S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

11/28/2016 - 04:51

హైదరాబాద్, నవంబర్ 27: ఎగుమతి విధానాలు, డాక్యుమెంటేషన్‌ను మరింత సులువు చేస్తూ కేంద్రం నోటిఫికేషన్ జారీ చేసిందని, విదేశీ వాణిజ్య విధానంలో గణనీయ మార్పులు రావాల్సిన అవసరం ఉందని ఐఐఎఫ్‌టి (ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్) డీన్ డాక్టర్ ఎకె సేన్ గుప్తా అన్నారు.

11/28/2016 - 08:18

న్యూఢిల్లీ, నవంబర్ 27: భారతీయ మార్కెట్ల నుంచి విదేశీ మదుపరుల పెట్టుబడుల ఉపసంహణ కొనసాగుతోంది. పాత పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో ఈ నెలలో ఇప్పటిదాకా దాదాపు 5 బిలియన్ డాలర్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఎన్నిక, తదనంతర పరిణామాల ప్రభావం కూడా భారత్‌సహా ప్రపంచ స్టాక్ మార్కెట్లపై కనిపిస్తోంది.

11/27/2016 - 07:52

న్యూఢిల్లీ, నవంబర్ 26: వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి) అమలుతో రాష్ట్రాలు కోల్పోయే ఆదాయానికిగాను కేంద్రం మూడు నెలలకోసారి నష్టపరిహారం ఇవ్వనుంది. జిఎస్‌టి అమలైన తొలి ఐదేళ్లలో లగ్జరీ ఉత్పత్తులు, పొగాకు తదితర ఉత్పత్తులపై ‘జిఎస్‌టి నష్టపరిహార సెస్సు’ పేరిట లెవీని రాష్ట్రాలకు ప్రతి త్రైమాసికానికి కేంద్రం ఇస్తుంది.

11/27/2016 - 07:51

న్యూఢిల్లీ, నవంబర్ 26: దేశీయ ప్రైవేట్‌రంగ టెలికామ్ దిగ్గజం భారతీ ఎయిర్‌టెల్.. నైజీరియాలోని తమ అనుబంధ సంస్థలో ఎకోనెట్ వైర్‌లెస్‌కున్న వాటాను కొనుగోలు చేసింది. ఎయిర్‌టెల్ నైజీరియాలో ఎకోనెట్ వైర్‌లెస్ లిమిటెడ్‌కు 4.2 శాతం వాటా ఉంది. ఈ మొత్తం వాటాను భారతీ ఎయిర్‌టెల్ ఇంటర్నేషనల్ (నెదర్లాండ్స్) బివి ద్వారా కొనుగోలు చేసినట్లు శనివారం భారతీ ఎయిర్‌టెల్ తెలిపింది.

11/27/2016 - 07:50

న్యూఢిల్లీ, నవంబర్ 26: పాత 500, 1,000 రూపాయల నోట్లను మొబైల్ ఫోన్ల కొనుగోలుకు అనుమతించాలని కేంద్ర ప్రభుత్వానికి ఇండియన్ సెల్యులార్ అసోసియేషన్ (ఐసిఎ) విజ్ఞప్తి చేసింది. ఈ నోట్ల రద్దు నిర్ణయంతో మొబైల్ ఫోన్ల అమ్మకాలు 50 శాతం పడిపోయాయని తెలిపింది. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీకి ఈ మేరకు ఐసిఎ ఓ లేఖను రాసింది.

11/27/2016 - 07:49

తిరుపతి, నవంబర్ 26: నల్లధనాన్ని వెలికి తీసి దేశంలోని పేద ప్రజలకు మేలు చేయాలన్న సత్సంకల్పంతో పెద్ద నోట్లు రద్దుచేస్తూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తీసుకున్న నిర్ణయాన్ని సామాన్య ప్రజలు స్వాగతిస్తున్నారని, అయితే విపక్షాలు స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం రాద్ధాంతం చేస్తున్నాయని కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు.

11/27/2016 - 07:49

న్యూఢిల్లీ, నవంబర్ 26: అత్యంత కీలక ఆర్థిక సంస్కరణల్లో పాత పెద్ద నోట్ల రద్దు నిర్ణయం కూడా ఒకటి అని ప్రముఖ పారిశ్రామికవేత్త, టాటా సన్స్ తాత్కాలిక చైర్మన్ రతన్ టాటా అన్నారు. అయితే నోట్ల రద్దు నేపథ్యంలో సామాన్యులు ఎదుర్కొంటున్న ఇబ్బందుల దృష్ట్యా కొన్ని ప్రత్యేక చర్యలు చేపట్టాల్సి ఉందని అభిప్రాయపడ్డ రతన్ టాటా.. నల్లధనంపై పోరుకు నోట్ల రద్దు దోహదపడుతుందన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.

11/27/2016 - 07:48

విజయవాడ, నవంబర్ 26: రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న ప్రజా సాధికారత సర్వే.. కుటుంబాలకు సంబంధించిన డేటా సర్వే మాత్రమే కాదని ఇదొక డైనమిక్ సర్వే అని సిఎం సంయుక్త కార్యదర్శి పిఎస్ ప్రద్యుమ్న అన్నారు. ప్రజాసాధికారత సర్వే 2016ను రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆలోచనలకు అనుగుణంగా చేస్తున్నామని, ఇది నిరంతర ప్రక్రియ అని ఆయన తెలిపారు.

11/26/2016 - 05:09

న్యూఢిల్లీ, నవంబర్ 25: టాటా సన్స్ సంస్థ మాజీ అధినేత సైరస్ మిస్ర్తిని టాటా స్టీల్స్ సంస్థ శుక్రవారం తమ బోర్డు చైర్మన్ పదవి నుంచి తొలగించింది. టాటా స్టీల్స్ డైరెక్టర్ల బోర్డు శుక్రవారం ముంబయిలో సమావేశమై చైర్మన్ పదవి నుంచి మిస్ర్తికి ఉద్వాసన పలికింది.

11/26/2016 - 05:06

కర్నూలు, నవంబర్ 25: రానున్న ఏడాది కాలంలో ప్రస్తుతం ఉన్న ఎటిఎంల స్థానంలో సిడిఎం (క్యాష్ డిపాజిట్ మిషన్)ల ఏర్పాటుకు ప్రాధాన్యనివ్వనున్నట్లు బ్యాంకర్ల ద్వారా తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న ఎటిఎంలలో చాలా వరకూ సాంకేతిక ఇబ్బందులు ఉన్నాయని వాటిని మార్చి కొత్తవి ఏర్పాటు చేయాలన్న ఆలోచనకు స్వస్తిపలికి మరమ్మతులతో కొనసాగించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.

Pages