S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

02/24/2020 - 02:25

పమిడిముక్కల, ఫిబ్రవరి 23: మండల పరిదిలోని ఐనపూరు కృష్ణానదిలో పితృదేవతలకు పిండ ప్రదానం చేస్తూ వ్యక్తి నదిలో గల్లంతైన సంఘటన ఆదివారం చోటు చేసుకుంది.

02/24/2020 - 02:17

ఖైరతాబాద్, ఫిబ్రవరి 23: అతి వేగంతో దూసుకువచ్చిన కారు బంజారాహిల్స్ ప్రధాన రహదారిపై బీభత్సం సృష్టించింది. మాదాపూర్ వైపు నుంచి కేబీఆర్ పార్కు మీదుగా పంజాగుట్ట వైపునకు వస్తున్న కారు బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 3లో ప్రమాదానికి గురి అయింది. పరిమితికి మించిన వేగంతో వస్తున్న కారు అదుపుతప్పి రోడ్డుకు పక్కనే ఉన్న ఫుట్‌పాత్‌పైకి దూసుకువెళ్లింది.

02/24/2020 - 01:34

గుడిహత్నూర్, ఫిబ్రవరి 23: ఓ బాలికపై ఇద్దరు మైనర్ బాలురు సామూహిక అత్యాచారం చేసిన దారుణ సంఘటన ఆదిలాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. గుడిహత్నూర్ మండలంలోని వడ్డెర కాలనీకి చెందిన 14 ఏళ్ళ బాలిక బహిర్భూమికని శనివారం రాత్రి 7 గంటల సమయంలో ఇంటి నుండి ఊరి బయటకు వెళ్ళగా కాపుకాసి ఉన్న ఇద్దరు మైనర్లు అత్యాచారానికి పాల్పడ్డ ఘటన జిల్లాలో అలజడి రేపింది.

02/24/2020 - 01:34

భువనగిరి, ఫిబ్రవరి 23: పూర్తిగా మైనారిటీ తీరని ప్రేమజంట భువనగిరి ఖిల్లాపై ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డ సంఘటన ఆదివారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం కడవేరు గ్రామానికి చెందిన కోడూరి నవీన్ (19) అదే మండలంలోని వేచరేని గ్రామానికి చెందిన స్వాతి (17) ఒకరిని ఒకరు ప్రేమించుకుని వివాహం చేసుకునేందుకు 22న శనివారం ఇంటినుంచి పారిపోయారు.

02/24/2020 - 04:43

తెనాలి: ప్రేమ పేరుతో వంచించిన తనపై ఓ యువతి కేసుపెట్టి జైలుకు పంపిందన్న కక్షతో ఆమెతో పాటు ఆమె తల్లిపై తుపాకీతో కాల్పులు జరిపిన ఆర్మీ ఉద్యోగి బాలాజీ (24) అదేరోజు తాడేపల్లి మండలం కొలనుకొండ - పెదవడ్లపూడి రైల్వేస్టేషన్ల మధ్య రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన ఆదివారం వెలుగుచూసింది. తెనాలి జీఆర్పీ పోలీసుల కథనం ప్రకారం..

02/24/2020 - 01:25

గుమ్మలక్ష్మీపురం, ఫిబ్రవరి 23: క్షణికావేశంలో ఓ తండ్రి కన్నకుమారుడినే హత్య చేసిన సంఘటన విజయనగరం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలంలో ఆదివారం చోటు చేసుకుంది. ఈమేరకు పోలీసులు, కుటుంబ సభ్యులు అందించిన వివరాల ప్రకారం మండలంలోని పెదఖర్జ పంచాయతీ బొద్దిడి గ్రామానికి చెందిన అడ్డాకుల కాంతారావు తన కోడి పుంజును చెరువులో స్నానం చేయించి నీరు తాగిస్తుండగా కోడిపుంజు చనిపోయింది.

02/24/2020 - 01:23

కుభీర్, ఫిబ్రవరి 23: ప్రమాదవశాత్తు బకెట్లో ఉన్న నీటిలో పడి ఒక బాలుడు మృతి చెందిన సంఘటన నిర్మల్ జిల్లాలో చోటు చేసుకుంది. కుభీర్ మండలంలోని సాంగ్వి గ్రామంలో ఆదివారం మూడు గంటల ప్రాంతంలో బకెట్లో పడి ఆదిత్య (2) అనే బాలుడు మృతి చెందాడు. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం యోగేష్, రజిత దంపతులకు ఇద్దరు కుమారులు.

02/23/2020 - 04:56

కోట: భర్తపై కోపంతో మనస్ధాపం చెందిన భార్య వారి ఇద్దరు కుమారులను హతమార్చి తాను బలవర్మవరణానికి పాల్పడిన సంఘటన కోట మండలంలోని ఊనుగుంటపాలెం గ్రామంలో శనివారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే నెల్లూరు జిల్లా కోట మండలంలోని ఊనుగుంట పాలెం గ్రామంలో కల గిరిజన కాలనీకి చెందిన నాగార్జున భార్య వాణి కుటుంబ కలహాల వలన ఇద్దరి మధ్య చిన్న వివాదం చోటు చేసుకుంది.

02/23/2020 - 04:54

మచిలీపట్నం, ఫిబ్రవరి 22: పదిహేనేళ్ల బాలికను ప్రేమ పేరుతో లోబర్చుకోవటంతో పాటు ఆ బాలిక గర్భం దాల్చడానికి కారకుడైన ఓ హోంగార్డు కటకటాలపాలైన ఉదంతమిది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

02/23/2020 - 04:24

న్యూఢిల్లీ: నిర్భయ దోషుల్లో ఒకడైన వినయ్‌శర్మకు పటియాల కోర్టు మరోసారి షాక్ ఇచ్చింది. తనకు మతిస్థితిమిత లేదంటూ అతడు దాఖలు చేసిన పిటిషన్‌ను అడిషనల్ సెషన్స్ జడ్జి ధర్మేంద్ర రాణా డిస్మిస్ చేశారు. వినయ్ పిటిషన్‌పై శనివారం వాదోపవాదాలు జరిగాయి. ‘దోషి చెబుతున్నవన్నీ పచ్చి అబద్ధాలు. శిక్షను వాయిదా వేయించుకోవడం కోసం రకరకాలు ప్రయత్నాలు చేస్తున్నాడు’అని తీహార్ జైలు అధికారులు కోర్టుకు తెలిపారు.

Pages