S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

Others

06/10/2019 - 19:49

పుట్టుకకు ముందే నారదుని వల్ల హరినామస్వరూపాన్ని వూహించుకున్నాడు. పుట్టీ పుట్టగానే తండ్రి క్రోధావేశంతో హరి రూప సామర్థ్యాన్ని తెలుసుకున్నాడు. హరి లేనిదే ప్రపంచం లేదు అని నెమ్మదిగా తాను దిన దిన ప్రవర్థమాన మయనట్లే హరి గురించిన విశేషాలను చాలానే తెలుకున్నాడు. రాజమందిరంలో తల్లి ప్రియకుమారుడిగా, వారస్వతసంపదను పుణికి పుచ్చుకోవాలనుకొనే తండ్రి ముద్దు బిడ్డడుగా ఎదుగుతున్నాడు ప్రహ్లాదుడు.

06/07/2019 - 18:59

వీనికి నే నెరిగినట్టి విలువిద్యల నెరిగింతును
నాకడనున్నట్టి అస్త్ర శస్తమ్మ్రుల నిత్తును.

నాకేటికి ఆ బరువులు? ఆ పరువుల మూటలును?
నీటిలోని నీరు దీసి నేను దోసిలింతును!

రాముని దీసుకు వెళ్ళెద- శ్రీరాము నప్పగించెద!
ప్రాణాలకు ప్రాణాలను నేనడ్డము వేసెద!

ఇంత పుత్త్రవాత్సల్యము తగదు! తగదు! నీకిత!
ఒక భానుని నీ కౌగిట కట్టివేయ వలదిక!

06/06/2019 - 19:27

పృథ్వి నెల్ల మీ చేతులనుంచెద గ్రహించుడి!
నా రాముండొక పిల్లడు వాని నొగ్గివేయుడి!

పరశురాముడను కొంటిరొ? పసికూనయె వీడు!
ఎటుల ఘోర రక్కసులను ఎదిరించగలడు?

ఒక చెక్కిలి మీట పాలు- ఒక చెక్కిట నీరు
నిన్న మొన్న పాలు మరచి నట్టి బుడత వీడు.

లేక లేక కలిగె వీడు- నా కన్నుల తార!
వానినంపి నేనుందునె! విడుతును ప్రాణాల!’’

06/06/2019 - 19:24

కాలము అనంతము.. కర్మ అనాది. ఈ రెండు సమాంతరంగా నడుస్తుంటాయి. ఈ కాలము నాణెమునకు వలె రెండు పార్శ్వములుంటాయి. ఒకవైపు కాలమునకు భూత, భవిష్యద్వర్తమానములుంటాయి (సమూర్తము). ఇంకొకవైపు కాలమునకు ఈ మూడు కాని కాలములో వుంటుంది (అమూర్తము). ఋగ్వేద కాల సూక్తములో ఈ విషయము తెలిపారు. అది మనసుకు, బుద్ధికి గ్రాహ్యము కాదు. మరి ఈ కాలాన్ని మింగినవాడు కాలాంతకుడు. కాల, కర్మలు అవిభక్తంగానే వుంటూ విభక్తంగా గోచరిస్తాయి.

06/05/2019 - 19:54

వౌనమ్మే నియమమాయె- క్షమయే ఆభరణమాయె
అందువలన ఆ దుష్టుల- ఆగడములు మించిపోయె.

పట్టలేను ఆయుధమ్ము- ఇవ్వలేను శాపమ్మును
నా నియమమె వారికిపుడు- ఆయుధమ్ముగా మారెను.

తిరుగుచుంటి నేనిట్టుల- కత్తిచ కత్తి కొరకు
అర్థించితి నిన్నిట్టుల- రక్షచ రక్ష కొరకు’’.

అనగా ముని కొయ్యబారి దశరథుండు కూలెను
క్రుంగె భూమి ఆకసమ్ము కూలెననగ తలను.

06/05/2019 - 19:50

పార్వతీపరమేశ్వరులు ఆది దంపతులు. తల్లిదండ్రులు. అమ్మా అని పిలిచినా, తండ్రీ అని పిలిచినా వెనువెంటనే వారిద్దరూ వచ్చి భక్తుని కడగండ్లను రూపుమాపుతారు. కరుణామూర్తులైన పార్వతీపరమేశ్వరులు చైన్నై నగరానికి నైరుతిదిశలో ఉన్న మాంగాడు క్షేత్రంలో కొలువైయనారు. ఇక్కడి అమ్మ వారిని కామాక్షిగా కీర్తిస్తారు.

06/04/2019 - 19:37

ఒకానొక కాలంలో శిలాదమహర్షి అనే ముని పుంగవుడు ఉండేవాడు. అతడు తనకు సంతానం లేదని ఎంతో బాధపడుతుండేవాడు. సృష్టిస్థితిలయలకు కారణభూతుడు, ఆధారభూతుడైన కరుణాంబోధి అపార కృపావత్సలుడైన ఆ పరమేశ్వరుడు తప్ప తనను బాధనుంచి విముక్తిచేసేవారు ఎవరూ లేరని నిశ్చయించుకొన్నాడు శిలాద మహర్షి. అందుకే ఆ పరమ శివుని కోసం తపస్సు ఆరంభించాడు. ఎన్నోవేల సంవత్సరాలు సంతానార్థియై పరమేశ్వరుని పట్టు వదలక ధ్యానించాడు.

06/04/2019 - 19:35

రాముని తోకన బోలుచు లక్ష్మణుండు వచ్చెను
భరతుని తోకన బోలుచు శత్రుఘు్నండేతెంచెను.

వినయమ్ముల ప్రోవులనగ వారలటకు వచ్చిరి
వచ్చిరొ, లేదో భక్తిని మునిపదమ్ములంటిరి.

రాముని పైకెత్తు నెపము నంటె నతని పదముల
అతని పాదరజమంటగ తేలెను పులకింతల.

ఆ వింతల పులకరింత- అతడెరుగును ఆతండును
కాంతులలో కాంతిచ- కాంచె దివ్యప్రభలను.

06/03/2019 - 19:49

పాదపూజలను వౌనికి పాలతోడ సేయు వేళ
మణిమయవౌ మకుటమ్మే పడిపోయెను పాదాలను.

రత్నఖచితపీఠమ్మే రాలినట్లు పదములందు
భౌగోళమె భక్తికొలది పూజాసుమమైన యట్లు.

రాజరాజు శిరమట్టుల- రాజిల్లెను మునిపదములు
మునులే కద ఏలువారు నేలు వారినైనను.

ఆతని మకుటమ్ముదీసి ఆతనికె యిచ్చె వౌని
కొనినట్టుల రాజ్యమె చేకొనెనంతట రాజు.

06/03/2019 - 19:47

ఏ పని చేసినా ఏకాగ్రతతో చేయాలంటారు. నియమనిష్ఠలతో ఆ పని మీదే ధ్యాస పెట్టి చేసే పనులే అనుకొన్న ఫలితాన్నిస్తాయి. మనోవాక్కాయములలో పవిత్రత, ఐక్యత కలిగినపుడు చేసే పనులు మంచి ఫలితాలను ఇస్తాయ. ఈసురోమని పనులు చేస్తే అవిఅవి కూడా నీరసమైన ఫలితాలనే ఇస్తాయ. నలువైపుల నుంచి మంచి భావనలు నాకు చేరాలి అని ప్రార్థించమని వేదం చెబుతుంది. మంచినే పలకాలి. మంచినే చేయాలి.

Pages