S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

03/14/2016 - 04:51

విభిన్నమైన పాత్రల్లో నటిస్తూ స్టార్ హీరోగా వెలుగొందుతున్న సూర్య హీరోగా విక్రమ్‌కుమార్ దర్శకత్వంలో గ్లోబల్ సినిమాస్, 2డి ఎంటర్‌టైన్‌మెంట్స్, శ్రేష్ఠ్ మూవీస్ పతాకాలపై కె.ఇ.జ్ఞానవేల్ రాజా సమర్పిస్తున్న చిత్రం ‘24’. ఈ చిత్రంలోని ఒక పాటను ఆదివారం విడుదల చేశారు. ఎ.ఆర్.రెహమాన్ సంగీతం అందిస్తున్న ‘కాలం నా ప్రేయసి’ అనే పాటను రచయిత చంద్రబోస్ రాశారు.

03/14/2016 - 04:50

శ్రీ వినాయక క్రియేషన్స్ పతాకంపై సుజయ్, శే్వతానీల్, వినయ్‌తేజ్ ప్రధాన తారాగణంగా ఆర్.వరుణ్‌దొర దర్శకత్వంలో ఆర్.వి.నారాయణరావు, ఆర్.బి.ఆర్య రూపొందిస్తున్న చిత్రం ‘ప్రేమాంజలి’ (ఓ ప్రేమ జంట కథ). ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా దర్శకుడు దొర మాట్లాడుతూ, ప్రేమంటే ఓ బంధం కాదని, ప్రేమంటే ఓ బాధ్యత అనే అంశంతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నామని తెలిపారు.

03/14/2016 - 04:49

సమంత అంటే తెలుగులో టాప్‌స్టారే. కిందపడ్డా పైన పడ్డా ఆమెదే విజయం అన్నట్టుగా సమంత హవా సాగుతోంది. ఇటీవల దాదాపుగా ఓ నాలుగైదు నెలల నుండి సమంత పేరు ఎక్కడా వినబడకపోవడం విచిత్రం. ఎందుకంటే ఆమె సినిమాలేవీ విడుదల కాలేదు. ఒకవేళ విడుదలైనా కానీ అవి సోదిలో లేకుండాపోవడంతో సమంత పేరు వినబడలేదు. కానీ ఇప్పుడలా కాదు ఈ వేసవి కాలమంతా నాదేనంటోంది సమంత.

03/14/2016 - 04:48

కాస్టింగ్ డైరక్టర్ సత్యానంద్

03/14/2016 - 04:47

ప్రముఖ నటుడు పవన్‌కళ్యాణ్ హీరోగా నటిస్తున్న ‘సర్దార్ గబ్బర్‌సింగ్’ చిత్రం షూటింగ్ దాదాపు చివరి దశకు చేరుకుంది. బాబి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ఏప్రిల్ 8న విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. మరోవైపు ఈ చిత్రంలోని పాటలను ఈనెల 20న భారీ స్థాయిలో విడుదల చేస్తారట. ఇప్పటికే భారీ అంచనాలు నెలకొల్పిన ఈ చిత్రం బిజినెస్ వర్గాల్లో సంచలనం సృష్టిస్తోంది.

03/14/2016 - 04:47

హీరోగా టాలీవుడ్‌లో మంచి క్రేజ్ తెచ్చుకున్న జగపతిబాబుకు ఈమధ్య చేసిన సినిమాలన్నీ వరుసగా అపజయాలు అవుతుండడంతో ఆయన విలన్‌గా టర్న్ తీసుకున్న విషయం తెలిసిందే. ‘లెజెండ్’ సినిమాతో నటుడిగా ఆకట్టుకున్న జగపతిబాబు ఇప్పుడు విలన్ పాత్రలకు ఫిక్స్ అయ్యాడు. తాజాగా ఆయన ఓ తమిళ క్రేజీ చిత్రంలో విలన్‌గా నటించేందుకు రెడీ అయ్యాడు.

03/13/2016 - 02:58

తెలుగు, తమిళ భాషల్లో టాప్ హీరోయిన్‌గా వెలుగొందుతున్న అందాల భామ కాజల్‌కు ఇప్పుడు అవకాశాలు కూడా క్యూ కట్టాయి. తెలుగులో స్టార్ హీరోల సరసన నటిస్తున్న ఈమెకు తాజాగా తమిళంలో క్రేజీ అవకాశం దక్కింది. ఎన్టీఆర్ హీరోగా పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో వచ్చిన ‘టెంపర్’ చిత్రాన్ని తమిళంలో రీమేక్ చేస్తున్నారు. శింబు హీరోగా నటించే ఈ చిత్రంలో హీరోయిన్‌గా కాజలే ఎంపికైందట.

03/13/2016 - 02:58

జీవా, హన్సిక జంటగా రామ్‌ప్రకాష్ రాయప్ప దర్శకత్వంలో సాయిగీతా ఆర్ట్స్ పతాకంపై మలిరెడ్డి వీరవెంకట సత్యనారాయణ, హనీప్రమోద్, శ్రీనులు నిర్మిస్తున్న చిత్రం ‘పోకిరి రాజా’. ‘్ఫన్ ఆఫ్ విండ్’ ట్యాగ్‌లైన్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఈనెల 25న విడుదల కానుందన్నారు.

03/13/2016 - 02:56

‘పందెం కోడి’ సినిమా తర్వాత విశాల్ కెరీర్‌లో పెద్దగా చెప్పుకోదగ్గ సినిమాలు లేవనే చెప్పాలి. తమిళంలో మంచి క్రేజ్ తెచ్చుకున్నా తెలుగులో మాత్రం ఇంకా ప్రయత్నాలు సాగిస్తూనే ఉన్నాడు. సొంతంగా విశాల్ ఫిలిమ్ ఫ్యాక్టరీ బ్యానర్‌ను స్థాపించి, విభిన్నమైన కథనాలతో సినిమాలు చేస్తూ వస్తున్నాడు. లేటెస్ట్‌గా విడుదలైన ‘కథకళి’ చిత్రం తమిళంలో మంచి హిట్‌ను నమోదు చేసుకుంది. ఈనెల 18న ఈ చిత్రం తెలుగులో విడుదల కానుంది.

03/13/2016 - 02:56

కార్తీక్, కశ్మీరా కులకర్ణి జంటగా బెల్లం రామకృష్ణారెడ్డి దర్శకత్వంలో పుష్యమి ఫిలిం మేకర్స్ పతాకంపై శివనాగేంద్రప్రసాద్ నిర్మించిన చిత్రం ‘దృశ్యకావ్యం’. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ చిత్రం ఈనెల 18న విడుదలవుతున్న సందర్భంగా దర్శకుడు రామకృష్ణారెడ్డి చెప్పిన విశేషాలు.. ఆయన మాటల్లోనే..

Pages