S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

03/20/2016 - 22:44

సుశాంత్ కథానాయకుడుగా అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో శ్రీనాగ్ కార్పొరేషన్, శ్రీ జిఫిలిమ్స్ పతాకాలపై నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో చింతలపూడి శ్రీనివాసరావు, ఎ.నాగసుశీల రూపొందించిన చిత్రం ‘ఆటాడుకుందాం.. రా’ (జస్ట్ ఛిల్). ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తికావస్తున్నాయి. ఈ సందర్భంగా హీరో సుశాంత్ మాట్లాడుతూ..

03/20/2016 - 22:40

వైభవ్, రమ్యానంబీసన్ జంటగా థర్డ్ ఐ పోస్ట్ ప్రొడక్షన్స్ స్టూడియోస్ పతాకంపై బ్లాక్‌బస్టర్ మూవీమేకర్స్ నిర్మించిన చిత్రం ‘ధనాధన్’. నిర్మాణానంతర కార్యక్రమాలు పూర్తిచేసుకుని విడుదలకు సిద్ధమైన ఈ చిత్రంలోని పాటలు అందరికీ నచ్చాయని దర్శక నిర్మాతలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..

03/20/2016 - 22:24

ఇటీవలే ‘్భలేభలే మగాడివోయ్’ సినిమాతో మంచి కమర్షియల్ విజయాన్ని అందుకున్న యువ హీరో నాని ప్రస్తుతం పలు సినిమాలతో జోరుమీదున్నాడు. ఇప్పటికే ఆయన ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా తర్వాత నాని తదుపరి చిత్రం ఖరారైంది. ‘ఉయ్యాల జంపాల’ సినిమాతో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న విరించి వర్మ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కనుంది.

03/20/2016 - 22:23

పూజాగాంధీ, రఘుముఖర్జీ ప్రధాన తారాగణంగా వెంకట్ మూవీస్ పతాకంపై శ్రీనివాసరాజు దర్శకత్వంలో రూపొందిన ‘దండుపాళ్యం’ చిత్రం సంచలన విజయం సాధించడంతో ఇప్పుడు దానికి సీక్వెల్‌గా ‘దండుపాళ్యం-2’ చిత్రాన్ని రూపొందించనున్నారు.

03/20/2016 - 22:18

రామ్‌కార్తీక్, కశ్మీరా కులకర్ణి జంటగా పుష్యమి ఫిలిమ్‌మేకర్స్ పతాకంపై బెల్లం రామకృష్ణారెడ్డి స్వీయ దర్శకత్వంలో రూపొందించిన ‘దృశ్యకావ్యం’ చిత్రం ఇటీవల విడుదలై మంచి టాక్‌తో రన్ అవుతున్న సందర్భంగా ఆదివారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన సక్సెస్‌మీట్‌లో ప్రముఖ నటుడు శ్రీకాంత్ మాట్లాడుతూ, తాను నటించిన ‘వీడికి దూకుడెక్కువ’ చిత్రాన్ని నిర్మించిన రామకృష్ణ ఈ సినిమాతో దర్శకుడిగా మారి చేసిన ప్రయత్నం మంచి ఫలితాన

03/19/2016 - 21:40

నాగార్జున, కార్తీ, తమన్నా ప్రధాన తారాగణంగా పి.వి.పి. సినిమా పతాకంపై వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో పరమ్ వి.పొట్లూరి, కవిన్ అనె్న రూపొందించిన భారీ మల్టీస్టారర్ చిత్రం ఊపిరి. సెన్సార్ కార్యక్రమాలు పూర్తిచేసుకుని ఈనెల 25న విడుదలకు సిద్ధమైంది. భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం గురించి నిర్మాత మాట్లాడుతూ..

03/19/2016 - 21:38

పవన్‌కళ్యాణ్, కాజల్ జంటగా బాబి దర్శకత్వంలో రూపొందిస్తున్న చిత్రం ‘సర్దార్ గబ్బర్‌సింగ్’. ఈ చిత్రానికి సంబంధించి పోస్ట్‌ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. సినిమా ఆడియో విడుదల నేడు హైదరాబాద్‌లో జరగనుంది.

03/19/2016 - 21:36

టాలెండెడ్ దర్శకులను పట్టుకోవడంలో చైతూ అందరికంటే ఓ మెట్టుపైనే ఉన్నాడు. చైతూ మంచి హిట్ పాటలలోని పదాలతో తన సినిమాలకు టైటిల్స్ పెట్టేసి ఈజీగా క్యాచీ టైటిల్స్ పట్టేస్తున్నాడు. తన మొదటి హిట్ ‘ఏ మాయ చేసావే’ కూడా ‘ఒక్కడు’ చిత్రంలోని ‘నువ్వేం మాయ చేసావో గాని..’ అనే పాట నుండి తీసుకున్నదే. ఆ తర్వాత ఆయన తన తాత నటించిన ‘రాముడు కాదు కృష్ణుడు’ చిత్రంలోని ‘ఒక లైలా కోసం’ను టైటిల్‌గా మార్చేసుకున్నాడు.

03/19/2016 - 21:34

తమిళ స్టార్ సూర్య మూడు విభిన్న గెటప్‌లలో నటిస్తున్న సైన్స్ ఫిక్షన్ మూవీ ‘24’. ఈ చిత్రానికి ‘మనం’ ఫేమ్ విక్రమ్ కె.కుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్‌లుక్ ఫొటోస్, టీజర్స్ అందరిలో ఆసక్తిని పెంచాయి. కాగా ఈ చిత్రాన్ని వేసవి కానుకగా విడుదల చేసేందుకు రెడీ అవుతున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం పోస్ట్‌ప్రొక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి.

03/19/2016 - 21:31

అల్లు అర్జున్ కథానాయకుడిగా, సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో సూపర్ డూపర్ హిట్స్‌ని అందించిన ప్రతిష్ఠాత్మక గీతా ఆర్ట్స్ బ్యానర్‌లో విజయవంతమైన చిత్రాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన అల్లు అరవింద్ నిర్మాణంలో తెరకెక్కిస్తున్న చిత్రం ‘సరైనోడు’. తమన్ సంగీతమందిస్తున్న ఈ చిత్ర పాటల్ని ఏప్రిల్ 1న నేరుగా మార్కెట్లోకి విడుదల చేయనున్నట్లు నిర్మాతలు ప్రకటించారు.

Pages