S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెయిన్ ఫీచర్

03/06/2019 - 19:52

నేనతనిని మందలించినను అతడు లక్ష్యపెట్టడయ్యెను. అతడు ఇతరులకుగాన రాకుండా ఒక పెద్దమనుష్యుని భవనమున బ్రవేశించి అందొక యువతితో వ్యభిచరింప మొదలిడినాడు. దానిమూలమున తుదకు తన సిద్ధిని పూర్తిగా పోగొట్టుకొని పతితుడైపోయెను.

03/05/2019 - 22:11

ఇక సంసార భోగముల ననుభవించి, వయసు చెల్లిన తర్వాత కాషాయమును దాల్చువారు చిరకాలము ఇంద్రియ నిగ్రహ మవలంబించినను వారి పూర్వ సంస్కారములు మఱల తల యెత్తుట సంభవించుచుండును.
370. పాపప్రవృత్తులందు చరించు మనస్సును మాలపల్లెలందు వసించు కులీన బ్రాహ్మణునితో బోల్పనగును. లేదా పెద్ద నగరములలో వేశ్యలుండు తావున వసించు పెద్దమనుష్యునితో బోల్పనగును.

03/05/2019 - 22:10

అటులనే తాపత్రయ భారముచే క్రుంగిపోవువాడు సంసారమున మునిగిపోవుచుండ, అంతటి తాపత్రయమును ఉబలాటమును లేచివాడు భగవత్పాదారవిందముల నాశ్రయించి ఉన్నతినిబొందును. (చూ.413.)
363. ఇతరుల గుణావగుణములగూర్చి విమర్శించుచు కాలము గడపువాని జీవనము వ్యర్థమైపోవుచున్నది. ఏలన వాని కాలము ఆత్మచింతనమునగాని, పరమాత్మ చింతనమున గాని వినియోగపడుట లేదు, సరికదా, ఇతరుల మంచిచెడుగులను గూర్చి విమర్శించుటలో వ్యర్థమైపోవుచున్నది.

03/03/2019 - 23:57

‘‘శ్రీశైలా శిఖరేశ్వరం గణపతిం శ్రీ హటకేశం పునః
సారంగేశ్వర బిందు తీర్థం మమలం ఘంటార్క సిద్దేశ్వరమ్
గంగాం శ్రీ భ్రమరాంబికాం గిరిసుతా మా రామ వీరేశ్వరమ్
శంఖం చక్ర వరదా ఈర్థమనిశం శ్రీశైలం నాథం భజే’’

03/03/2019 - 23:51

‘‘మాతాచ పార్వతీదేవీ పితాదేవో మహేశ్వరః
బాంధవాః శివభక్తాచ స్వదేశో భువనత్రయం’’.

03/01/2019 - 19:35

భగవంతుని కొరకు పరితపింపవలయును. కామినీ కాంచనములపై మనసు బెట్టుకొని భగవన్నామస్మరణ చేసినందువల్ల నేమి లాభము,. కేవల మంత్రము వలన తేలుకాటు మానదు. ఆవుపేడ యొక్క పొగను కూడా అచట వేయవలయును. ఒక్కసారి భగవన్నామము నుచ్చరించినందువలననే నరుని సమస్త పాపములను హరించును. సందియము లేదు. కాని వెనువెంటనే నరుడు పాపకార్యములను చేయుచున్నాడే. ఇక మరల పాపము చేయనని ఒట్టుపెట్టుకొనుటకు వానికి మనో బలము చాలదు.

02/28/2019 - 20:15

శ్రీగురుదేవు డొకశిష్యున కిట్లు బోధించెను: ‘‘్భక్తిమార్గమున సులభముగా ఇంద్రియ నిగ్రహము లభించును. మానసమున భగవద్భక్తి వృద్ధిపొందిన కొలదియు విషయ భోగములు రసహీనముగా గాన్పించుచుండును. తమ బిడ్డ చనిపోయిన దినమున ఇంద్రియ సుఖములు భార్యాభర్తల నాకర్షింపజాలునా?’’
శిష్యుడు: కాని భగవానునియందు నాకు భక్తి కుదురకున్నది.

02/27/2019 - 19:33

అట్లే తీవ్ర జపతపముల నొనర్చి ఈశ్వర సాక్షాత్కారముబడసిన మహనీయుల సాంగత్యము చేయుటచేతను వారి సదుపదేశముల ననుసరించుట చేతను అనేకులు తమ మనస్సును భగవంతునిపై లగ్నముచేసికొందురు.
341. వకీలు కాన్పింపగనే వ్యాజ్యెములును కోర్టులును తలపునకు వచ్చను. అటులనే సద్భక్తులు గాన్పించునపుడు భగవంతుడును ఆముష్మికమును తలపునకువచ్చును. (చూ.599)

02/26/2019 - 19:31

ఆవులు కడుపార మేసి నెమ్మదిగా ఒకచోట పరుండి నెమరు వేయును. అటులనే నీవొక పుణ్యక్షేత్రమును దర్శించిన పిమ్మట. అచట నీ మనస్సున నుదయించిన పవిత్ర భావములను గైకొని, యేకాంత స్థలమున గూర్చుండి వానిలో నీవునిమగ్నుడ వగువఱకును మననము చేయవలయును. ఆ క్షేత్రములనుండి మఱలగనే విషయ భోగములకు దాసుడవై ఆ యుత్తమ భావములనన్నిటిని బోగొట్టుకొనరాదు.

02/25/2019 - 19:32

ఆ కాలమున విగ్రహారాధనను తీవ్రముగా ఖండించుచుండెడి కేశవ చంద్ర సేనునితో శ్రీ గురుదేవుడొకప్పుడిట్లు పలికెను: ‘‘ఈ విగ్రహములు నీ మనస్సులో ఎందుచేఱాయి, గడ్డి, కఱ్ఱ అనుభావములను గల్గంపవలెను? నిత్యానంద ప్రజ్ఞానమయియగు అల జగన్మాతయే ఈ రూపములన్నిటను వెల్గొందుచున్నదని నీవేల గ్రహింపరాదు?’’

Pages