S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉత్తరాయణం

03/29/2016 - 23:42

హిందువులకు ఇల్లు అద్దెకివ్వకపోవడం, స్నేహితులు వెడ్డింగ్ కార్డు యిస్తే వాటిమీద హిందూ దేవుళ్ల చిత్రం ఉంటే బయట పారేయడం, మర్యాదకైనా పండ్లు ఇస్తే ప్రసాదం కాదుకదా అనడం, వంటివి చూస్తుటే క్రైస్తవుల్లో అసహనం ప్రస్ఫుటమవుతోంది. మరి క్రైస్తవ సాహిత్యాన్ని బస్సు ప్రయాణికులకు, రైతుల బజారులోని రైతులకు పంచిపెట్టడం ఒప్పా?

03/29/2016 - 01:51

కాదు కాదు! కాల్పనికత-
కనిపించే వాస్తవికత-
భారతీయ సోదరా! బహుపరాక్! బహుపరాక్!-
వాస్తవికతను గుర్తించు-
వివేకంతో ప్రవర్తించు!-
శరీరంలో పైత్యతత్వం ప్రకోపిస్తే-
పిచ్చితనం తలకెక్కుతుంది-
ఉచ్ఛనీచాలు మరచిపోతాడు-
పిచ్చివాగుడు పెచ్చరిల్లి-
నడివీధిలో నగ్నంగా తిరుగుతాడు-
కనిపించిన వారి నెల్లా రక్కుతాడు-
విషాన్ని కక్కుతాడు-

03/28/2016 - 01:56

జెఎన్‌యుకు కాదేదీ అనర్హం. నిరోధ్‌లు, డ్రగ్‌లు, దేశద్రోహులకు జిందాబాద్‌లు. పేరు సబర్మతీ దాభా. హాస్టల్ గోడలపై ఉగ్రవాది అఫ్జల్ గురుకు మద్దతుగా పోస్టర్లు ప్రత్యక్షం. గంగా దాభా వేదికగా కన్హయ్య కుమార్ జాతివ్యతిరేక ప్రసంగం. మొన్నటికి మొన్న ఓ ప్రొఫెసర్ మణిపూర్‌ను చైనాలో విలీనం చేయమని ప్రసంగం.

03/26/2016 - 00:26

కులం కోసం పోరాడే రాజకీయ వేత్తలను, ప్రజలు సమాజం నుండే కాక, రాజకీయాలనుంచి కూడా వెలివేయాలి. తమ కులానికే ప్రభుత్వ ఫలాలు అందాలని కోరడం నీచాతినీచమైన సంస్కృతి. మిగతా కులాలను పట్టించుకోకుండా కేవలం తమ కులమే బాగుపడాలని కోరేవాళ్లు అత్యంత స్వార్థపరులు. మిగతా కులాల బాగోగులు వీరికి పట్టవు. బీదలు అన్నికులాల్లో ఉన్నారు. రిజర్వేషన్లు ఇవ్వదలిస్తే అన్ని కులాల్లోని పేదలకు ఇవ్వండి.

03/24/2016 - 23:49

విశాఖలో పర్యాటకులను విపరీతంగా ఆకర్షించే రామకృష్ణాబీచ్, ముడసర్లోవ రిజర్వాయర్, ఋషికొండ, భీమిలి బీచ్‌లు రాత్రి పది గంటల తర్వాత నిఘా కొరవడిన కారణంగా అసాంఘిక కార్యకలాపాలకు నిలయంగా మారుతున్నాయి. మందు త్రాగడం, చిందులు వేయడం, వ్యభిచారం వంటి కార్యక్రమాలు నిర్విఘ్నంగా సాగుతున్నా యి. ఇక వివిధ పార్కులు ప్రేమపక్షుల విహారాలకు కేంద్రంగా మారాయి.

03/24/2016 - 07:32

ఇటీవల ఎంఐఎం నేత ఒవైసీ మెడపై కత్తిపెట్టినా భారత్‌మాతాకీ జై అనను అని వ్యాఖ్యానించడం కడు విచారకరం. ఆయన మెడపై కత్తిపెట్టి ఆ మాటలు అనమని చెప్పేవారు ఎవ్వరూ ఇక్కడ లేరని ఒవైసీ గుర్తించడం మంచిది. ముందుగా ఆయన భారతీయ పౌరుడా లేక మరే ఇతర దేశ పౌరుడా వ్యాఖ్యానించాలి. ఈ దేశంలో లౌకిక వాదం ఉన్నంతకాలం ఇటువంటి ప్రకటనలనకు స్వేచ్ఛ ఉంటుందని ఆయన మననం చేసుకోవాలి.

03/23/2016 - 00:19

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగారు ఉద్యోగస్తులకు, పెన్షనుదారులకు ఐదారు నెలలక్రితమే హెల్త్‌కార్డులు ఇచ్చినప్పటికీ వానికి ఇంతవరకూ మోక్షానికి నోచుకోలేదు. ఇంతవరకు ఏ ఆసుపత్రికి వెళ్లినా ఆ కార్డులకు విలువ ఇవ్వడంలేదు. ప్రభుత్వ పరిపాలనకు విలువలేనపుడు సా మాన్యుని గతేమిటి?

03/22/2016 - 00:27

పింగళి వెంకయ్య గొప్ప దేశభక్తుడు, జాతీయ జెం డాను రూపొందించినవాడు. స్వాతంత్య్ర సమరంలో ఆయన నిర్వహించిన విశిష్ట పాత్ర, జవహర్‌లాల్‌నెహ్రూ, సర్దార్ పటేల్, మహాత్మాగాంధీల ప్రశంసలందుకుంది. ఆయన జగద్గురు శంకరాచార్య భక్తుడు కూడ. ఆయన తన జీవితంలో ‘మానవ సేవయే మాధవ సేవ’ అనే నినాదాన్ని తూచ తప్పకుండా పాటించినవాడాయన. అంత చేసి ఆయన పేదరికంలోనే మరణించారు.

03/21/2016 - 01:04

ఈనెల 12న ప్రచురితమైన ‘ఉన్నమాట’లో ప్రతి మాట వాస్తవాల మూటే. ఇతర మతాలవారిని ఏ స్వల్ప కారణం గా నైనా నిందారోపణ చేస్తే అది నిప్పుకణమై దేశానే్న దహించే ప్రయత్నం చేస్తుంది. దానికి ఇతర మతాలవారు దన్నుగా నిలుస్తారు. కాని పెద్ద దురదృష్టమేమంటే హిందూమతమే హిందువులతో సహా అందరకూ లోకు వైపోయంది. ఈ హిందూ అనైక్యతే దేశాన్ని విచ్ఛిన్నం చేసి పరపాలనపాలు చేసిందని చరిత్ర చాటి చెబుతోంది.

03/18/2016 - 23:45

ఆనాడు తిరుమలశెట్టి శ్రీరాములు, అద్దంకి మన్నార్, జీడిగుంట రామచంద్ర, పన్యాల రంగనాథంగార్లు ఆకాశవాణి ద్వారా వార్తలను చదువుతుంటే శ్రోతలకు వీనులవిందుగా ఉండేది. వీరి కంఠం మృదు మధురంగా ఉండేది. కాని ఈనాడు వార్తలు చదువుతుంటే అపశ్రుతులు, కొన్ని అక్షరాలు పలుకక పోవడం అర్ధరహితముగా ఉండటం ఎంతో విచారకరం!
- కోవూరు వెంకటేశ్వరప్రసాదరావు, కందుకూరు
చారిత్రక కట్టడాన్ని కాపాడాలి

Pages