S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

08/11/2018 - 01:51

న్యూఢిల్లీ, ఆగస్టు 10: బిహార్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లోని శరణాలయాలో ఉంటున్న మహిళలు, బాలికలపై జరుగుతున్న అత్యాచారాలు, లైంగిక వేధింపులపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన సుప్రీం కోర్టు వాటికి అంతం ఎప్పుడని ఆహ్రంతో ప్రశ్నించింది.

08/11/2018 - 01:36

మహబూబ్‌నగర్, ఆగస్టు 10: : ప్రేమించిన అమ్మాయిని తీసుకొని వెళ్లిన స్నేహితుడి వివరాలు చెప్పాలని పోలీసులు ఒత్తిడి తేవడంతో ఓ యువ కుడు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మహబూబ్‌నగర్ జిల్లాలో చోటుచేసుకుం ది. వివరాల్లోకి వెళ్తే.. జిల్లాలోని మాచన్‌పల్లికి చెం దిన శ్రీకాంత్, అంజి చిన్ననాటి నుంచి స్నేహితులు. అంజి ఓ యువతిని ప్రేమించి ఎక్కడికో తీసుకె ళ్లాడు.

08/11/2018 - 00:59

న్యూఢిల్లీ, ఆగస్టు 10: దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఆరుషి, సేవకుడు హేమరాజ్ హత్య కేసులో దంత వైదులు రాజేష్, నుపూర్ తల్వార్‌ను విడుదల చేయడాన్ని సవాలు చేస్తూ సీబీఐ దాఖలుచేసిన పిటిషన్‌ను విచారించేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. ఈ కేసులో నిందితులను నిర్దోషులుగా విడుదల చేస్తూ అలహాబాద్ హైకోర్టు గత ఏడాది జారీ చేసిన ఆదేశాలను సవాలు చేస్తూ సేవకుడు హేమరాజ్ భార్య కూడా పిటిషన్ దాఖలు చేసింది.

08/11/2018 - 00:58

గౌహతి, ఆగస్టు 10: కేంద్ర రైల్వేశాఖ సహాయ మంత్రి రాన్ గోహైన్‌పై అత్యాచారం కేసు నమోదైంది. 1999 నుంచి బీజేపీ ఎంపీగా ఉంటున్న ఆయనపై ఈ నెల 2వ తేదీన 26 ఏళ్ల యువతి ఫిర్యాదు చేసినట్లు నాగాన్‌పోలీసులు చెప్పారు. తనపై కేంద్ర మంత్రి గోహైన్ అత్యాచారానికి పాల్పడినట్లు ఆ యువతి ఫిర్యాదు చేసిందని పోలీసులు చెప్పారు. ఈ కేసులో కేంద్ర మంత్రి వయస్సు 68 సంవత్సరాలు.

08/11/2018 - 04:33

న్యూఢిల్లీ: నల్లగొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి విద్యార్హతలపై తప్పుడు సమాచారం ఇచ్చారని, ఆయన ఎన్నిక చెల్లదని ప్రకటించాలంటూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు శుక్రవారం కొట్టివేసింది. ఒక వ్యక్తి చదవడానికి, ఉత్తీర్ణత పొందడానికి మధ్య తేడాపై సుప్రీంకోర్టు స్పష్టతను ఇచ్చింది.

08/11/2018 - 04:34

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో మరో దారుణం చోటుచేసుకుంది. పసిపిల్లలపై అత్యాచారం జరిపితే ఉరిశిక్ష తప్పదని ఇటీవలే కఠిన చట్టం తెచ్చినా పరిస్థితిలో ఎలాంటి మార్పు రాలేదని ఈ తాజా ఉదంతంతో తేటతెల్లమవుతోంది. రెండో తరగతి చదువుతున్న ఓ బాలికపై పాఠశాల ప్రాంగణంలోనే పట్టపగలు మూడు పదులు దాటిన ఓ కామాంధుడు అత్యాచారానికి పాల్పడ్డాడు.

08/10/2018 - 23:40

వంగూరు, ఆగస్టు 10: మండల పరిధిలోని ఉప్పలపహాడ్ గ్రామానికి చెందిన అభంశుభం తెలియని ఎనిమిదేళ్ల చిన్నారిపై అదే గ్రామానికి చెందిన దేవయ్య(52) అనే వ్యక్తి కామంతో కళ్లుమూసుకొని పోయి గురువారం రాత్రి అత్యాచార యత్నానికి పాల్పడ్డాడు.

08/10/2018 - 22:41

మడకశిర, ఆగస్టు 10 : మండల పరిధిలోని గుర్రపుకొండ మలుపు వద్ద ట్రాక్టర్ బోల్తా పడి మారుతీ (20) అక్కడికక్కడే మృతి చెందాడు. కర్నాటక బిదరకెరెకు చెందిన మారుతీ ట్రాక్టర్‌లో కంకరను పావగడలో అన్‌లోడ్ చేసి తిరిగి స్వగ్రామానికి వెళుతుండగా గుర్రపుకొండ మలుపు వద్ద ట్రాక్టర్ ముందు టైరు పంక్చర్ కావడంతో వాహనం అదుపు తప్పి ట్రాలీ బోల్తాపడింది. దీంతో అందులో కూర్చొన్న మారుతీ ట్రాలీ కింద పడి అక్కడికక్కడే మృతి చెందాడు.

08/10/2018 - 02:33

వినుకొండ, ఆగస్టు 9: గుంటూరు జిల్లా వినుకొండ సమీపంలోని పసుపులేరు బ్రిడ్జిపై గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకులు దుర్మరణం పాలయ్యారు.

08/10/2018 - 02:09

విజయవాడ (క్రైం), ఆగస్టు 9: చిత్తూరు జిల్లా పీలేరుకు చెందిన డాక్టర్ శిల్ప ఆత్మహత్య కేసుకు సంబంధించి సీఐడీ సిట్ బృందం దర్యాప్తు ప్రారంభించింది. ఎస్వీ మెడికల్ కాలేజీలో వైద్య విద్య అభ్యసిస్తూ పీజీ చేస్తున్న శిల్ప కళాశాల అక్కడి ప్రోఫెసర్ల వేధింపుల కారణంగా ఆత్మహత్యకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే.

Pages