S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

06/03/2019 - 04:57

గూడెంకొత్తవీధి, పాడేరు: విశాఖ జిల్లా ఏజెన్సీలోని చింతపల్లి మండలం బలపం పంచాయతీలో ఆదివారం సాయంత్రం దారుణమైన సంఘటన చోటుచేసుకుంది. ప్రయాణికులతో వస్తున్న ఆటో అదుపుతప్పి కరెంటు స్తంభాన్ని ఢీకొనడంతో తెగిపడిన విద్యుత్ వైర్లకు ఐదుగురు దుర్మరణం చెందగా, చిన్న పిల్లలతోపాటు పలువురికి తీవ్రగాయాలు అయ్యాయి. ఈ విషాదకర సంఘటనపై ప్రత్యక్ష సాక్షులు, పోలీసులు చెప్పిన వివరాలు ఇలా ఉన్నాయి.

06/02/2019 - 22:57

మదనపల్లె, జూన్ 2: చేసిన పనులకు కూలి డబ్బులు ఇవ్వమని అడిగినందుకు ట్రాక్టర్ యజమాని ఆగ్రహంతో కూలీలను తన ట్రాక్టర్‌తో ఢీకొట్టడంతో అన్నదమ్ములిద్దరు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. ఈ విషాద సంఘటన చిత్తూరు జిల్లా మదనపల్లె మండలంలో ఆదివారం చోటుచేసుకుంది. మదనపల్లె రూరల్ ఎస్‌ఐ దిలీప్‌కుమార్ కథనం మేరకు వివరాలిలా వున్నాయి.

06/02/2019 - 03:56

రాజవొమ్మంగి, జూన్ 1: దాగుడుమూతలు ఆడుతూ తోటి వారికి కనిపించకుండా పెట్టెలో దాక్కున్న ఇరువురు బాలల ఊపిరాడక మరణించిన విషాద సంఘటన తూర్పుగోదావరి జిల్లా రాజవొమ్మంగి మండలంలో చోటు చేసుకుంది. ఈ సంఘటన జరిగి వారం రోజులైన తరువాత శనివారం వెలుగులోకి వచ్చింది. మండలంలోని జడ్డంగి పంచాయతీ చిన్నయ్యపాలెం గ్రామంలో ఈ దుర్ఘటన జరిగింది.

06/02/2019 - 01:52

మహేశ్వరం, జూన్ 1: క్రిమిసంహరక మందు తాగి గంగారంలో యువ రైతు సాలేకుల యాదయ్య 32 శుక్రవారం రాత్రి మృతి చెందాడు. మహేశ్వరం సీఐ వెంకన్ననాయక్ కథనం ప్రకారం.. గంగారం గ్రామానికి చెందిన సాలెకుల యాదయ్య వ్యవసాయ పొలంలో పంటలు పండక బోర్లలో నీళ్లు లేక పోతే కొత్తగా బోరు వేశారు.

06/02/2019 - 01:26

వరంగల్: ఈత సరదా ముగ్గురి నిండు ప్రాణాలను బలిగొంది. జనగామకు చెందిన మూడ్ అవినాష్ తన భార్య, ఇద్దరు మరదళ్లను వెంట పెట్టుకొని రిజర్వాయర్ వద్దకు వెళ్లాడు. ఈత సరదాతో మరదళ్లతో కలిసి రిజర్వాయర్‌లోకి దిగి నీళ్లతో ఆటలాడుకుంటూనే మృత్యు ఒడిలోకి వెళ్లిపోయారు. ఈ సంఘటన జనగామ జిల్లా నర్మెట మండలం బొమ్మకూరు రిజర్వాయర్ వద్ద శనివారం చోటుచేసుకుంది. ప్రత్యక్ష సాక్ష్యుల వివరాల ప్రకారం...

06/01/2019 - 05:57

పటన్‌చెరు, మే 31: పట్టపగలు నడిరోడ్డుపై దారుణం. అందరూ చూస్తుండగానే జాతీయ రహదారిపై కిరాతకమైన హత్య. ప్రయాణికులందరూ ప్రేక్షకులుగా మారగా కళ్లెదుట వేట కొడవలితో అత్యంత దారుణంగా యువకుడిని హత్య చేసిన తర్వాత దుండగులు నింపాదిగా నడుచుకుంటూ వెళ్లి బైక్‌పై పరారయ్యాడు. పటాన్‌చెరు మండలం రుద్రారం గ్రామ శివారులలోని ప్ల్రైఓవర్ దాటిన తరువాత శుక్రవారం జరిగిన దుర్ఘటన ఇది.

06/01/2019 - 05:09

న్యూఢిల్లీ, మే 31: పర్యావరణ అనుమతులు వచ్చేంత వరకూ గోదావరి, కృష్ణా, పెన్నా నదుల అనుసంధానం పనులు నిలిపివేయాలని జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ) ఆదేశాలు జారీ చేసింది. గతంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎలాంటి పర్యావరణ అనుమతులు తీసుకోకుండా నదుల అనుసంధాన కార్యక్రమాన్ని చేపట్టిందని మాజీ మంత్రి వట్టి వసంతకుమార్ ఎన్జీటీలో పిటిషన్‌ను దాఖలు చేశారు.

06/01/2019 - 05:09

న్యూఢిల్లీ, మే 31: బిహార్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో గంగా నది మురుగు ప్రక్షాళనపై కొనసాగుతున్న నిర్లక్ష్య వైఖరిపై జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈమేరకు ఒక్కో రాష్ట్రం 25 లక్షల జరిమానా చెల్లించాలని ఎన్‌జీటీ ఆదేశించింది. గంగానది మురుగు ప్రక్షాళన ప్రాజెక్టులకు సంబంధించి బిహార్ ప్రభుత్వం ఒక్కటి కూడా పూర్తి చేయలేదని పేర్కొంది.

06/01/2019 - 04:17

న్యూఢిల్లీ, మే 31: కోట్లాది రూపాయల బిట్‌కాయిన్ పోంజీ కుంభకోణంపై సమగ్ర దర్యాప్తు చేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని సీబీఐ దేశ సర్వోన్నత న్యాయస్థానానికి తెలిపింది. బిట్‌కాయిన్ పోంజీ సంస్థ భారీ రిటర్నులు అందిస్తామంటూ భరోసా ఇచ్చి ఎంతోమంది పెట్టుబడిదారుల నమ్మకాన్ని వమ్ము చేసింది.

06/01/2019 - 02:02

జి.కొండూరు, మే 31: రోడ్డు ప్రమాదంలో యువతి దుర్మరణం చెందింది. విజయవాడ - చత్తీస్‌ఘడ్ జాతీయ రహదారిపై జి.కొండూరులో శుక్రవారం సాయంత్రం ఈప్రమాదం చోటు చేసుకుంది. ప్రత్యక్ష సాక్షుల తెలిపిన వివరాల ప్రకారం జి.కొండూరు గ్రామానికి చెందిన మరీదు సర్వేశ్వరరావు కుమార్తె మరీదు మల్లీశ్వరి (19) విజ్ఞాన్ యూనివర్శీటీలో బిజెడ్‌సి రెండవ సంవత్సరం చదువుతోంది.

Pages