S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

02/25/2020 - 23:34

న్యూఢిల్లీ: ఢిల్లీలో జరిగిన అల్లర్లపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా సారథ్యంలో మంగళవారం ఉన్నతాధికార సమావేశం జరిగింది. నగరంలో హింసను అదుపు చేయడానికి వదంతుల వ్యాప్తిని కట్టడి చేయాలని, అలాగే పోలీసులు, ఎమ్మెల్యేల మధ్య సమన్వయం పెంపొందాలని ఈ సమావేశం తీర్మానించింది. ఈ కీలక భేటీలో ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్, లెఫ్ట్‌నెంట్ జనరల్ అనిల్ బైజల్, పోలీస్ కమిషనర్ అమూల్య పట్నాయక్ తదితరులు పాల్గొన్నారు.

02/25/2020 - 23:32

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 25: హింసాత్మక సంఘటనలతో ఈశాన్య ఢిల్లీ అట్టుడికిపోయింది. వరుసగా మూడో రోజు మంగళవారం విచ్చల విడిగా దహనాలు, రాళ్ల దాడులు సాగాయి. సీఏఏ వ్యతిరేక, మద్దతుదారుల ఆందోళనతో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఘర్షణల్లో పది మంది మరణించారు. సోమవారం నాడు ఓ హెడ్‌కానిస్టేబుల్ సీఏఏ ఘర్షణల్లో మృతి చెందాడు. పలువురు పోలీసు అధికారులపైన నిరసనకారులు దాడులు చేసి గాయపరించారు.

,
02/26/2020 - 01:56

న్యూఢిల్లీ: అమెరికా ప్రథమ మహిళ మెలానియా ట్రంప్ సంతోషానికి అవధుల్లేకుండాపోయాయి. ఓ ప్రభుత్వ పాఠశాలకు తనను ఆహ్వానించడమే కాకుండా అక్కడి విద్యార్థులు పలికిన స్వాగతాన్ని చూసి మురిసిపోయారు.

02/25/2020 - 23:25

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 25: ఈ వార్త వింటే గుండె గుభేలుమంటుంది. ప్రపంచంలో వాయు కాలుష్య కోరల్లో 30 నగరాలు చిక్కుకుంటే, అందులో 21 మన దేశంలో ఉన్నాయి. అంతేకాదు సుమా! భారత దేశం ప్రపంచంలోనే ఐదవ స్థానంలో నిలిచింది. ఐక్యూఏయిర్ సంస్థ గత ఏడాది ప్రపంచంలోని ముఖ్య నగరాలు, పట్టణాల్లో వాయు కాలుష్యంపై అధ్యయనం చేసింది.

02/25/2020 - 23:23

పాట్నా, ఫిబ్రవరి 25: జాతీయ పౌర నమోదు(ఎన్‌ఆర్‌సీ)కి వ్యతిరేంగా బిహార్ అసెంబ్లీ మంగళవారం ఏకగ్రీవ తీర్మానం ఆమోదించింది. నేషనల్ పాపులేషన్ రిజిస్టర్(ఎన్‌పీఆర్)ను 2010 నాటి పాత ఫార్మెట్‌లోనే రాష్ట్రంలో అమలు చేస్తామని ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ప్రకటించారు. ఎట్టిపరిస్థితుల్లోనూ రాష్ట్రంలో ఎన్‌ఆర్‌సీని అమలు చేయబోమని ప్రభుత్వం ప్రకటించింది.

02/25/2020 - 23:21

సిమ్లా, ఫిబ్రవరి 25: కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టం, రాజ్యాంగంలోని 370వ అధికరణ రద్దుకు హిమాచల్‌ప్రదేశ్ ప్రభుత్వం మద్దతు ఇస్తుందని ఆశిస్తున్నట్లు ఆ రాష్ట్ర గవర్నర్ బండారు దత్తాత్రేయ స్పష్టం చేశారు. హిమాచల్‌ప్రదేశ్ బడ్జెట్ సమావేశాల ప్రారంభ సందర్భంగా అసెంబ్లీని ఉద్దేశించి మంగళవారం ఆయన మాట్లాడారు.

02/25/2020 - 05:17

ఆగ్రా: ప్రేమకు చిహ్నం.. ప్రపంచంలోనే అద్భుత కట్టడాల్లో ఒకటైన తాజ్‌మహల్.. అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడి సందర్శనకు వేదికైంది. రెండు రోజుల పర్యటనలో భాగంగా భారత్‌కు సోమవారం విచ్చేసిన ట్రంప్, ఆయన భార్య, అమెరికా ప్రథమ మహిళ మెలానియా ట్రంప్‌తో కలిసి ఆగ్రాలోని చారిత్రక కట్టడమైన తాజ్‌మహల్ అందాలను తిలకించి మంత్ర ముగ్ధులయ్యారు.

02/25/2020 - 04:57

లక్నో, ఫిబ్రవరి 24: అయోధ్య కేసులో సుప్రీం కోర్టు తీర్పుమేరకు వచ్చే ఐదెకరాల స్థలంలో మసీదు, ఆసుపత్రిని నిర్మిస్తామని సున్నీ కేంద్ర వక్ఫ్ బోర్డు సోమవారం ప్రకటించింది. అలాగే ఇండో-ఇస్లామిక్ పరిశోధన కేంద్రం ఒకదాన్ని కట్టాలని ఇక్కడ జరిగిన బోర్టు సమావేశంలో నిర్ణయించారు.

02/25/2020 - 04:26

అహ్మదాబాద్, ఫిబ్రవరి 24: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కోసం సబర్మతీ ఆశ్రమంలో ఘుమఘుమలాడే గుజరాతీ వంటకాలను ఎన్నింటినో సిద్ధం చేసినా కనీసం వాటిని ముట్టుకొనైనా లేదు. ముఖ్యంగా గుజరాతీ వంటకాల్లో ప్రసిద్ధమైన ఖమన్‌ను హైటీలో భాగంగా సిద్ధం చేశారు. దాదాపు 15 నిమిషాలపాటు సబర్మతీ ఆశ్రమంలోనే ట్రంప్, ఆయన భార్య మెలానియా గడిపారు.

02/25/2020 - 04:25

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 24: అమెరికా ఆధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండు రోజుల పర్యటన నేపథ్యంలో భారత దేశం ప్రతిష్టను దెబ్బతీసేందుకే ఈశాన్య ఢిల్లీలో హింసాత్మక సంఘటనలకు పాల్పడ్డారని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జి.కిషన్ రెడ్డి ఆరోపించారు. భారత దేశం పరువు, ప్రతిష్టను దెబ్బ తీసే వారిని ఎటువంటి పరిస్థితిలో వదిలిపెట్టమని కిషన్ రెడ్డి సోమవారం మీడియాతో మాట్లాడుతూ హెచ్చరించారు.

Pages