, జనవరి 1: యోగా గురువు రామ్‌దేవ్ బాబా నేతృత్వంలోని పతంజలి ఆయుర్వేద్.. దేశీయ ఎఫ్‌ఎమ్‌సిజి రంగంలో దూసుకెళ్తోంది. ఇన్నాళ్లూ ఈ రంగాన్ని శాసించిన ఐటిసి, డాబర్, హిందుస్థాన్ యునిలివర్, కాల్గేట్ పామోలివ్, పిఅండ్‌జి వంటి దిగ్గజ సంస్థలే పతంజలి ముందు చిన్నబోతున్నాయని ఓ నివేదిక చెబుతోంది.

01/02/2017 - 00:25

హైదరాబాద్, జనవరి 1: పరిశ్రమలకు భూముల కేటాయింపుల్లో ఎస్సీ, ఎస్టీలకు తెలంగాణ ప్రభుత్వం ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుందని తెలంగాణ పారిశ్రామిక, వౌలిక సదుపాయాల సంస్థ చైర్మన్ గ్యాదరి బాలమల్లు అన్నారు. ఇందులో భాగంగా టిఎస్‌ఐఐసి రిజర్వేషన్ల ప్రక్రియను పక్కాగా అమలు చేస్తోందన్నారు. ఎస్సీలకు 16 శాతం, ఎస్టీలకు 6 శాతం, మహిళలకు 10 శాతం భూములను కేటాయిస్తామన్నారు.

Pages