S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

02/20/2020 - 03:30

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 19: సబార్డినేట్ జ్యుడిషీయరీ సర్వీసెస్ సభ్యుడు ప్రత్యక్ష నియామకం ద్వారా జిల్లా న్యాయమూర్తులుగా నియమించడానికి అర్హత లేదని సుప్రీం కోర్టు తీర్పునిచ్చింది. దిగువ న్యాయ వ్యవస్థ సభ్యులు ప్రత్యక్ష నియామకం ద్వారా జిల్లా న్యాయమూర్తుల పదవులకు అర్హులు కాదని సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ అరుణ్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం బుధవారం ఈ మేరకు స్పష్టం చేసింది.

02/20/2020 - 03:29

ముంబయి: ఐదేళ్ల చిన్నారిని అత్యంత హేయంగా రేప్ చేసి హత్య చేసిన కేసులో నిందితుడికి మరణశిక్ష విధించిన వైనం ఇక్కడి పర్బని జిల్లాలో చోటుచేసుకొంది. పైశాచికానందం కోసం చిన్న పిల్ల అని కూడా చూడకుండా అత్యాచారానికి పాల్పడిన ఈ ఉదంతాన్ని ‘అత్యంత క్రూరమైనది’గా భావిస్తూ నిందితుడికి మరణశిక్ష విధించినట్లు పోక్సో కేసుల ప్రత్యేక జడ్జి బుధవారం స్పష్టం చేశారు. ప్రాసిక్యూషన్ కథనం మేరకు..

02/20/2020 - 03:27

నొయిడా (ఉత్తరప్రదేశ్), ఫిబ్రవరి 19: ఫోర్జరీ చేసిన ఆధార్, పాన్ కార్డుల ఆధారంగా క్రెడిట్ కార్డులతో బ్యాంకులకు టోకరా వేసి కోట్లాది రూపాయిలు కొట్టేయడానికి యత్నించిన ఇద్దరు నిందితులను ఉత్తరప్రదేశ్ పోలీసులు అరెస్టు చేశారు. గ్రేటర్ నొయిడా పోలీసుల కథనం మేరకు..

02/20/2020 - 01:53

చందర్లపాడు, ఫిబ్రవరి 19: అప్పులభాధ తట్టుకోలేక వ్యక్తి పురుగుల మందు త్రాగి ఆత్మహత్య చేసుకొన్న సంఘటన మండలంలోని చింతలపాడులో బుధవారం జరిగింది. సేకరించిన సమాచారం ప్రకారం చింతలపాడు గ్రామానికి చెందిన కురగంటి శ్రీను (32) అనే వ్యక్తి 3ఎకరాలు కౌలుకు తీసుకొని పత్తి పంట సాగు చేశాడు. పెట్టుబడుల నిమిత్తం 4లక్షలు అప్పు తెచ్చి పెట్టగా ప్రకృకి సహకరించక అప్పులు పెరిగి తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు.

02/20/2020 - 01:40

శేరిలింగంపల్లి, ఫిబ్రవరి 19: మద్యం మత్తులో కారు డ్రైవర్ బీభత్సం సృష్టించాడు. పార్కు చేసిన బైక్‌ను ఢీ కొట్టగా దానిపై కూర్చున్న వ్యక్తి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పొయాడు. మరోకారు, బైక్ ధ్వంసమయ్యాయి. పోలీసులు, ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. బీహెచ్‌ఈఎల్ ఎంఐజీలో నివసిస్తున్న ఎండీ అఫ్సర్ (40) సంగారెడ్డి జిల్లాలోని కందిలో గల ఓ ప్రైవేటు పాఠశాలలో ప్రిన్సిపాల్‌గా పని చేస్తున్నాడు.

02/20/2020 - 01:32

శంషాబాద్, ఫిబ్రవరి 19 అక్రమంగా తరలిస్తున్న 11లక్షల విలువైన బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బుధవారం శంషాబాద్ రాజీవ్ గాంధీ విమానాశ్రయంలో తనిఖీలు నిర్వహించగా మహిళ వద్ద బంగారం ఉన్నట్లు గుర్తించారు. 290గ్రాముల బంగారం బిస్కెట్లు, అభరణాలు బయటపడ్డాయని తెలిపారు.

02/20/2020 - 05:01

న్యూఢిల్లీ: అక్రమ ఇసుక తవ్వకాలు, రవాణాను వెంటనే అరికట్టాలని సుప్రీం కోర్టు రాజస్థాన్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్‌ఏ బాబ్డె నేతృత్వంలోని ధర్మాసనం బుధవారం ఈ మేరకు ఆదేశించింది. ప్రబలిన అక్రమ ఇసుక తవ్వకాలపై గట్టిగా దృష్టి సారించాలని రాష్ట్ర ప్రభుత్వానికి జస్టిస్ బాబ్డె దిశానిర్ధేశం చేశారు.

02/19/2020 - 23:45

వేములవాడ రూరల్, ఫిబ్రవరి 19 : సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో మంగళవారం జరిగిన బ్యాంకు ఉద్యోగిని దివ్య హత్య కేసు ప్రధాన నిందితుడు వెంకటేష్ గౌడ్ బుధవారం సాయంత్రం వేములవాడ పోలీసుల ఎదుట లొంగిపోయాడు. అంతకు ముందు సిద్దిపేట పోలీసులు నాలుగు బృందాలుగా వేములవాడ వచ్చి నిందితుడి తల్లిదండ్రులను అదుపులోకి తీసుకున్నారు. దీంతో వెంకటేష్‌గౌడ్ సాయంత్రం పోలీసులకు లొంగి పోయాడు.

02/19/2020 - 05:10

చిత్తూరు, ఫిబ్రవరి 18: చిత్తూరు కో-ఆపరేటివ్ టౌన్ బ్యాంకులో గిల్ట్ నగలు తాకట్టు పెట్టి రూ.86లక్షలు రుణంగా తీసుకుని మోసానికి పాల్పడిన కేసులో బ్యాంకు మాజీ చైర్మన్ షణ్ముగంను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయన నుంచి ఐదుకిలోల గిల్ట్ నగలు, రెండు కార్లు, రెండు ఇళ్లను సీజ్ చేసినట్లు చిత్తూరు డీఎస్పీ ఈశ్వర్‌రెడ్డి తెలిపారు.

02/19/2020 - 04:44

హైదరాబాద్, ఫిబ్రవరి 18: ఇస్లామిక్ ఉగ్రవాది అబ్దుల్ కరీం తుండా మారణహోమం కుట్రపై నాంపల్లి క్రిమినల్ కోర్టు తీర్పు మరోమారు వాయిదా పడింది. ఫిబ్రవరి 4నే తీర్పు వెలువడాల్సి ఉన్నా, కేసు ఫిబ్రవరి 18కి వాయిదా పడింది. అయితే న్యాయమూర్తి సెలవులో ఉండటంతో తుది తీర్పు మరో మారు మార్చి 3కి వాయిదా పడింది.

Pages