S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

04/01/2016 - 03:45

కాన్‌బెర్రా, మార్చి 31: భారత దేశ స్థూల జాతీయోత్పత్తి (జిడిపి) వృద్ధిరేటు 2015-16 ఆర్థిక సంవత్సరంలో 7.6 శాతంగా ఉంటుందని అంచనా వేస్తున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ గురువారం తెలిపారు. అయితే దేశ సామర్ధ్యం కంటే ఇది ‘ఎంతో తక్కువ’ అని ఆయన పేర్కొంటూ, వచ్చే (2016-17) ఆర్థిక సంవత్సరంలో ఈ సంఖ్యలు మరింత మెరుగ్గా ఉండగలవన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.

04/01/2016 - 03:44

హైదరాబాద్, మార్చి 31: అనంతపురం జిల్లా వజ్రకరూర్ మండలంలోని చినహోతూరు గ్రామంలో 2.1 మెగావాట్ల పవన విద్యుత్‌ను ఉత్పత్తిచేసే ప్రాజెక్టును ప్రారంభించినట్లు హెరిటేజ్ ఫుడ్స్ తెలిపింది. ఏడాదికి 5 మిలియన్ యూనిట్లను ఉత్పాదక శక్తి కలిగి ఉంటుందని వెల్లడించింది. ఈ విద్యుత్‌ను గోకుల్ డెయిరీ ప్లాంట్‌కు, చిత్తూరు డైరీ ప్లాంట్‌కు వినియోగిస్తామని హెరిటేజ్ సంస్థ తెలిపింది.

04/01/2016 - 03:43

హైదరాబాద్, మార్చి 31: సింగరేణి కాలరీస్ సంస్ధ నిజంగా బంగారమే. తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ రంగ సంస్ధల్లో సింగరేణి సంస్ధ 2014-15 సంవత్సరానికి రూ. 491.90 కోట్ల లాభాలను ఆర్జించింది. ఈ విషయాన్ని కాగ్ గుర్తించి ప్రశంసించింది. నిజంగా ఇది తెలంగాణకు గర్వకారణం. రాష్ట్రంలో 11 పిఎస్‌యులు పనిచేస్తున్నాయి. ఇవన్నీ కలిపి రూ. 351. 62 కోట్ల నికర నష్టాలను చూశాయి. విభజన దశలో ఉన్న 33పిఎస్‌యులు రూ.

04/01/2016 - 03:42

న్యూఢిల్లీ, మార్చి 31: పిపిఎఫ్, కిసాన్ వికాస్ పత్ర లాంటి చిన్న మొత్తాల పొదుపు పథకాలు, సీనియర్ సిటిజన్ల డిపాజిట్లపై 1.3 శాతం దాకా వడ్డీ రేటు తగ్గింపు శుక్రవారంనుంచి అమలులోకి రానుంది. ఏప్రిల్ 1నుంచి జూన్ 30 వరకు త్రైమాసికానికి పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పిపిఎఫ్)పై వడ్డీ రేటు 8.1 శాతంగా ఉంటుంది. ఇంతకు ముందు ఈ వడ్డీ రేటు 8.7 శాతంగా ఉండింది.

04/01/2016 - 03:39

హైదరాబాద్, మార్చి 31: ఆంధ్రప్రదేశ్‌లో విభజితమైన, విభజన దశలో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థల్లో చాలావరకు నష్టాల్లోకొనసాగుతున్నాయి. 2014-15 ఆర్థిక సంవత్సరానికి కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) నిర్వహించిన తనిఖీల్లో ప్రభుత్వ రంగసంస్థల డొల్లతనం బయటపడింది. 2015 మార్చి 31 నాటికి ఆంధ్రప్రదేశ్‌లో 70 ప్రభుత్వ రంగ సంస్థలు ఆడిట్ పరిధిలో ఉన్నాయి.

04/01/2016 - 03:38

గాజువాక, మార్చి 31: విశాఖ ఉక్కు భవిష్యత్ ప్రణాళికలను విజయవంతంగా అమలుపరుస్తూ కర్మాగారాన్ని ముందుకు తీసుకువెళ్లడం అభినందనీయమని కేంద్ర ఉక్కు మంత్రత్వశాఖ కార్యదర్శి అరుణా సుందర్‌రాజన్ కొనియాడారు. విశాఖకు గురువారం వచ్చిన ఆమె కర్మాగారంలోని పలు విభాగాలను సందర్శించారు. ఎస్‌ఎంఎస్-1లో గల కన్వర్టర్‌ను పునః ప్రారంభించారు.

03/31/2016 - 04:28

సిడ్నీ, మార్చి 30: ఆస్ట్రేలియా పర్యటన అజెండాలో అదానీ కోల్ ప్రాజెక్టు లేదని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ స్పష్టం చేశారు. ఈ పర్యటన సందర్భంగా ఆస్ట్రేలియా నాయకులతో జరిపే సమావేశాల్లో అదానీకి చెందిన 16.5 బిలియన్ డాలర్ల కోల్ మైన్ ప్రాజెక్టు ప్రస్తావన వస్తుందని, దానికి నిధులను సమీకరించేలా చర్చలు జరుపుతారన్న వార్తలను ఆయన బుధవారం ఇక్కడ ఖండించారు.

03/31/2016 - 04:28

న్యూఢిల్లీ, మార్చి 30: భారతీయ కుబేరులు దేశం విడిచి వెళ్లిపోతున్నారు. విదేశాలకు మకాం మారుస్తున్నారు. గత ఏడాది ఏకంగా 4,000 మంది మిలియనీర్లు వివిధ దేశాలకు వెళ్లి స్థిరపడ్డారు మరి. ఈ విషయంలో ప్రపంచవ్యాప్తంగా భారత్ నాలుగో స్థానంలో ఉండటం గమనార్హం. న్యూ వరల్డ్ వెల్త్ విడుదల చేసిన నివేదిక ప్రకారం 2015లో దాదాపు 4,000 మంది సంపన్నులు భారత్‌ను వీడారు. కాగా, ఫ్రాన్స్‌లో ఈ విషయంలో మొదటి స్థానంలో ఉంది.

03/31/2016 - 04:27

ముంబయి, మార్చి 30: గత రెండు రోజుల నష్టాలకు బ్రేక్ వేసి దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం భారీ లాభాల్లో ముగిశాయి. వడ్డీరేట్ల పెంపు విషయంలో అమెరికా ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ అవలంభించిన వేచిచూత ధోరణి మార్కెట్ సెంటిమెంట్‌ను ఒక్కసారిగా పెంచింది.

03/31/2016 - 04:27

న్యూఢిల్లీ, మార్చి 30: తెలంగాణ రాష్ట్రంలో ఎల్‌పిజి, సిఎన్‌జి తదితర పెట్రోలియం ఉత్పత్తుల లభ్యతను చమురు మంత్రిత్వ శాఖ మెరుగుపరుస్తుందని చమురు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ హామీనిచ్చారు. ‘తెలంగాణలో ప్రధాన మంత్రి ఉజ్వల యోజన క్రింద ఎల్‌పిజి కనెక్షన్లను కల్పిస్తున్నాం.

Pages