S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

09/11/2016 - 21:03

బుల్లితెరపై ‘వెనె్నల’ కార్యక్రమం ద్వారా ప్రేక్షకులకు పరిచయమైన జయతి కథానాయికగా నటిస్తున్న చిత్రం లచ్చి. జె 9 4షోస్ పతాకంపై ఈశ్వర్ దర్శకత్వంలో జయతి రూపొందిస్తున్న ఈ సినిమాను అక్టోబర్‌లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. పూరి జగన్నాథ్ అతిథిగా విచ్చేసి లచ్చి ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు.

09/11/2016 - 21:01

గ్లామర్ భామ తాప్సీ ప్రస్తుతం బాలీవుడ్‌లో వరుస సినిమాలు చేస్తూ జోరుమీదుంది. హీరోయిన్‌గా సౌత్‌లో ఎంట్రీ ఇచ్చిన ఈమెకు పెద్దగా కమర్షియల్ విజయాలు దక్కలేదు. దాంతో బాలీవుడ్‌కు మకాం మార్చింది. ఈమధ్యే ఓ అభిమాని వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నానని చెబుతోంది. ఆ వివరాల్లోకెళితే ఓ సైకో తనను చాలాకాలం వెంబడించాడని చెప్పింది. అభిమానం ఉంటే బాగానే వుంటుంది కానీ, హద్దులు దాటితేనే సైకోల్లా మారతారని చెబుతోంది.

09/11/2016 - 04:51

తరుణ్, ఓవియా జంటగా రామ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ రమేష్ గోపీ దర్శకత్వంలో ఎస్.వి.ప్రకాష్ రూపొందిస్తున్న చిత్రం ‘ఇది నా లవ్‌స్టోరి’. షూటింగ్ ముగిశాక పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్న సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ, లడఖ్, కులుమనాలిలో చిత్రీకరించిన పాటలు హైలెట్‌గా వుంటాయని, తరుణ్ నటించిన మూడు పాత్రలు ఆకట్టుకుంటాయని తెలిపారు.

09/11/2016 - 04:49

రజిత్, షామిలి జంటగా వశిష్ఠ సినీ అకాడమీ పతాకంపై రాము దర్శకత్వంలో ప్రభాత్‌వర్మ రూపొందిస్తున్న చిత్రం ‘శ్రీరామరక్ష’. దీనికి సంబంధించి టాకీపార్ట్ మొత్తం పూర్తిచేశారు.

09/11/2016 - 04:47

విష్ణురెడ్డి, అభిరామ్, సంజన, అశోక్ ప్రధాన తారాగణంగా పంచాక్షరి పిక్చర్స్ పతాకంపై డా.గౌతమ్ దర్శకత్వంలో పద్మజానాయుడు రూపొందిస్తున్న చిత్రం ‘త్రయం’. సెన్సార్ కార్యక్రమాలు పూర్తిచేసిన సందర్భంగా దర్శక, నిర్మాతలు మాట్లాడుతూ, ముగ్గురు వైవిధ్యమైన వ్యక్తిత్వం వున్న మనుషుల కథనం నేపథ్యంలో చిత్రం సాగుతుందని, సినిమాను వీలైనంతవరకూ రియలిస్టిక్‌గా రూపొందించే ప్రయత్నం చేశామని తెలిపారు.

09/11/2016 - 04:44

అందాల తార రేష్మిగౌతమ్‌తో హీరోగా నటిస్తుండడంతో తనకు పరిశ్రమలో మరింత క్రేజ్ పెరిగిందని నూతన నటుడు రాజ్‌బాల తెలిపారు. లవ్‌బూమ్, 7 టు 4 చిత్రాలతో ఎదిగిన ఆయన తన మనసులోని మాట తెలియజేశారు. చాలామంది స్టార్ హీరోలను తెరపై చూసి, ఆ ప్రభావంతో పరిశ్రమకు వచ్చానని, సినిమాలపై ఇష్టంతో నటనను కెరీర్‌గా ఎంచుకున్నానని అన్నారు.

09/11/2016 - 04:42

శ్రీకాంత్ తనయుడు రోషన్‌ని హీరోగా పరిచయం చేస్తూ జి.నాగకోటేశ్వరరావు దర్శకత్వంలో అన్నపూర్ణ స్టూడియోస్, మ్యాట్రిక్స్ టీమ్ వర్క్స్ బేనర్స్‌పై కానె్సప్ట్ ఫిలింస్ ప్రొడక్షన్ ఆధ్వర్యంలో నిమ్మగడ్డ ప్రసాద్, అక్కినేని నాగార్జున సంయుక్తంగా నిర్మిస్తున్న ప్రెష్ అండ్ ప్యూర్ టీనేజ్ లవ్‌స్టోరీ చిత్రం ‘నిర్మలా కానె్వంట్’.

09/11/2016 - 04:40

అందాల ప్రదర్శనలో బాలీవుడ్ భామల రూటే వేరు. కొత్త కొత్త భంగిమల్లో ఫొటోలకి ఫోజులిస్తూ ‘అందం చూడవయా..’ అంటూ ఆకర్షిస్తుంటారు. ప్రియాంకా చోప్రా ఓ సీనియర్ నటి. ఆ లెక్కన ఆమెని తెరపై చూసి చూసి కుర్రాళ్లకి బోర్‌కొట్టిపోవాలి. ఇంకేం చూస్తాం ఆ అమ్మాయిని అంటూ మొహం తిప్పుకోవాలి. కానీ, ఇక్కడ మాత్రం సీన్ రివర్స్ చేసింది పిసి.

09/11/2016 - 04:38

లంకాల బుచ్చిరెడ్డి సమర్పణలో సాగర్, రాగిణి నంద్వాణి, సాక్షిచౌదరి హీరో హీరోయిన్లుగా రామదూత క్రియేషన్స్ బ్యానర్‌పై కె.వి.దయానంద్‌రెడ్డి దర్శకత్వంలో దాసరి కిరణ్‌కుమార్ నిర్మిస్తున్న ‘సిద్ధార్థ’ విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా హీరోయిన్ రాగిణి నంద్వాణి సిద్ధార్థ సినిమా గురించి విశేషాలను తెలిపారు. ఆ వివరాలు ఆమె మాటల్లోనే...

09/11/2016 - 04:35

దక్షిణాది సినిమారంగంలో నటి నిత్యామీనన్‌కు ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో అద్భుతమైన నటిగా పేరు తెచ్చుకున్న ఆమె ‘జనతా గ్యారేజ్’, ‘ఇంకొక్కడు’ తర్వాత ఓ క్రేజీ ప్రాజెక్టుకు రంగం సిద్ధం చేసుకున్నారు. వెంకటేష్ హీరోగా దర్శకుడు కిషోర్ తిరుమల తెరకెక్కించే సినిమాలో నిత్యామీనన్ హీరోయిన్‌గా నటించనున్నారు. ఈ విషయాన్ని నిత్యామీనన్ స్వయంగా ప్రకటించారు.

Pages