S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెయిన్ ఫీచర్

04/02/2019 - 18:34

తాను సంరక్షింపవలసినవారు కుటుంబమున దనకెవ్వరును లేకున్నను ఏ మనుమనియందోగల మమకారముచే నరుడు కాశికి వెడలజాలకున్నాడు. ‘‘నేను లేని పక్షమున మా హరి ఏమైపోవునో’’ అను చింతయే వానిని సంసారబద్ధుని జేసివేయుచున్నది. వెదురుమావు యొక్క ద్వారములు తెఱచియేయున్నను అందలిచేపలు పైకి పోజాలకుండును. గొంగళిపురుగు తానల్లుకొనిన గూటిలో తన్ను తాను బంధించుకొని నశించుచున్నది. ఇటువంటి సంసారము మిథ్య కాదా?

04/01/2019 - 19:43

ఇట్టి గ్రహణ శక్తితోడనే మానవుడు భగవంతుని దెలిసికొనగల్గును. ఈ రీతి నిర్మల ప్రజ్ఞచేతనేకాని భగవత్సాక్షాత్కారము పొందజాలము.
540. వీర్యనష్టమువలన శక్తిసామర్థ్యములు క్షీణించును. తన యెఱుక లేకయే గలుగు (స్వప్న) స్ఖలనము ఒక లెక్కలోనిది కాదు. అయ్యది ఆహార దోషముచే సంభవించును. కాని, ఉత్తమ పారమార్థికుడగు వానికి స్ర్తితో ఎట్టి సంపర్కము నుండరాదు.

03/31/2019 - 22:21

సాహితీ క్షేత్రంలో వెలువడిన కృతుల్లో రామాయణం ఆదికావ్యం. దీనిని లోకానికి అందించి పాఠకులను మదురానుభూతులను పంచి ఇచ్చిన మహర్షి వాల్మీకి. సీతారాముల వృత్తాంతాన్ని ఆధారంగా తీసుకుని లోకానికి ఆనందోపదేశం చేశారు. వాల్మీకి మానవులకు ధర్మాచరణ చేయడానికి మార్గదర్శకుడుగా నిలిచాడు.రాముని చరితాన్ని చూపి ధర్మాచరణ ఏలా చేయాలో రాముని చేత చేయించి చూపాడు. రామాయణం మానవాళికి లభించిన పరమ పవిత్ర కావ్యం.

03/29/2019 - 18:42

525. అన్నము తిని పారవేసిన ఆకువలె లోకమున మనుము. అది యొకప్పుడింటిలోనికిని మఱియొకప్పుడు పెంటమీదికిని గాలిచే నెగురగొట్టబడుచు, దానికి వశమైయుండును. దైవ వశమున నీవిప్పుడిక్కడనున్నావు. మంచిది. ఇట్లేయుండుము. ఇందుండి తీసివేసి దైవము మఱల నిన్నింతకంటె ఉత్తమస్థితిలో నుంచుననుకొనుము. అపుడును పూర్తిగా అసంగుడవై, ‘‘దైవేచ్ఛయే జరుగుగాక!’’యను నాత్మార్పణబుద్ధితో నుండుము.

03/28/2019 - 19:56

శరణాగతి
516. ‘పరమేశ్వరేచ్ఛయే జరుగుగాక’ యని నిర్మలమైన భక్తితోడను, నిష్కటపమైన విశ్వసముతోను ఎవ్వడు పరమేశ్వరునకు తన్ను తాను సమర్పించుకొనునో అట్టివాడు శీఘ్రముగా సాక్షాత్కారము బొందును.
517. సంసారమున నుండుట కాని సంసారమును త్యజించుటకాని పరమేశ్వరేచ్ఛపై నాధారపడియున్నది. కాబట్టి సర్వము ఆ పరమేశ్వరునికే సమర్పించి కర్మముల నొనర్పుము. అంతకంటె నీవు చేయగల్గినదేమి?

03/27/2019 - 20:04

సాక్షాదవతారమూర్తియగు శ్రీరామచంద్రుడు లంకలోనికి బోవుటకై సముద్రమునకు సేతువు గట్టవలసివచ్చెను. కాని యాతని భక్తుడును సేవకుడునగు హనుమంతుడు రామనామమందలి యఖండ విశ్వాసముచే ఒక్కదుముకున సాగరమున లంఘించెను. కేవల విశ్వాస మహిమచే స్వామికంటే సేవకుడే ఎట్లు ఘనతర కార్యమును జేయగల్గెనో చూడుడు.

03/26/2019 - 20:23

నిత్యమేదియో అనిత్య మేదియో వివేచన చేయుము.
503. పసిబాలుని నమ్మికను బోలు నమ్మిక లేనియెడల ఈశ్వర సాక్షాత్కారము పొందుట యసాధ్యము. ఎవనినైనను జూపి, ‘‘ఆతడు నీయన్న’’ యని తల్లి చెప్పిన యెడల బిడ్డడు ఆవనిని నిజముగా తన యన్నయని భావించును.

03/25/2019 - 19:37

సత్సాంగత్యమున నుండెనా, భగవంతుని దక్క మఱిదేనిని గూర్చియు చింతింపకుండును. మనస్సు యొక్క నైజము మన స్థితిగతుల ననుసరించి మాఱుచుండును.
492. మనస్సే సర్వము. భార్యయందలి అనురాగము ఒక విధమైనది; బిడ్డయందలి అనురాగము మఱియొక విధమైనది. నరుడిద్దఱను ముద్దిడుకొనుచున్నాడు, కాని మనోభావములు వేఱు.

03/20/2019 - 22:19

మన వేదాలు పురాణాలు ఇతిహాసాలు ముక్తకంకఠంతో తల్లియొక్క గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్పాయి. ‘నాస్తి మాతృ సమో గురుః’- మాతృమూర్తితో సమానమైన గురువు ఎవ్వరూ లేరని వక్కాణించారు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్యదేవోభవ అనే సూక్తిలో మొదటగా తల్లినే పేర్కొన్నారు. ఎందుకంటే తల్లి నుంచి బిడ్డలకు లభించే ప్రేమ, మమకారం, ఉపదేశం, ఉపకారం మరెవరినుంచీ లభించదు.

03/19/2019 - 22:31

ముల్లోకాలచేత తల్లిగా కీర్తింపబడే ఆదిపరాశక్తినే అనేక రూపాలలో, అనేక నామాలతో భక్తులు పూజిస్తారు. స్తుతిస్తారు. ఆ ఆది పరాశక్తే తపస్సులు చేసి ఆ తపఃప్రభావాన్ని దుర్వినియోగం చేస్తూ భగవంతుడు ఇచ్చిన వరప్రభావంతో విర్రవీగుతూ కన్ను మిన్ను కానక సజ్జనులను, దేవతలు భయభ్రాంతులను చేసే అజ్ఞానులైన రాక్షసులను నశింపచేస్తుంది.

Pages