S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

01/09/2016 - 05:01

రాజమహేంద్రవరం, జనవరి 8: పర్యావరణ అనుమతులు పొంది ప్రస్తుతం నడుస్తున్న రీచ్‌ల్లో తవ్వగా మిగిలిన ఇసుకకే వేలం నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తోంది. రాష్ట్రంలో ఇసుక రీచ్‌లను మహిళా పొదుపు సంఘాల పర్యవేక్షణలో నడిపించాలన్న నిర్ణయంలో భాగంగా పర్యావరణ అనుమతులు పొందిన రీచ్‌ల్లో తవ్వకాలు జరుగుతున్న సంగతి విదితమే.

01/08/2016 - 08:04

న్యూఢిల్లీ, జనవరి 7: అంతర్జాతీయ ఐటి దిగ్గజ సంస్థల్లో ఒకటైన మైక్రోసాఫ్ట్ ఎట్టకేలకు తన ‘సర్ఫేస్’ శ్రేణి ట్యాబ్లెట్లను భారత మార్కెట్‌కు తీసుకొచ్చింది. వీటిలో అత్యాధునిక వెర్షన్ అయిన ‘సర్ఫేస్ ప్రో-4’ ట్యాబ్లెట్ ధర రూ.89,990 నుంచి ప్రారంభమవుతుంది.

01/08/2016 - 08:01

వాషింగ్టన్, జనవరి 7: ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత్ మున్ముందు కూడా మెరుగైన స్థానంలోనే కొనసాగుతుందని ప్రపంచ బ్యాంకు స్పష్టం చేసింది. వచ్చే (2016-17) ఆర్థిక సంవత్సరంలో భారత ఆర్థిక వ్యవస్థ చైనా కంటే ఒక పర్సెంటేజీ పాయింట్ అధికంగా 7.8 శాతం వృద్ధి సాధిస్తుందని అంచనా వేస్తున్నట్లు ప్రపంచ ఆర్థిక స్థితిగతులపై తాజాగా విడుదల చేసిన నివేదికలో ప్రపంచ బ్యాంకు పేర్కొంది.

01/08/2016 - 08:01

ముంబయి, జనవరి 7: ఆర్థిక వృద్ధి మందగమనాన్ని తట్టుకోవడం కోసం చైనా తన కరెన్సీ యువాన్ వేగంగా పడిపోవడానికి అనుమతించడంతో అంతర్జాతీయ స్టాక్, కరెన్సీ మార్కెట్లన్నీ అమ్మకాల ఓత్తిడితో కొట్టుమిట్టాడడంతో దేశీయ స్టాక్ మార్కెట్లు కూడా గురువారం భారీగా పతనమైనాయి.

01/08/2016 - 08:00

న్యూఢిల్లీ, జనవరి 7: సాఫ్ట్‌వేర్ ఉత్పత్తులపై ద్వంద్వ పన్నుల విధానంనుంచి ఊరట కల్పించాలని, అంతర్జాతీయ మార్కెట్‌లో చేపడుతున్న రక్షణాత్మక చర్యల కారణంగా తమకుకూడా రక్షణ కల్పించాలని భారతీయ ఐటి పరిశ్రమ ప్రభుత్వాన్ని కోరింది. ‘సాఫ్ట్‌వేర్ ఉత్పత్తులపై ద్వంద్వ పన్నుల విధింపుపై మా భయాలను ప్రభుత్వానికి తెలియజేసాం.

01/08/2016 - 07:58

గుంటూరు, జనవరి 7: రాజధాని అమరావతిలో నివసిస్తున్న ప్రజల అభిమతానికి అనుగుణంగానే ప్రభుత్వం ముందుకు వెళుతుందని గుంటూరు పార్లమెంట్ సభ్యుడు గల్లా జయదేవ్ పేర్కొన్నారు. గుంటూరు ఎంపి గల్లా జయదేవ్ ఆంధ్రభూమి ప్రతినిధికి ప్రత్యేకంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో రాజధానికి సంబంధించిన వివరాలు వెల్లడించారు.

01/08/2016 - 07:57

రాజమహేంద్రవరం, జనవరి 7: రాష్ట్రంలో పర్యాటకరంగాన్ని ప్రోత్సహించడానికి ఆరు హబ్‌లను అభివృద్ధి చేయనున్నట్లు పర్యాటక శాఖ ముఖ్యకార్యదర్శి నీరబ్‌కుమార్ ప్రసాద్ వెల్లడించారు. స్థానిక పరిస్థితులు, ఇతర అంశాల ఆధారంగా ఎకో, ఆధ్యాత్మిక, బీచ్, బ్యాక్‌వాటర్ పర్యాటకాల అభివృద్ధికి చర్యలు తీసుకుంటామన్నారు.

01/08/2016 - 07:57

న్యూఢిల్లీ, జనవరి 7: అతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు పెరగడంతో పాటుగా దేశీయ అభరణాల తయారీదారులనుంచి డిమాండ్ పెరగడంతో దేశీయ మార్కెట్లో గురువారం ఒక్క రోజే 430 రూపాయలు పెరిగి తిరిగి 26 వేల రూపాయల స్థాయికి చేరుకుంది. ఈ ఏడాది బంగారం ధర ఒక్క రోజులో ఇంతగా పెరగడం ఇదే మొదటిసారి. దీంతో పదిగ్రాముల మేలిమి బంగారం ధర ఢిల్లీ బులియన్ మార్కెట్లో రూ. 26,330 రూపాయలకు చేరుకుంది.

01/08/2016 - 07:56

విశాఖపట్నం, జనవరి 7: విశాఖలో ఈ నెల 10వ తేదీ నుంచి మూడు రోజులపాటు సిఐఐ ఆధ్వర్యంలో జరగనున్న అంతర్జాతీయ భాగస్వామ్య సదస్సుకు ఏర్పాట్లు చివరి దశకు చేరుకున్నాయి. ఈ సదస్సు ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ యువరాజ్, నగర పోలీస్ కమిషనర్ అమిత్ గార్గ్ తదితర ఉన్నతాధికారులు గురువారం పరిశీలించారు. ఈ సదస్సుకు అతిరథ, మహారథులు హాజరవుతున్నారు.

01/08/2016 - 07:55

న్యూఢిల్లీ, జనవరి 7: మదుపరుల ప్రయోజనాలను పరిరక్షించడం కోసం లిక్విడిటీ బాగా లేని (ఇల్‌లిక్విడ్)) 386 కంపెనీల స్టాక్స్‌లో ట్రేడింగ్ జరిపేటప్పుడు మరింత జాగ్రత్తలు తీసుకోవాలని ప్రధాన స్టాక్ ఎక్స్‌చేంజిలయిన బిఎస్‌ఇ, ఎన్‌ఎస్‌ఇలు తమ సభ్యులకు సలహా ఇచ్చాయి. పరిమిత ట్రేడింగ్ ఉన్న కారణంగా సులభంగా విక్రయించడానికి వీలు లేని స్టాక్స్‌ను ఇల్‌లిక్లిడ్ స్టాక్స్‌గా పిలుస్తారు.

Pages