S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

02/11/2020 - 01:12

హైదరాబాద్, ఫిబ్రవరి 10: వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ పౌరసత్వం రద్దుపై స్టే ఉత్తర్వులను హైకోర్టు మరోమారు పొడిగించింది. చెన్నమనేని పౌరసత్వాన్ని రద్దు చేస్తూ కేంద్ర హోం శాఖ జారీ చేసిన ఉత్తర్వులపై హైకోర్టు గత నవంబర్‌లో స్టే ఇచ్చింది. తాజాగా ఆ ఉత్తర్వులను ఈ నెల 24 వరకూ పొడిగిస్తూ న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది.

02/11/2020 - 01:01

కరీంనగర్: తనను ప్రేమించడం లేదంటూ ఓ యువతి గొంతు కోసిన ప్రేమోన్మాది ఆమెను దారుణంగా హత్య చేశాడు. ఈ సంఘటన కరీంనగర్‌లో సోమవారం సంచలనం సృష్టించింది. కొద్దిరోజుల క్రితం నగరం నడిబొడ్డున ప్రేమించడం లేదనే కోపంతో గొంతు కోసి యువతిని హత్య చేసిన సంఘటన మరువకముందే నగరంలో మరో దుస్సంఘటన చోటుచేసుకుంది.

02/11/2020 - 00:59

హైదరాబాద్, ఫిబ్రవరి 10: రాయదుర్గం బయోడైవర్సిటీ సమీపంలో మైహోం భూజా ప్రాజెక్టుకు ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించి భూ కేటాయింపులు చేశారని, దీనివల్ల ప్రభుత్వ ఆదాయానికి వందల కోట్ల రూపాయిల నష్టం వాటిల్లిందని మల్కాజ్‌గిరి కాంగ్రెస్ ఎంపీ రేవంత్‌రెడ్డి దాఖలు చేసిన ప్రజాప్రయోజనాల వ్యాజ్యాన్ని హైకోర్టు విచారణకు స్వీకరించింది. ప్రభుత్వంతో పాటు మైహోం భూజా, డీఎల్‌ఎఫ్ సంస్థలకు నోటీసులు జారీ చేసింది.

02/11/2020 - 00:49

ఫిరంగిపురం, ఫిబ్రవరి 10: గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండలం రేపూడి గ్రామ శివారులో సోమవారం ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఆరుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతిచెందగా, ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండలం రేపూడి గ్రామ శివారులో గుంటూరు-కర్నూలు రహదారిపై ప్రయాణికులతో వస్తున్న ఆటోను మినీలారీ ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది.

02/11/2020 - 00:09

న్యూఢిల్లీ: పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ ఢిల్లీ షహీన్‌బాగ్‌లో గత డిసెంబర్ 15వ తేదీ నుంచి జరుగుతున్న ఆందోళనలపై సుప్రీంకోర్టు స్పందించింది. వాహనాల రాకపోకలకు అంతరాయం కలుగకుండా.. సూచించిన ప్రదేశంలో మాత్రమే ఆందోళనకారులు నిరసనలు తెలియజేయాలని సుప్రీంకోర్టు సోమవారం ఆదేశించింది.

02/11/2020 - 02:15

న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా ‘కమ్యూనిటీ కిచెన్’ సెంటర్ల ఏర్పాటుకు సంబంధించి కేంద్ర, రాష్ట్రాలు అవలంబిస్తున్న నిర్లక్ష్య వైఖరిపై సుప్రీం కోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది.

02/11/2020 - 02:10

న్యూఢిల్లీ: ప్రజాభద్రత చట్టం కింద కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లాను దీర్ఘకాలంగా నిర్బంధంలో ఉంచడాన్ని సవాల్ చేస్తూ ఆయన సోదరి సోమవారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఒమర్ అబ్దుల్లాను ఇంత కాలం నిర్బంధంలో ఉంచడం అన్నది పూర్తిగా అన్యాయమని, ఆయన వల్ల ప్రజాజీవనానికి ఏ రకంగానూ ముప్పువాటిల్లే అవకాశం లేదని సారా అబ్దుల్లా తెలిపారు.

02/10/2020 - 06:58

జగిత్యాల: కరీంనగర్ జిల్లా గంగాధర మండలం కురిక్యాల వద్ద శనివారం అర్ధరాత్రి టాటాఏస్‌ను గ్రానైట్ లారీ ఢీకొట్టిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు. మృతులు కొడిమ్యాల మండలం గౌరాపురం గ్రామానికి చెందిన మేకబాబు, మాజీ ఎంపీపీ బానయ్య, మేక నర్సయ్య, మేక శేఖర్, పూడూర్ గ్రామానికి చెందిన గడ్డం అంజయ్య మృతి చెందడంతో కొడిమ్యాల మండలం గౌరాపురం, పూడూర్‌లో విషాద ఛాయలు నెలకొన్నాయి.

02/10/2020 - 06:09

హైదరాబాద్, ఫిబ్రవరి 9: వివాదాస్పద విమర్శకుడు కత్తి మహేశ్ మరో వివాదంలో చిక్కుకున్నాడు. శ్రీరాముడిపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు అందడంతో ఆయనపై సెక్షన్ 502 కింద కేసు నమోదు చేశారు. కాగా, ఇటీవల ఆయన మాట్లాడుతూ శ్రీరాముడి ఫేవరెట్ వంటకం జింక మాంసమని, సీతాదేవి దానిని తినడం కోసమే జింకను తీసుకుని రమ్మని కోరిందంటూ వ్యాఖ్యానించిన సంగతి విదితమే.

02/10/2020 - 04:42

ఖైరతాబాద్, ఫిబ్రవరి 9: విద్యుద్ షాక్‌తో విద్యార్థి మృతి చెందిన సంఘటన బంజారాహిల్స్ పోలీస్‌ష్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. ఫిలింనగర్‌లో నివాసం ఉండే యాదమ్మ ఇండ్లలో పనిచేసుకొని జీవనం సాగిస్తుంది. భర్త శేఖర్ మృతిచెందగా కుమారుడు అఖిల్‌తో కలిసి ఉంటుంది. 12 ఏళ్ల అఖిల్ రౌండ్ టేబుల్ పాఠశాలలో ఆరోతరగతి చదువుతున్నాడు.

Pages