S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

11/23/2015 - 05:39

అక్కినేని నాగచైతన్య
విభిన్న కథా చిత్రాలతో ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటూ ముందుకు సాగుతున్నాడు నాగచైతన్య. ప్రస్తుతం ఆయన హీరోగా నటిస్తున్న ‘సాహసం శ్వాసగా సాగిపో’ చిత్రం త్వరలో విడుదలకు సిద్ధంగా వుంది. దీంతోపాటు చందు మొండేటి దర్శకత్వంలో ప్రేమమ్ సినిమా డిసెంబర్ నుండి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ఈరోజు నాగచైతన్య పుట్టినరోజు సందర్భంగా ఆయన చెప్పిన విశేషాలు.

11/23/2015 - 05:38

ముంబైలో అట్టహాసంగా జరిగిన అజింక్య డివైపాటిల్ ఫిల్మ్‌ఫేర్ (మరాఠి) అవార్డుల ప్రదానోత్సవంలో బాలీవుడ్ తారలు మిలమిల మెరిసారు. సంప్రదాయ దుస్తులు ధరించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ప్రముఖ తారలు విద్యాబాలన్, టబు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

11/23/2015 - 05:37

ఈ ఏడాది ‘గోపాల గోపాల’ సినిమా తర్వాత ఇంతవరకూ మరే చిత్రంలో నటించలేదు వెంకటేష్. ప్రస్తుతం చాలా కథలు వింటున్న ఆయన ఓ చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. ఇటీవలే ‘భలే భలే మగాడివోయ్’ సినిమాతో మంచి హిట్‌ను అందుకున్న మారుతి దర్శకత్వంలో ఈ చిత్రం ఉంటుంది. ఇప్పటికే కథా చర్చలు జరుపుకుంటున్న ఈ చిత్రం డిసెంబర్ రెండో వారంలో ప్రారంభం కానుందట.

11/23/2015 - 05:36

‘మోహన్‌బాబు @ 40’లో దాసరి

11/23/2015 - 05:31

మహేష్‌బాబు, సమంత, కాజల్, ప్రణీత హీరోహీరోయిన్లుగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో పి.వి.పి.సినిమా పతాకంపై పరంవి పొట్లూరి నిర్మిస్తున్న చిత్రం ‘బ్రహ్మోత్సవం’.

11/23/2015 - 05:31

సంచలన దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మ దర్శకత్వంలో శివరాజ్‌కుమార్, పరుల్‌యాదవ్, సందీప్ భరద్వాజ్ ముఖ్యపాత్రల్లో శ్రీ కృష్ణ క్రియేషన్స్, జి.ఆర్.పిక్చర్స్, జడ్ 3 పిక్చర్స్ పతాకాలపై రూపొందుతున్న చిత్రం ‘కిల్లింగ్ వీరప్పన్’. బి.వి.మంజునాథ్, ఇ.శివప్రకాశ్, బి.ఎస్.సుదీంద్ర నిర్మాతలు.

11/21/2015 - 22:56

మాజీ క్రికెటర్ శ్రీశాంత్ హీరోగా తెలుగు, తమిళ భాషల్లో ఓ చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. శ్రీశాంత్ తొలిసారిగా హీరోగా నటిస్తున్న ఈ చిత్రాన్ని సాన యాదిరెడ్డి రూపొందిస్తున్నారు. ఇప్పటికే స్క్రిప్ట్‌వర్క్ పూర్తిచేసుకున్న ఈ చిత్రం త్వరలోనే సెట్స్ పైకి రానుంది. శ్రీశాంత్ సరసన హీరోయిన్‌గా ‘లవ్‌లీ’ ఫేమ్ శాన్వి నటిస్తోందట.

11/21/2015 - 22:53

సంజయ్‌లీలా బన్సాలీ దర్శకత్వంలో రూపొందుతున్న చారిత్రక చిత్రం బాజీరావ్ మస్తానీ ట్రైలర్
విడుదలైంది. రణవీర్‌సింగ్, దీపికాపదుకొనె, ప్రియాంక చోప్రా నటిస్తున్న ఈ చిత్రం ట్రైలర్ అందరినీ

11/21/2015 - 22:49

రవితేజ, తమన్నా, రాశిఖన్నా హీరోహీరోయిన్లుగా సంపత్‌నంది దర్శకత్వంలో కె.కె.రాధామోహన్ నిర్మిస్తున్న ‘బెంగాల్ టైగర్’ చిత్రం డిసెంబర్ 10న విడుదలకు సిద్ధమైంది. ఇటీవలే విడుదలైన పాటలకు మంచి స్పందన రావడంతో శనివారం హైదరాబాద్‌లో పాత్రికేయుల సమావేశం ఏర్పాటుచేశారు. ఈ కార్యక్రమంలో నిర్మాత రాధామోహన్ మాట్లాడుతూ డిసెంబర్ 10న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నామన్నారు.

11/21/2015 - 22:46

బాహుబలిలో భల్లాలదేవ పాత్రలో నటించి మెప్పించిన దగ్గుబాటి రానాకు ఆసియన్ విజన్ మూవీ అవార్డు లభించింది. ఈ విషయాన్ని రానా తన ట్విట్టర్‌లో పేర్కొన్నారు. వచ్చే ఏడు డిసెంబర్‌లో దుబాయ్‌లో జరిగే ఉత్సవంలో ఆయనకు ఈ అవార్డును బహూకరిస్తారు.

Pages