S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

02/02/2020 - 04:34

తోట్లవల్లూరు, ఫిబ్రవరి 1: కరకట్ట మీద నుంచి అదుపుతప్పి కేఈబీ కెనాల్‌లోకి దూసుకెళ్ళి ఒకరు మృతి చెందిన సంఘటన మండలంలోని చాగంటిపాడు సమీపంలో శనివారం సాయంత్రం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఆంధ్ర ఆస్పత్రిలో పని చేస్తున్న డాక్టర్ కోసూరు శ్రీనివాసరావు భార్య రమ్య, కుమారుడు అస్రుత్‌తో కలిసి కరకట్ట మీదుగా కారులో అవనిగడ్డ ఫంక్షన్‌కు బయలుదేరాడు.

02/02/2020 - 04:18

జీడిమెట్ల, ఫిబ్రవరి 1: నడుచుకుంటూ వెళ్తున్న ఓ మహిళ మెడలోబంగారు గెలుసును తస్కరించిన సంఘటన జీడిమెట్ల పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. వివరాల్లోకి వెళితే.. కుత్బుల్లాపూర్ సర్కిల్ పరిధిలోని పట్వారీ ఎన్‌క్లేవ్‌లో నివాసముండే సంధ్య (32) శనివారం ఉదయం ఐడీపీఎల్‌కు వాకింగ్‌కు వెళ్లింది.

02/02/2020 - 03:31

ఖైరతాబాద్, ఫిబ్రవరి 1: గంజాయిని విక్రయించేందుకు యత్నించిన ముగ్గురు యువకులను పంజాగుట్ట పోలీసులు అరెస్టు చేసి వారి వద్ద నుంచి కిలో గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కధనం ప్రకారం.. మల్కాజ్‌గిరిలో నివాసం ఉండే ప్రమోద్‌కుమార్, కుత్బుల్లాపూర్‌లో నివాసం ఉండే జ్ఞాన ప్రసాద్, జీ.నిఖిల్ రాజ్‌లు గంజాయిని విక్రయించేందుకు అమీర్‌పేటకు చేరుకున్నారు.

02/02/2020 - 03:29

ఖైరతాబాద్, ఫిబ్రవరి 1: తాను చేసిన పనికి డబ్బులు చెల్లించక పోవడంతో ఓ భవన నిర్మాణ కాంట్రాక్టర్ నిర్మిస్తున్న భవనంలోనే ఆత్మహత్య చేసుకొని మృతి చెందిన సంఘటన పంజాగుట్ట పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం ఎల్లమ్మబండ, కూకట్‌పల్లిలో నివాసం ఉండే కాంట్రాక్టర్ అబ్దుల్ నబీ గత నాలుగు నెలల క్రితం ఎంఎస్ మక్తా రాజ్‌నగర్‌లోని సలీమ్ ఇంటిని నిర్మించేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాడు.

02/02/2020 - 22:02

న్యూఢిల్లీ: నిర్భయ గ్యాంగ్‌రేప్, హత్య కేసులో నలుగురు ముద్దాయిలకు పడిన ఉరిశిక్ష అమలును నిరవధికంగా వాయిదా వేస్తూ ట్రయల్ కోర్టు జారీ చేసిన ఆదేశాలను సవాలు చేస్తూ కేంద్ర ప్రభుత్వం శనివారం ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్‌ను అత్యవసరంగా విచారించాలని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి డీఎన్ పటేల్‌ను కోరింది.

02/01/2020 - 21:58

న్యూఢిల్లీ: నిర్భయ గ్యాంగ్‌రేప్, హత్య కేసులో నలుగురు ముద్దాయిల ఉరిశిక్ష అమలును ఢిల్లీ కోర్టు వాయిదా వేసింది. తదుపరి ఆదేశాలు జారీ చేసేంత వరకు వీరి ఉరిశిక్షను వాయిదా వేస్తున్నట్టు శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది.

02/01/2020 - 21:56

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ఆదాయానికి మించిన ఆస్తుల కేసుల్లో శుక్రవారం నాడు మాజీ ఐఎఎస్‌లు , పారిశ్రామిక వేత్తలు సీబీఐ- ఈడీ ప్రత్యేక న్యాయస్థానం ముందు హాజరయ్యారు. శుక్రవారం నాడు కోర్టు ముందు హాజరుకాకుండా వైఎస్ జగన్మోహన్‌రెడ్డి మినహాయింపు పొందారు.

01/31/2020 - 07:09

న్యూఢిల్లీ: నిర్భయ గ్యాంగ్‌రేప్, హత్య కేసులో మరణశిక్ష ఖరారయిన ముద్దాయిల్లో ముగ్గురు గురువారం మరో అడుగు వేశారు. తమకు ఉపశమనం కలిగించేందుకు న్యాయపరంగా మిగిలి ఉన్న అవకాశాలను తాము వినియోగించుకునేందుకు వీలుగా తమకు విధించిన ఉరిశిక్ష అమలును నిరవధికంగా వాయిదా వేయాలని కోరుతూ వారు ట్రయల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

01/31/2020 - 06:46

నూజివీడు, జనవరి 30: స్థానిక సిద్దార్థ ఫార్మశీ కళాశాలలో బి ఫార్మశి చదువుతున్న విద్యార్థి గురువారం ఆత్మహత్య చేసుకుంది. ఆగిరిపల్లి మండలం ఈదర గ్రామానికి చెందిన మందా రాజు విజయవాడలో అంబులెన్స్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. రాజు కుమార్తె శైలు (19) స్థానిక ఫార్మశీ కళాశాలలోని వసతి గృహంలో ఉంటూ బి ఫార్మశి రెండో సంవత్సరం చదువుతోంది. గురువారం ఉదయం యధావిధిగా తరగతులకు వచ్చింది.

01/31/2020 - 06:46

పామర్రు, జనవరి 30: మండల పరిధిలోని బల్లిపర్రు అడ్డరోడ్డు వద్ద విజయవాడ-మచిలీపట్నం జాతీయ రహదారిపై అతి వేగంతో వెళుతున్న కారు సమీపంలోని డివైడర్ కల్వర్టును గురువారం ఢీకొనగా పల్టీ కొట్టి పక్కన ఉన్న బోదెలో పడిపోయింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న మచిలీపట్నంకు చెందిన ఫొటో గ్రాఫర్ గురజాల సుధాకర్ (36) అక్కడికక్కడే మృతి చెందాడు. మరో ఇద్దరు జగదీష్, ప్రభాకరరావులు తీవ్రంగా గాయపడ్డారు.

Pages