S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

02/05/2020 - 06:16

నర్సీపట్నం: ఆదాయానికి మించిన ఆస్తులను కలిగి ఉన్నారనే ఆరోపణలపై మంగళవారం అవినీతి నిరోధక శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించారు. విశాఖ జిల్లా మాకవరపాలెం మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో స్ట్ఫా అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్న శీరంరెడ్డి గోవిందతో పాటు అతని బంధువుల ఇళ్ళలో ఏసీబీ అధికారులు ఏకకాలంలో దాడులు నిర్వహించారు.

02/05/2020 - 06:15

ఎచ్చెర: పార్వతీపురం ఐటీడీఏ డిప్యూటీ ఈఈ తూతిక మోహన్‌రావు ఇంటిపై శ్రీకాకుళం, పార్వతీపురంలో ఏకకాలంలో ఏసీబీ అధికారులు మంగళవారం ఏకకాలంలో దాడులు నిర్వహించారు. పెద్ద మొత్తంలో బంగారం, వెండి వస్తువులు, సంబంధిత పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. మార్కెట్ విలువ ప్రకారం వీటి విలువ కోట్లలో ఉంటుందని ఏసీబీ అధికారులు అంచనా వేస్తున్నారు.

02/05/2020 - 05:12

న్యూఢిల్లీ: నిర్భయ దోషుల ఉరిశిక్ష అమలుపై స్టేను సవాల్ చేస్తూ కేంద్రం దాఖలు చేసిన పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు బుధవారం తీర్పును వెలువరించింది. ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి సురేష్ కుమర్ కైత్ కేంద్రం, ఢిల్లీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్లను శని, ఆదివారాలు విచారించారు. ఈనెల 2న తీర్పును కోర్టు రిజర్వ్‌లో ఉంచింది.

02/05/2020 - 04:56

నందిగామ, ఫిబ్రవరి 4: జాతీయ రహదారిపై నందిగామ రైతుపేటలో మంగళవారం ఉదయం జరిగిన ఒక రోడ్డు ప్రమాదంలో మానస అనే ప్రైవేటు స్కూల్ ఉపాధ్యాయిని మృతి చెందారు. నందిగామ రైతుపేటలో ఉంటున్న ఆమె కంచికచర్లలోని ఒక కార్పోరేట్ పాఠశాలలో పని చేస్తోంది. మంగళవారం ఉదయం ద్విచక్ర వాహనంపై పాఠశాలకు వెళుతూ లారీని ఢీకొట్టి టైరు కింద పడటంతో అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

02/05/2020 - 04:50

విజయవాడ (క్రైం), ఫిబ్రవరి 4: నగరంలో సంచలనం రేపిన గృహిణి పద్మావతి దారుణ హత్య కేసు మిస్టరీ వీడింది. ఘటన జరిగిన సుమారు 50గంటల్లోనే కేసును ఛేదించిన పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. దోపిడీ సమయంలో ప్రతిఘటించినందునే మహిళ బలైందని, అంతకుముందు కూడా ఇదే తరహా ఘటనకు నిందితుడు పాల్పడినట్లు పోలీసు కమిషనర్ సీహెచ్ ద్వారకాతిరుమలరావు తెలిపారు.

02/05/2020 - 04:40

హైదరాబాద్, ఫిబ్రవరి 4: సికిందరాబాద్ గాంధీ ఆసుపత్రిని మంగళవారం ఉన్నతాధికారుల బృందం సందర్శించింది. ఒకవైపు ప్రపంచాన్ని కరోనా వైరస్ గడగడలాడిస్తున్న నేపథ్యంలో గాంధీ ఆసుపత్రికి అనుమానిత లక్షణాలతో వచ్చే వారికి పరీక్షలు నిర్వహించేందుకు, వైద్యం అందించేందుకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కరోనా వార్డును పరిశీలించారు.

02/05/2020 - 04:40

రాజేంద్రనగర్, ఫిబ్రవరి 4: మద్యం మత్తులో ఇద్దరిని ఓ కారు డ్రైవర్ ఢీకొట్టాడు. ఈ ఘటనలో తల్లికూతుళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన రాజేంద్రనగర్ పోలీసుస్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు కథనం ప్రకారం.. కారులో అబ్దుల్ వాజీద్ జీషన్(27) అనే వ్యక్తి మద్య సేవించి కారు నడిపాడని తెలిపారు.

02/05/2020 - 06:22

హైదరాబాద్: వివిధ ప్రభుత్వ శాఖల అధికారుల అవినీతిపై ప్రజలు ఎంత తీవ్రమైన ఆగ్రహాం వ్యక్తం చేస్తున్నా, అవినీతికి ఏ మాత్రం అడ్డుకట పడటం లేదు. కొద్దిరోజుల క్రితం ఏకంగా మిలిటరీ మేజర్‌నే లంచం అడిగిన జీహెచ్‌ఎంసీ ట్యాక్సు ఇన్‌స్పెక్టర్ ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికిపోగా, ఇపుడు కంటోనె్మంట్‌లోని ఎలక్ట్రిక్ విభాగంలో లైన్‌మెన్‌గా పనిచేస్తున్న ఉద్యోగి రూ.4వేల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు.

02/05/2020 - 04:32

హైదరాబాద్: హైదరాబాద్ నగరంలో నకిలీ నోట్లు తయారు చేస్తున్న ముఠా గుట్టు రట్టయింది. రెండు ముఠాలకు చెందిన మొత్తం 13 మందిని సౌత్, నార్త్ జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. బషీర్‌బాగ్‌లోని నగర పోలీస్ కమిషనరేట్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో సీపీ అంజనీ కుమార్ కేసుకు సంబంథించిన వివరాలను వెల్లడించారు.

02/04/2020 - 06:35

గజ్వేల్, జగదేవ్‌పూర్: బాలికపై సామూహిక అత్యాచారం కేసులో ముగ్గురికి యావజ్జీవ శిక్ష విధించడంతో పాటు రూ. 10వేల వంతున జరిమానా విధిస్తూ కోర్టు తీర్పు చెప్పింది. గజ్వేల్ ఏసీపీ నారాయణ సోమవారం ప్రజ్ఞాపూర్‌లోని ఏసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో సంఘటనకు సంబందించి వివరాలు అందించారు.

Pages