S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

03/15/2016 - 23:48

నిజానికి ‘ఊపిరి’ సినిమా చేయడానికి సంవత్సరం పట్టింది. అలాగే ‘బాహుబలి’ సినిమా కూడా ఇంకెంత టైమ్ పడుతుందో తెలియదు. ఒకేసారి పది సినిమాల్లో నటించాలని కోరిక నాకు లేదు. నాకు నచ్చిన కథలతో నచ్చిన పాత్రలుంటే చేస్తా.

03/15/2016 - 23:17

‘కుమారి 21ఎఫ్’ సినిమాతో సంచలనం సృష్టించిన హెబాపటేల్ తాజా గా మరో చిత్రంలో నటిస్తోంది. పలు విజయవంతమైన చిత్రాల్ని నిర్మించిన లక్కీ మీడియా పతాకంపై బెక్కం వేణుగోపాల్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. యూత్‌ఫుల్ లవ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కే నేను నా బాయ్ ఫ్రెండ్స్ బండి భాస్కర్ దర్శకత్వం వహిస్తాడు.

03/15/2016 - 22:57

చిరంజీవి నటిస్తున్న 150వ చిత్రం గురించి ఇన్నాళ్లు కథాకథనాలు అనేకం వినిపించాయి. కొంతమంది ఆ సినిమా వస్తుందా రాదా అన్న మీమాంసలో కూడా వుండిపోయారు. ఎట్టకేలకు తమిళంలో విజయవంతమైన ఓ చిత్రానికి రీమేక్‌గా చిరంజీవి 150వ చిత్రం సెట్స్‌పైకి వెళ్లనుంది. అయితే ఈ చిత్రంలో కథానాయిక ఎవరా అని అభిమానులు ఎదురుచూశారు. ఆ వార్త కూడా తెలిసిపోయింది.

03/15/2016 - 22:25

హ్యాట్రిక్ విజయంతో జోరుమీదున్న రాజ్‌తరుణ్‌కు ఇప్పుడు చేతినిండా అవకాశాలున్నాయి. ఇప్పటికే మంచువిష్ణుతో కలిసి నటిస్తున్న సినిమా దాదాపు పూర్తికావచ్చింది. ఈ చిత్రానికి ‘వీడు అదో టైపు.. వాడు మరోటైపు’ అనే టైటిల్‌ను ఖరారు చేసినట్టు తెలిసింది. దీంతోపాటు సీనియర్ దర్శకుడు వంశీ దర్శకత్వంలో ఓ సినిమాలో కూడా నటిస్తున్నాడు.

03/15/2016 - 22:16

డోనీ ఎన్, చోయున్‌ఫాట్, అరోన్‌క్వాక్ ప్రధాన తారాగణంగా విఘ్నేశ్వర ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సిహెచ్.సతీష్‌కుమార్ అందిస్తున్న చిత్రం ‘ది మంకీ కింగ్’. ఈ చిత్రాన్ని తెలుగు, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో ఈనెల 18న విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ, 500 కోట్ల భారీ బడ్జెట్‌తో చైనాలో నిర్మాణం జరుపుకున్న ఈ చిత్రాన్ని తెలుగు, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో క్వాలిటీతో అనువాదం చేశామని తెలిపారు.

03/15/2016 - 22:14

సతీష్‌బాబు, మెరీనా అబ్రహం జంటగా రాజు కుంపట్ల దర్శకత్వంలో రిషి ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై జనార్దన్ మందుముల నిర్మిస్తున్న చిత్రం ‘రొమాన్స్ విత్ ఫైనాన్స్’.

03/15/2016 - 22:12

1956లో ప్రారంభమైన సారథి స్టోడియో అనేక వందల చిత్రాలకు నెలవుగా ఇన్నాళ్లు సేవలు అందించింది. ఇప్పుడు మళ్లీ 60 సంవత్సరాల తర్వాత నేటి చిత్రీకరణ పద్ధతులకు అనుగుణంగా తీర్చిదిద్ది పరిశ్రమకు అంకితం చేశారు. ఈ పునరంకిత కార్యక్రమంలో దాసరి నారాయణరావు మాట్లాడుతూ, తెలుగు సినిమా పదానికి ఉపమానంగా సారథి స్టూడియో నిలిచిందని, ఎటువంటి లాభాపేక్ష లేకుండా ఈ స్టూడియోను మళ్లీ పునరంకితం చేయడం అభినందనీయమని తెలిపారు.

03/15/2016 - 22:03

సాయిబాబాగా ‘షిరిడీ సాయి మహత్యం’ చిత్రంలో నటించి, తెలుగు ప్రేక్షకుల ఆదరాభిమానాలు చూరగొన్న నటుడు విజయ్‌చందర్, దాదాపు 33 సంవత్సరాల తర్వాత మళ్లీ బాబా పాత్రలో నటిస్తున్నారు. శ్రీ మల్లాది వెంకటేశ్వర ఫిలిమ్స్ పతాకంపై జి.ఎల్.బి.శ్రీనివాస్ స్వీయ దర్శకత్వంలో రూపొందుతున్న ‘సాయే దైవం’ చిత్రం హైదరాబాద్‌లోని సాయిబాబా గుడిలో ప్రారంభమైంది.

03/14/2016 - 04:52

ఈమధ్యే ‘ఆషిఖి-2’ సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చి మొదటి చిత్రంతోనే స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది బాలీవుడ్ భామ శ్రద్ధాకపూర్. ఆ సినిమా తర్వాత రెండు మూడు చిత్రాలు చేసినా కూడా ఈమెకు పెద్దగా బ్రేక్ రాలేదు. దాంతో ఇప్పుడు గ్లామర్ పైనే శ్రద్ధ పెట్టింది. ప్రస్తుతం తెలుగులో సూపర్‌హిట్ అయిన ‘వర్షం’ చిత్రాన్ని ‘్భగి’ పేరుతో హిందీలో రీమేక్ చేస్తున్నారు.

03/14/2016 - 04:52

వినీత్, మోనికాసింగ్ జంటగా వి2 ఫిలిమ్స్ పతాకంపై రామ్మోహన్ సిహెచ్. దర్శకత్వంలో అశోక్‌గోటి నిర్మిస్తున్న చిత్రం ‘పిడుగు’. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని ఈనెల 18న ఈ చిత్రం విడుదలవుతున్న సందర్భంగా చిత్ర కథానాయకుడు వినీత్ చెప్పిన విశేషాలు ఆయన మాటల్లోనే...

Pages