S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

11/21/2016 - 00:23

షిర్డీ, నవంబర్ 20: రద్దయిన వెయ్యి, అయిదు వందల రూపాయల నోట్లను తమ విరాళాల స్వీకరణ కౌంటర్లలో తీసుకోవడం నిలిపివేసినట్లు మహారాష్టల్రోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన షిర్డీ సాయిబాబా సంస్థాన్ ఆదివారం ప్రకటించింది.

11/21/2016 - 00:22

న్యూఢిల్లీ, నవంబర్ 20: వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి) విషయంలో ఎవరి అజమాయిషీ ఎంత అనే దానిపై కేంద్రానికి, రాష్ట్రాలకు మధ్య ప్రతిష్టంభన కొనసాగుతోంది. రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ ఆదివారం నిర్వహించిన సమావేశం ఈ ప్రతిష్టంభనను తొలగించడంలో విఫలమైంది.

11/20/2016 - 04:14

చెన్నై, నవంబర్ 19: తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరో గ్యం పూర్తిగా కుదుటపడింది. దాదాపు రెండు నెలలుగా చెన్నై అపోలో ఆసుపత్రిలోని క్రిటికల్ కేర్ విభాగంలో చికిత్స పొందుతున్న జయలలిత శనివారం ప్రైవేటు గదికి మారారని అన్నాడిఎంకె అధికార ప్రతినిధి సి.ఆర్. సరస్వతి విలేఖరులకు చెప్పారు. ‘మేం దేవుడికి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాం. గౌరవనీయులైన మా ముఖ్యమంత్రి వార్డుకు బదిలీ అయ్యారు.

11/20/2016 - 04:09

న్యూఢిల్లీ, నవంబర్ 19:శ్రీకాకుళం జిల్లాలోని భావనపాడు గ్రీన్ ఫీల్డ్ ఓడరేవు నిర్మాణాన్ని పిపిపి పద్ధతిలో చేపట్టవద్దని కోరుతూ కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు కెవిపి రామచంద్రరావు ఏపి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుకు లేఖ రాశారు.

11/20/2016 - 04:08

న్యూఢిల్లీ, నవంబర్ 19: రైళ్లలో సెకండ్‌క్లాస్ స్లీపర్, జనరల్ కోచ్‌లలో మొబైల్ చార్జింగ్ పాయింట్లను పెంచుతున్నట్లు రైల్వే శాఖ ప్రకటించింది. ఇంతకు ముందు కోచ్‌కు ఎనిమిది మాత్రమే మొబైల్ చార్జింగ్ పాయింట్లు ఉండేవి. ఇప్పుడు వాటి సంఖ్యను 18కి పెంచుతున్నట్లు రైల్వే అధికారులు పేర్కొన్నారు. 7977 స్లీపర్, 4634 జనరల్ కోచ్‌లలో చార్జింగ్ పాయింట్లను పెంచారు.

11/20/2016 - 03:53

ముంబయి, నవంబర్ 19: పెద్ద నోట్ల రద్దు అనంతరం దేశంలో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితులను ప్రస్తావిస్తూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రఖ్యాత పాప్ గాయకుడు, నోబెల్ బహుమతి గ్రహీత బాబ్ డిలాన్ గళం నుంచి జాలువారిన ‘ది టైమ్స్ దే యార్ చేంజింగ్’ (కాలం మారుతోంది) అనే పాటలోని కొన్ని పంక్తులను ఉటంకించారు.

11/20/2016 - 03:03

చింతూరు, నవంబర్ 19: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం నారాయణపూర్ జిల్లాలో శుక్రవారం రాత్రి పోలీసులు, మావోయిస్టుల మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో అయిదుగురు మావోయిస్టులు మృతి చెందారు. ఈ ఘటనకు సంబంధించి నారాయణపూర్ ఎస్పీ అభిషేక్ మీనా వెల్లడించిన వివరాలిలావున్నాయి.

11/20/2016 - 02:55

న్యూఢిల్లీ, నవంబర్ 19: దివంగత ప్రధాన మంత్రి ఇందిరాగాంధీ 99వ జయంతిని పురస్కరించుకొని శనివారం ఆమెకు రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ, ఉప రాష్టప్రతి హమీద్ అన్సారీ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ తదితరులు నివాళులు అర్పించారు.

11/20/2016 - 02:53

న్యూఢిల్లీ, నవంబర్ 19: పెద్దనోట్ల రద్దుపై అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం సాగుతూనే ఉంది. కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ 500, 1000 రూపాయల నోట్ల రద్దు సాహసోపేతమైన చర్యగా అభివర్ణించగా, మాజీ కేంద్ర ఆర్థిక మంత్రి పి చిదంబరం, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, కర్నాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య తీవ్రంగా వ్యతిరేకించారు.

11/20/2016 - 02:48

గౌహతి, నవంబర్ 19: అసోంలో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. ఎగువ అసోంలో తిన్‌సుకియా జిల్లా పెన్‌గెరి వద్ద ఆర్మీ వాహనం లక్ష్యంగా శనివారం ఉల్ఫా ఉగ్రవాదులు, ఎన్‌ఎస్‌సిఎన్(కె) ఉగ్రవాదులు సంయుక్తంగా జరిపిన పేలుడులో కనీసం ముగ్గురు ఆర్మీ జవాన్లు మృతి చెందగా మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.

Pages